విశ్వనాథన్ ఆనంద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశ్వనాథన్ ఆనంద్
Viswanathan Anand 08 14 2005.jpg
Full nameవిశ్వనాథన్ ఆనంద్
Country భారతదేశం
Titleగ్రాండ్‌మాస్టర్ (1988)
World Champion2000-2002 (FIDE), 2007-present
FIDE rating2799
(జనవరి 2008 FIDE ర్యాంకింగుల్లో రెండవ స్థానం)
Peak rating2803 (April 2006)

ప్రపంచ చదరంగం క్రీడలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా పిన్న ప్రాయంలోనే చెస్ క్రీడలో నైపుణ్యం సంపాదించాడు. 14 వ ఏటనే సబ్-జూనియర్ జాతీయ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు. 1985 లోనే ఇంటర్నేషనల్ మాస్టర్గా అవతరించాడు. 16 వ ఏటనే 1985లో జాతీయ చాంపియన్ షిప్ చేజిక్కించుకున్నాడు. 1987 లోనే ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్ షిప్ సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్శించాడు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఆ సమయంలోనే గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు. ఈ విషయంలో కూడా దేశంలో ప్రప్రథముడు ఇతనే కావడం గమనార్హం.2000 లోనే మొట్టమొదటి సారిగా మనదేశానికి చెస్ ప్రపంచ చాంపియన్ షిప్ ను సాధించి పెట్టిన రికార్డు మరువలేనిది. 2003లో ఫ్రాన్స్లో జరిగిన రాపిడ్ చెస్ చాంపియన్ షిప్ లో కూడా గెల్చి తన ఘనతను మరింతగా ప్రపంచానికి చాటిచెప్పాడు. 2007 సెప్టెంబరు 30 న ఫైడ్ ప్రపంచ చెస్ కిరీటాన్ని రెండో పర్యాయం చేజిక్కించుకొని తనకు సాటిలేదని నిరూపించాడు. 2007 అక్టోబరు 1 న అత్యధిక పాయింట్లతో పైడ్ రేటింగ్ సాధించి ప్రపంచ నెంబర్ వన్ గా నిలిచాడు.

సాధించిన అవార్డులు[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]