సైనా నెహ్వాల్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సైనా నెహ్వాల్
Saina Nehwal in 2011.jpg
వ్యక్తిగత సమాచారం
జన్మనామం సైనా నెహ్వాల్
జననం (1990-03-17) 17 మార్చి 1990 (వయస్సు: 27  సంవత్సరాలు)[1]
ధిండార్, హిస్సార్ జిల్లా, హర్యానా
నివాసము హైదరాబాదు, telangana
ఎత్తు 1.65 m (5 ft 5 in)
బరువు 60 kg (130 lb)
దేశం  భారతదేశం
వాటం కుడి చేయి
మహిళల సింగిల్స్
అత్యున్నత స్థానం 2[2] (2 డిసెంబరు2010)
ప్రస్తుత స్థానం 2[3] (14 మార్చి 2013)
గెలుపులు 2009 ఇండోనేషియా సూపర్ సిరీస్
సింగపూర్ సూపర్ సిరీస్
2010 ఇండోనేషియా సూపర్ సిరీస్
2010 హాంగ్‌కాంగ్ సూపర్ సిరీస్
చైనీస్ తైపీ ఓపెన్
ఇండియా ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్
2011 స్విస్ ఓపెన్
2012 స్విస్ ఓపెన్
2012 ఇండోనేషియా సూపర్ సిరీస్ ప్రీమియర్
2012 లండన్ ఒలింపిక్స్
2012 డెన్మార్క్ సూపర్ సిరీస్ ప్రీమియర్
BWF profile

సైనా నెహ్వాల్ (జ. 17 మార్చి, 1990)[4] ప్రముఖ భారత బాడ్మింటన్ క్రీడాకారిణి. ఒలింపిక్ క్రీడలలో క్వార్టర్ ఫైనల్ చేరడమే కాకుండా ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ సాధించిన తొలి మహిళగా అవతరించింది. ప్రస్తుతం భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ ఆమెకు శిక్షకుడిగా ఉన్నాడు. జూన్ 20, 2010న సింగపూర్‌లో జరిగిన సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సీరీస్ టైటిల్‌ను నెగ్గి రెండు సూపర్ సీరీస్ టైటిళ్ళు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అవతరించినది.[5]

ప్రారంభ జీవితం[మార్చు]

సైనా నెహ్వాల్ హర్యానాలోని హిస్సార్ లో మార్చి 17, 1990న జన్మించింది. తలిదండ్రులిద్దరూ హర్యానా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సాధించినవారే.[6].

క్రీడా జీవితం[మార్చు]

2006
2006లో ఫిలిప్పీన్స్ ఓపెన్ బ్యాడ్మింటన్‌ను గెలిచి 4-స్టార్ ఓపెన్‌ను గెలిచిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించుటతో సైనా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ టోర్నమెంటులో 86వ సీడ్‌గా ప్రవేశించిన ఆమె పలు టాప్‌సీడ్‌లను ఓడించి చివరకు విజేతగా నిల్చింది. అదే సంవత్సరం BWF ప్రపంచ చాంపియన్‌లో రన్నరప్‌గా నిల్చింది.
2007:
ఇండియా నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో విజయం సాధించి, జాతీయ క్రీడలలో బ్యాడ్మింతన్ స్వర్ణాన్ని గెలుచుకుంది.
2008
2008లో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌ను సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. చైనా మాస్టర్ సూపర్ సీరీస్‌లో సెమీస్ వెళ్ళగలిగింది. ఇండియన్ నేషనల్ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌లో విజేతగా నిలిచి, అదే సంవత్సరం కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో స్వర్ణపతకం సాధించినది. ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కూడా టైటిల్ సాధించింది.
2009
ఇండోనేషియా ఓపెన్‌లో టైటిల్ సాధించి, BWF ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళగలగింది.
2010
ఆల్‌ఇంగ్లాండు సూపర్ సీరీస్ సెమీస్ వరకు వెళ్ళింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యపతకం పొందినది. ఇండియా ఓపెన్, ఇండోనేష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రిక్స్‌లలో టైటిళ్ళను సాధించింది.
ఒలింపిక్ క్రీడలలో

2008 ఒలింపిక్ క్రీడలలో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ చేరుకొని ఇందులోనూ ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా అవతరించింది.

సాధించిన విజయాలు[మార్చు]

పోటీ సంవత్సరం ఫలితం
చెకొస్లోవేకియా జూనియర్ ఓపెన్ 2003 1Gold medal icon.svg స్వర్ణపతకం
2004 కామన్వెల్త్ యూత్ క్రీడలు 2004 2Silver medal icon.svg రజతపతకం
ఏషియన్ శాటిలైట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2005 1Gold medal icon.svg స్వర్ణపతకం
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింతన్ చాంపియన్‌షిప్ 2006 2Silver medal icon.svg రజతపతకం
2006 కామన్వెల్త్ క్రీడలు 2006 3Bronze medal icon.svg కాంస్యపతకం
ఫిలిప్పీన్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2006 1Gold medal icon.svg స్వర్ణపతకం
ఏషియన్ శాటిలైట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2006 1Gold medal icon.svg స్వర్ణపతకం
జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ 2007 1Gold medal icon.svg స్వర్ణపతకం
జాతీయ క్రీడలు 2007 1Gold medal icon.svg స్వర్ణపతకం
చైనీస్ తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ 2008 1Gold medal icon.svg స్వర్ణపతకం
జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ 2008 1Gold medal icon.svg స్వర్ణపతకం
2008 కామన్వెల్త్ యూత్ క్రీడలు 2008 1Gold medal icon.svg స్వర్ణపతకం
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ 2008 1Gold medal icon.svg స్వర్ణపతకం
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింతన్ చాంపియన్‌షిప్ 2008 1Gold medal icon.svg స్వర్ణపతకం
ఇండోనేషియా ఓపెన్ 2009 1Gold medal icon.svg స్వర్ణపతకం
ఆసియా చాంపియన్‌షిప్ బ్యాడ్మింటన్ 2010 3Bronze medal icon.svg కాంస్యపతకం
ఇండియా ఓపెన్ హ్రాండ్‌ప్రిక్స్ 2010 1Gold medal icon.svg స్వర్ణపతకం
సింగపూర్ ఓపెన్ సూపర్ సీరీస్ 2010 1Gold medal icon.svg స్వర్ణపతకం
2010 కామన్వెల్త్ క్రీడలు 2010 1Gold medal icon.svg స్వర్ణపతకం

మూలాలు[మార్చు]