Jump to content

పుల్లెల గోపీచంద్

వికీపీడియా నుండి
పుల్లెల గోపీచంద్
పుల్లెల గోపీచంద్
వ్యక్తిగత సమాచారం
జననం (1973-11-16) 1973 నవంబరు 16 (age 51)
నాగండ్ల
ప్రకాశం జిల్లా
ఆంధ్రప్రదేశ్
ఎత్తు1.88 మీ. (6 అ. 2 అం.)
బరువు74kg
దేశం భారతదేశం India
వాటంకుడి చేయి
పురుషుల సింగిల్స్
అత్యున్నత స్థానం5[1] (15 మార్చి 2001)
Medal record
Representing  భారతదేశం
Men's badminton
All England Championships
Gold medal – first place 2001 Birmingham Men's singles
Commonwealth Games
Bronze medal – third place 1998 Kuala Lumpur Men's singles
BWF profile

1973 నవంబర్ 16ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా, నాగండ్లలో జన్మించిన పుల్లెల గోపీచంద్ (ఆంగ్లం: Pullela Gopichand) భారతదేశపు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. 2001లో చైనాకు చెందిన చెన్‌హాంగ్ ను ఓడించి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెల్చి ఈ ఘనతను సాధించిన రెండో భారతీయుడిగా నిల్చాడు. ఇంతకు పూర్వం 1980లో ఈ ఘనతను ప్రకాష్ పడుకోనె సాధించాడు. గోపీచంద్ సాధించిన అపురూప విజయానికి గుర్తింపుగా 1999లో అర్జున పురస్కారము, 2000-01 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు లభించాయి. కాని ఆ తర్వాత దురదృష్టవశాత్తు తను గాయపడడంతో 2003లో అతని స్థానం 126 కు పడిపోయింది. 2005లో భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం గోపీచంద్ పుల్లెల్ల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని నిర్వహిస్తున్నారు. శిష్యురాలు సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ రంగములో తన ప్రతిభను చాటుతున్నది.

జులై 29, 2009న భారత ప్రభుత్వం గోపీచంద్ కు ద్రోణాచార్య పురస్కారము ప్రకటించింది. 2014లో ఈయనకు ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డు లభించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

పుల్లెల గోపీచంద్ 5 జూన్ 2002న పీ.వీ.వీ. లక్ష్మి ని వివాహం చేసుకున్నాడు. [2] వారికీ ఇద్దరు పిల్లలు గాయత్రి & విష్ణు ఉన్నారు. గాయత్రి 2015లో అండర్ - 13 జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్,[3] కుమారుడు విష్ణు గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "Historical Ranking". Badminton World Federation. Retrieved 7 February 2010.[permanent dead link]
  2. Rediff (5 June 2002). "Gopichand to wed PVV Lakshmi". Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.
  3. Deccan Chronicle (29 June 2018). "Badminton in her blood" (in ఇంగ్లీష్). Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.

బయటి లింకులు

[మార్చు]