ధనరాజ్ పిళ్ళై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధనరాజ్ పిళ్ళై
2010లో పిళ్ళై
వ్యక్తిగత వివరాలు
పూర్తి పేరు ధనరాజ్ పిళ్ళై
జననం (1968-07-16) 1968 జూలై 16 (వయసు 55)
ఖడ్కీ, పూణె, మహారాష్ట్ర, భారతదేశం
ఎత్తు 5 ft 8 in (1.73 m)[1]
ఆడే స్థానము ఫార్వార్డ్ పొజిషన్
క్రీడా జీవితము
సంవత్సరాలు Team Apps (Gls)
1992–1993 ఇండియన్ జింఖానా 78 (200)
1993 హెచ్ సి లియోన్
1994–1997 సేలంగోర్ హెచ్.ఎ 7 (8)
1997–1999 అబహాని లిమిటెడ్ (ఢాకా)
2000 హెచ్టిసి స్టట్‌గార్ట్ కిక్కర్స్
2000–2001 బ్యాంక్ సింపనన్ నేషనల్ హెచ్సి
2002 ఆర్థర్ ఆండర్సన్ హెచ్‌సి
2002 సింగపూర్ హాకీ ఫెడరేషన్
2006–2008 మరాఠా వారియర్స్
2012 కర్ణాటక లయన్స్ 6 (1)
జాతీయ జట్టు
1989–2004 ఇండియా మెన్స్ నేషనల్ ఫీల్డ్ హాకీ టీమ్ 339 (170)

ధనరాజ్ పిళ్ళై (జననం: 16 జూలై 1968) భారతీయ హాకీ క్రీడాకారుడు, భారత జాతీయ హాకీ జట్టు మాజీ కెప్టెన్.[2] ప్రస్తుతం ఇతను భారత హాకీ జట్టుకు మేనేజర్‌గా ఉన్నాడు. 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఇతన్ని పద్మశ్రీతో సత్కరించింది.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ధనరాజ్ పిళ్ళై మహారాష్ట్రలోని ఖడ్కీలో నాగలింగం పిళ్ళై, ఆండాళమ్మలకు నాల్గవ కుమారుడిగా జన్మించాడు.[4] ఇతను తమిళం (మాతృభాష), హిందీ, మరాఠీ, ఆంగ్ల భాషలలో నిష్ణాతుడు.

వృత్తి జీవితం

[మార్చు]

పిళ్ళై తన బాల్యాన్ని ఎక్కువగా అతని తండ్రి గ్రౌండ్స్‌మన్ గా పనిచేసిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్టాఫ్ కాలనీలో గడిపాడు, చిన్నప్పుడు విరిగిన కర్రలతో అతని సోదరులు, స్నేహితులతో హాకీ ఆడేవాడు. అతని తల్లి ప్రోత్సహంతో ముంబై లీగ్‌లో ఆర్సీఎఫ్ కోసం ఆడిన తన అన్నయ్య రమేష్‌తో కలిసి ఉండటానికి ధనరాజ్ ముంబైకి వెళ్లాడు. రమేష్ అప్పటికే అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారతదేశం తరపున ఆడాడు, అతని మార్గదర్శకత్వం ధనరాజ్ అద్భుతమైన పేస్ స్ట్రైకర్‌గా ఎదగడానికి సహాయపడింది. అతను మహీంద్రా & మహీంద్రాలో చేరాడు, అక్కడ అతను అప్పటి భారత కోచ్ జోక్విమ్ కార్వాల్హో దగ్గర శిక్షణ పొందాడు. ధనరాజ్ పిళ్ళై 1989లో అంతర్జాతీయ హాకీలో అరంగేట్రం చేసాడు. 1989లో న్యూ ఢిల్లీలో జరిగిన ఆల్విన్ ఆసియా కప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు, 15 సంవత్సరాల కెరీర్‌లో అతను భారతదేశం తరపున నాలుగు ఒలింపిక్స్ (1992, 1996, 2000, 2004), నాలుగు ప్రపంచ కప్‌లు (1990, 1994, 1998, 2002), నాలుగు ఛాంపియన్స్ ట్రోఫీలు (1995, 1996, 2002, 2003), నాలుగు ఆసియా క్రీడలు (1990, 1994, 1998, 2002) ఆడిన ఏకైక ఆటగాడు.[5] ఇతని కెప్టెన్సీలో భారతదేశం, ఏషియన్ గేమ్స్‌ (1998), ఆసియా కప్ (2003) పోటీల్లో గెలిచింది. ధనరాజ్ బ్యాంకాక్ ఏషియన్ గేమ్స్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు, 1994 సిడ్నీలో జరిగిన ప్రపంచ కప్‌లో వరల్డ్ ఎలెవెన్ జట్టులో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ ఆటగాడు.

క్లబ్ హాకీ

[మార్చు]

ధనరాజ్, ఇండియన్ జింఖానా (లండన్), హెచ్‌సి లియోన్ (ఫ్రాన్స్), బిఎస్‌ఎన్ హెచ్‌సి & టెలికామ్ మలేషియా హెచ్‌సి (మలేషియా), అబాహాని లిమిటెడ్, హెచ్‌టిసి స్టట్‌గార్ట్ కిక్కర్స్ (జర్మనీ), ఖల్సా స్పోర్ట్స్ క్లబ్ (హాంకాంగ్) వంటి విదేశీ క్లబ్‌ల కోసం కూడా ఆడాడు.[6] అతని కెరీర్ చివరిలో, ధనరాజ్ మరాఠా వారియర్స్ తరపున ప్రీమియర్ హాకీ లీగ్‌లో రెండు సీజన్లలో ఆడాడు. భారత్‌లో జరిగిన వరల్డ్ సిరీస్ హాకీలో కర్నాటక లయన్స్ తరఫున ధన్‌రాజ్ పిళ్ళై హాజరయ్యాడు. భారత మాజీ కెప్టెన్ అర్జున్ హాలప్ప కెప్టెన్సీలో అతను తన జట్టు కోసం రెండు గోల్స్ చేశాడు. అతను బైటన్ కప్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ తరపున కూడా ఆడాడు.[7] అతను ప్రస్తుతం అదే జట్టుకు కోచ్‌గా ఉన్నాడు.

అవార్డులు

[మార్చు]
 • 1999 - 2000: రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు.
 • 2000 - పద్మశ్రీ అవార్డు.
 • 2002: ఆసియా కప్ హాకీలో స్వర్ణం సాధించిన జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.
 • 2002: ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు.
 • అతను జర్మనీలోని కొలోన్‌లో జరిగిన 2002 ఛాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందుకున్నాడు.
 • 2017లో, ఈస్ట్ బెంగాల్ క్లబ్ పిళ్ళైకి భారత్ గౌరవ్ అవార్డును ప్రదానం చేసింది.[8] [9]

జీవిత చరిత్ర

[మార్చు]

‘ఫర్గివ్ మి అమ్మ' అనే పేరుతో అతని జీవిత చరిత్ర విడుదలైంది.[10] దాదాపు మూడు దశాబ్దాలుగా అతని కెరీర్‌ను అనుసరించిన జర్నలిస్టు సందీప్ మిశ్రా ఈ పుస్తకాన్ని రచించాడు.[11] [12]

మూలాలు

[మార్చు]
 1. "Dhanraj Pillay". Dimdima. Retrieved 13 January 2013.
 2. "Dhanraj Pillay, Indian Hockey Player Dhanraj Pillai". www.indiaonline.in. Retrieved 2023-06-28.
 3. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 4. "Dhanraj Pillay: Bio, Career, Matches, and Records". shortpedia. Retrieved 2023-06-28.
 5. "Dhanraj Pillay". worldbookofrecords.uk. Retrieved 2023-06-28.
 6. Marar, Nandakumar (12 October 2002). "Power and magic". The Hindu. Archived from the original on 17 May 2003. Retrieved 12 February 2017.
 7. "Dhanraj gives Indian Airlines Beighton Cup".
 8. "East Bengal honours Dhanraj Pillay with Bharat Gaurav". The Hindu. 3 August 2017. Retrieved 16 September 2017.
 9. "Dhanraj Pillay conferred with Bharat Gaurav by East Bengal Football Club". Jagranjosh. Archived from the original on 19 December 2019. Retrieved 19 December 2019.
 10. "'అమ్మా నన్ను మన్నించు'.. హాకీ దిగ్గజం ధనరాజ్‌ పిళ్లై". Sakshi. 2023-06-25. Retrieved 2023-06-28.
 11. "Dhanraj Pillay eyes coaching role post-retirement". The Times of India. 17 May 2007. Retrieved 10 February 2017.
 12. Ugra, Sharda (11 June 2007). "A Stick in Time". India Today. Retrieved 10 February 2017.