పూసర్ల వెంకట సింధు (జననం: జూలై 5, 1995) భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.[1] 2016 లో జరిగిన రియో ఒలంపిక్స్ లో రజత పతకం సాధించి ఒలంపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది.[2]
సెప్టెంబరు 21, 2012 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకోవడం ద్వారా సింధుకు మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది.[3] ఆగస్టు 10, 2013 న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించి అలా గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. మార్చి 30, 2015న సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రధానం చేసింది.[4] ఆగస్టు 18, 2016 న రియో ఒలంపిక్స్ లో జరిగిన సెమీఫైనల్లో జపాన్ కు చెందిన నోజోమీ ఒకుహరాను ఓడించడం ద్వారా ఒలంపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. తరువాత జరిగిన ఫైనల్లో రజత పతకం సాధించి ఒలంపిక్స్ లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా, అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా నిలిచింది.[5] సైనా నెహ్వాల్ 2012 ఒలంపిక్స్ లో కాంస్యపతకం సాధించిన తరువాత బ్యాడ్మింటన్ లో పతకం సాధించిన రెండో క్రీడాకారిణి సింధు.[6]
2013 లో తొలిసారి ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో ఆడిన తెలుగు అమ్మాయి, ప్రపంచ 12వ ర్యాంకర్ పి.వి.సింధు సంచలనం నమోదు చేసింది. తన కంటే మెరుగైన ర్యాంకులో ఉన్న చైనా క్రీడాకారిణిని ఓడించి కార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆగస్టు 8, 2013 న జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ యిహాన్ వాంగ్‌ను 21-18, 23-21తో సింధు ఓడించింది. 55 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టి కరిపించింది.
కవోరి ఇమబెపు (జపాన్)తో ఆగస్టు 7, 2013జరిగిన రెండో రౌండ్‌లో సింధు 21-19, 19-21, 21-17తో విజయం సాధించింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు గట్టిపోటీనే లభించింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు ఒక దశలో 10-13తో వెనుకబడింది. ఈ దశలో ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో ఆడిన సింధు వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 14-13తో ఆధిక్యంలోకి వచ్చింది. అనంతరం ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకుంది.
2016 రియో ఒలింపిక్స్
పతకాల కోసం భారత్ తల్లడిల్లుతున్న సమయంలో పి.వి.సింధు భారత్‌కు రెండో పతకాన్ని ఖాయం చేసింది. ఈ ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో గ్రూప్ ఎంలో కెనడాకు చెందిన మిషెల్లీ లీను 2-1 తేడాతో, హంగరీకి చెందిన లారా సరోసీని 2-0 తేడాతో ఓడించి 16వ రౌండులో చైనీస్ తాయ్ జూ యింగ్ పై 2-0 తో గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.
క్వార్టర్ ఫైనల్‌లో చైనాకు చెందిన వాంగ్ ఇహాన్‌ను 2-0 తో ఓడించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. 2016, ఆగస్టు 18వ తేదీ జరిగిన సెమీ ఫైనల్స్‌లో జపాన్ క్రీడాకారిణి నొజోమి ఒకుహరాతో వీరోచితంగా పోరాడి 2-0 తో ఆమె పై విజయం సాధించి ఫైనల్స్‌కు చేరింది[12].
2016, ఆగస్టు 19వ తేదీన జరిగిన ఫైనల్స్‌లో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్ తో వీరోచితంగా పోరాడి 21-19, 12-21,15-21 పాయింట్లతో పరాజయం పాలయింది. ఈ ఒలింపిక్స్‌లో మహిళల సింగల్స్ బ్యాడ్‌మింటన్‌లో ద్వితీయ స్థానం పొంది ఈ క్రీడలలో భారత్‌కు తొలి, ఏకైక రజత పతకాన్ని సంపాదించిపెట్టింది[12].
↑V. V., Subrahmanyam (10 April 2008). "Aiming for the stars". The Hindu. Chennai, India. Retrieved 20 October 2010. CS1 maint: discouraged parameter (link)
↑సాక్షి, ఎడ్యూకేషన్ (25 January 2020). "పద్మ పురస్కారాలు-2020". Archived from the original on 10 ఫిబ్రవరి 2020. Retrieved 10 February 2020. Check date values in: |archivedate= (help)CS1 maint: discouraged parameter (link)