బాలి
బాలి ఇండోనేషియా లోని ఒక ద్వీపం. ప్రముఖ ప్రపంచ పర్యటక ప్రాంతమైన ఈ ధ్వీపం ప్రాచీన హిందు సంస్కృతికి, ఆలయాలకు ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ 90% హిందువులు ఉన్నారు.
హిందువుల పుణ్యస్థలి బాలి
బాలి
[మార్చు]బాలి పర్యాటకుల స్వర్గం. ఈ ప్రాంతంలో ఒకప్పుడు స్త్రీలు పై వస్త్రాలు లేకుండా సంచరించేవారు. కాని ఇప్పుడు స్త్రీలు జాకెట్లు వేసుకోవటానికి అలవాటు పడ్డారు. అయినా 23 కోట్ల ముస్లిం జనాభా కల ఇండొనేసియా దేశంలో 80% హిందువులు నివసించే బాలి ఇప్పుడుకూడా ఒక వింతగా పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంది. 30 లక్షల జనాభా ఉన్న బాలికి సంవత్సరానికి 40 లక్షల మంది పర్యాటకులు వస్తుండటం విశేషం.
మనదేశంలో వేళ్లూనుకొని ఉన్న హిందూ సాంప్రదాయ సమాజమే బాలిలో కూడా ఉంది. ఇలాంటి సాంప్రదాయ సమాజాల్లో సంస్కృతీ సంప్రదాయాలను ఒక తరం నుంచి మరొక తరానికి అందించేది ముఖ్యంగా స్త్రీలే. గృహ జీవితంలో, పిల్లల పెంపకంలో, ఆహారం తయారు చెయ్యటంలో, ఇలా వివిధ నిత్య గృహ కృత్యాల్లో తమ చర్యల ద్వారా సంప్రదాయాల్ను కొత్త తరానికి అందజేస్తుంటారు ఇక్కడి స్త్రీలు. ఇండోనేషియాలోని జావా, లాంబాక్ దీవుల మధ్య నున్నది బాలీ దీవి. మొత్తం 17వేల దీవులతో కూడిన ఇండోనేషియాలో బాలీ అందం ప్రత్యేకత మరి దేనికీ లేదంటారు. బాలీ తూర్పునుంచీ పశ్చిమానికి 140 కి.మీ., ఉత్తరం నుంచీ దక్షిణానికి 80 కి.మీ విస్తరించి ఉంది. అయితే తూర్పు నుంచీ పశ్చిమానికి నిప్పులు చెరిగే పర్వతాలు ఉండటం దురదృష్టంగానూ భావిస్తారు. వీటిలో అత్యంత పెద్దది గునుంగ్ అగుంగ్ పర్వతం 1963లో పేలి నిప్పు నది ప్రవహించింది. ఆ తర్వాత ఇంతవరకూ అలాంటవి సంభవించలేదు. ఈక్వేటర్‌కి ఎనిమిది డిగ్రీలు దక్షిణంగా ఉన్న ఈ బాలీ వాతావరణం చిత్రంగా ఉంటుంది. ఇక్కడ కేవలం రెండు సీజన్లే ఉంటాయి. ప్రతీ సంవత్సరం చలి, పొడి వాతావరణం ఉంటుంది. కానీ సాధారణంగా ఇక్కడ 28 డిగ్రీల సెల్సియస్ వేడిమి ఉంటుంది. భారీ వర్షాల కాలంలో పచ్చగా మెరుస్తూ మహాద్బుతంగా ఉంటుంది బాలీ. ఎంతో మాగాణి భూమి కావడంతో పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. బాలీ దక్షిణాన కొండప్రాంతాల్లో ధాన్యం, ఉత్తర తీర ప్రాంతాల్లో కాఫీ, కూరగాయలు బాగా పండుతాయి.
మతం
[మార్చు]అత్యధిక ముస్లిం జనాభా వున్న ఇండోనేషియాలోని బహు చక్కని దీవి బాలీ. బాలీలో అత్యధికభాగం హిందువులే ఉన్నారు. దీన్ని దేవతల నివాసంగా పిలుస్తారు. అంత ప్రశాంతంగా, మనోహరంగా ఉంటుంది. 2.5 మిలియన్ల జనాభాలో 90శాతం హిందువులే ఉన్నారు. తమను ప్రశాంతంగా ఉండేట్టు చేయమని, ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడాలని కోరుతూ ప్రతీ ఇంటాపూజలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఆ మంత్రోచ్ఛారణ అంతటా వినవస్తూంటుంది. ప్రతీ దేవాలయంలోనూ సాయింత్రాలు పూజలు, మంత్రాల పఠనంతో ఆధ్యాత్మిక వాతావరణం కట్టేస్తుంటుంది. భజనల్లో అక్కడక్కడ సంస్కృత పదాలు వినపడుతూంటాయి.బాలీ ప్రజల్లో మతం, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. పలు దేశాల నుంచీ ఎందరో పర్యాటకులు వస్తూ పోతున్నప్పటికీ ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలకు మాత్రం ఎలాంటి ఆపదా కలగలేదు. ఇక్కడి ప్రధాన మతం ఆగమ హిందూ ధర్మం. 11వ శతాబ్దంలో సుమత్రా, జావాల్లో హిందూ ప్రచారం బాగా జరగడంతో బాలీలో ఆగమ హిందూ ధర్మం ఏర్పడింది. భారతదేశం నుంచీ వచ్చిన మతమే అయినప్పటికీ బాలీలో హిందు, బౌద్ధ, జావా మతాలు ఆచారంలో ఉన్నాయి. 15వ శతాబ్దంలో జావాకు ఇస్లాం రావడంతో అక్కడి కళాకారులు, సంగీతకారులు అనేకమంది బాలీకి పారిపోయారంటారు.
సృజన సంపన్నులు
[మార్చు]బాలీ ప్రజలు ఎంతో సృజన సంపన్నులు. సంప్రదాయసిద్ధమైన శక్తి సామర్థాలు ఎక్కువగా మతపరమైన కార్యకలాపాలకే వినియోగిస్తారు. రామాయణం, భారతం పట్ల అపార భక్తి శ్రద్ధలున్నాయి. వాటిలోని కథలతో ఇక్కడి ప్రజలు స్ఫూర్తి పొందుతున్నారు. ప్రతీ పండుగ, సందర్భం ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, కళాత్మకంగా చేసుకోవడం వారి ప్రత్యేకత. ప్రతీ పనిలోను, ప్రతీ అంశంలోనూ సౌందర్యం తొణికిసలాడుతుంది. వారిది కళా దృష్టి కావడమే అందుకు కారణం.
అందమైన పల్లె కూటా
[మార్చు]బాలీలోని దిన్‌పాసార్, సింగరాజా పట్టణాలు ఎంతో బావుంటాయి. టూరిస్టులును అమితంగా ఆకట్టుకుంటున్న కూటా బాలీ విమానాశ్రయానికి సమీపంలోనే ఉంది. ఇదో కుగ్రామం. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడి బీచ్‌లు, ఎంతో ఆకట్టుకునే సూర్యోదయ, సూర్యాస్తమయాలు టూరిస్టులను కట్టిపడేస్తాయి. 1970ల నుంచీ పర్యాటకుల రాక ఎక్కువయింది. ఇపుడు ఇది రిజార్‌ట టౌన్‌గా మారింది. వందల హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, అనేక రకాల దుకాణాలు ఉన్నాయి. విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ తన `సాగరిక' అనే కవిత 80ఏళ్ల క్రితం ఇక్కడ పర్యటనికి వచ్చినపుడు రాశారు.
Bali is an Indonesian island located at 8°25′23″S 115°14′55″E / 8.42306°S 115.24861°E, the westernmost of the Lesser Sunda Islands, lying between Java to the west and Lombok to the east. It is one of the country's 33.0 provinces with the provincial capital at Denpasar towards the south of the island.
With a population recorded as 3,151,000 in 2005, the island is home to the vast majority of Indonesia's small Hindu minority. 93.18% of Bali's population adheres to Balinese Hinduism, while most of the remainder follow Islam. It is also the largest tourist destination in the country and is renowned for its highly developed arts, including dance, sculpture, painting, leather, metalworking and music.
మూలం
[మార్చు]http://www.suryaa.com/features/article.asp?subCategory=4&ContentId=207557[permanent dead link]