ద్వీపం
ఈ పేజీ ట్రాన్స్వికీ ప్రక్రియ ద్వారా విక్షనరీకి తరలించబడుతుంది.
ఈ వ్యాసం కేవలము నిర్వచనము లేదా అర్ధానికి పరిమితమైనందున. విక్షనరీకి తరలించాలని ప్రతిపాదిస్తున్నారు. The information in this article appears to be suited for inclusion in a dictionary, and this article's topic meets Wiktionary's criteria for inclusion and will be copied into Wiktionary's transwiki space from which it can be formatted appropriately. If this page does not meet the criteria, please remove this notice. Otherwise, the notice will be automatically removed after transwiki completes. |
హిందూమతము లోని భారత పురాణములు,ప్రకారము ద్వీప లో (దేవనాగరి: द्वीप "ద్వీపకల్పం, ద్వీపం"; మహాద్వీపం "గొప్ప ద్వీపం" అనేవి భూగోళ ప్రధాన విభాగాలు. భూచక్రము (భూగోళం) లో అవసరము కోసం ఈ పదం కొన్నిసార్లు "ఖండం లు"గా కూడా అనువదించబడింది,. ఈ జాబితా 7 గాని, 4 లేదా 13 గాని మరియు 18 ద్వీపములుగా ఉన్నాయి. ఏడు (సప్త ద్వీపములు) జాబితా ఉంది (ఉదా మహాభారతం 6,604 = భగవద్గీత 5.20.3-42):
సప్త ద్వీపములు[మార్చు]
# జంబూ ద్వీపము ("గులాబీ ఆపిల్ చెట్టు") (నేరేడు)
ఇది లవణోదకమును పరివేష్టించి యున్నది.
# జువ్వి ద్వీపము లేదా ప్లక్ష ద్వీపము ("అత్తి చెట్టు") లేదా (రావి చెట్టు)
ఇది లవణోదకమును పరివేష్టించి యున్నది. విష్ణు మతమున లవణేక్షూదములను పరివేష్టించి యున్నది. ఇది జంబూద్వీపమునకు రెట్టింపు ఉంది. ప్లక్షము అనగా జువ్వి చెట్టు. దీని మొదలు గాడిదవలె నుండును గాన్ దీనిని గర్ధభాండ మని సంస్కృతమున అందురు. ఈ ద్వీపాకారము కలజువ్వి కాయలవలె నుండును. మత్స్య పురాణము దీనికి గోమేద మని మరియొక పేరు పెట్టెను. వాయువు శాకమున(శక్తి) చెప్పిన ఖగోళసంబంధము కలదని మత్స్య పురాణమునందు చెప్పబడింది.
# గోమేధిక ద్వీపము (ఒక రత్నం)
ఇది కూడా దధిసముద్రమున (Black Sea) కు పడమర వైపు కలదని చెప్పబడింది.
# శాల్మల ద్వీపము (నరకపు ప్రాంతంలో ఒక నది)
ఇది సురోదమను సముద్రము (Aegean Sea)ను పరివేష్టించి యున్నది. మత్స్యమున దధిసముద్రమున (Black Sea) పరివేష్టించి యున్నది. ఈ ద్వీపముననే గరుత్మజ్జననము. ఇందు వానలు లేవు. అట్లని దుర్భిక్షము లేదు. ఇచటి చాతుర్వర్ణము కపి లారుణ పీత కృష్ణము. ఒకానొక కాలమున అసీరియా అసురదేశము. పుష్కర ద్వీపములోని ధాతకీ మహావీర ఖండములు అసీరియా, బాబిలోనియాలు. అసుర జాతివాడు అయిన శాల్మలేశ్వరుడు. అతడు క్రీ.పూ.13వ శతాబ్ది వాడు. అందువలనే దీనికి శాల్మల ద్వీపమని పేరు వచ్చెను.
# కుశ ద్వీపము ("గడ్డి") లేదా దర్భ
ఇది సురాఘృతసముద్రములను అంటి ఉంది. ఘృతక్షీరోదకములను అంటి ఉన్నదని మత్స్య పురాణము చెప్పును. ఇది శాల్మలకంటె ద్విగుణమని పూర్వమతము. శాకము కంటె ద్విగుణమని పరమతము. ఇచట దైతేయులు, దానవులు, యక్షులు, కిన్నరులు, గంధర్వులు, దేవతులును, వారితోపాటు మానవులు కలరు. ఇందు హరి పర్వతమను మారుపేరు గల మహా పర్వతము అను ఒక అగ్ని పర్వతము ఉంది. ఇందలి ద్రోణపర్వతము మిక్కిలి పొడవైనది. దానిమీద విశల్యకరణియు, మృతసంజీవని పర్వతములు ఉన్నాయి. ఇవి Caspian Sea కి దక్షిణమున కల Elburz Mts (In Iran). ఈ ద్వీపము Caspian Sea నుండి Aral Sea వరకు విస్తరింపబడింది.
# క్రౌంచ ద్వీపము ("డేగ") ఒక తరహా సముద్రపు పక్షి, క్రౌంచ పక్షి,
ఇది ఘృతసాగర పరివేష్టిత మని మత్స్యపురాణము లో ఉంది. ఈ ద్వీపపు జనాభాలో తెల్లని వారెక్కువ. ఈద్వీపము లో ఉష్ణమనియు, పీవరమని రెండు దేశములు ఉన్నాయి.
# షాక ద్వీపము ( "శక్తి", "యొక్క సాకా")
ఇది లవణోదధిని చుట్టియున్నది. మరియు, దధిమండ సముద్రముచేతను పరివేష్టితము. మత్స్యమున దీనికి తూర్పున ఇందలి ఏడు కులపర్వతములలో నొకటిఅగు మేరువు. దక్షీణమున క్షీరోదము. పడమట క్రౌంచము. మేరువు తూర్పుకొనపేరు ఉదయాచలము. పడమటికొనపేరు అస్తాచలము. దీనికి మరియొక పేరు సోమకము. వాయుపురాణమున మేరువునకు పడమటనున్న ఒక పర్వతము పేరు ఉదయాచలమని ఉంది. ఉదయాచలమున మేఘములు ఉదయించును కాని అవి కురవవు. అవి అస్తాచలము మీది కెగసి అక్కడ కురియును. ఈ దీవిలో సోమకగిరిమీద హిరణ్యక్షవధ జరిగెను. గరుత్మంతుడు అమృతము అపహరించినట. ఇటులే ఈ యేడు దీవులలోను ఏదోఒక పురాణగాధ జరిగినటులు కనబడును. ఇచటి జనులు సూర్యుని పూజింతురు. ప్రియవ్రతుని మేధాతిథి రాజు. అతడు తన ఏడుగురు కొడుకులను ఈ శాకము నేడు ముక్కలుగా విభజించి ఇచ్చెనట.
శాక ద్వీపమునుండి భరతవర్షమునకు వచ్చిన బ్రాహ్మణులు కలరు. వారు శాకద్వీపి బ్రాహ్మణులని చెప్పుకొనిరట. వీరు సూర్యోపాసకులు. ఇచటనుండి వచ్చిన క్షత్రియులు భరతవర్షమున శకభూపతులు. ఇందు ఉదయాచల పార్స్వము శుష్కము. ఇచట చలియు, ఎండయు మిక్కుటము. పడమటి భాగమున సం.నకు పది 12 అడుగుల వానలు కురియునట. Aral Sea పారసీకమున సీర్ దరియా -సీర్ = క్షీర, దరియా = సాగరము. దీని నీరు కొంచెము తెలుపు రుచి ఉప్పన.
# పుష్కర ద్వీపము ("లోటస్") తామర పువ్వు
ఇది క్షీరసాగరము చుట్టి ఉంది. స్వాదూదధిని చుట్టునట్లు ఉన్నదని మత్స్యపురాణము చెప్పును. దీని ధాతకి అనియు, మహావీర(త) మనియు రెండు దేశములు ఉన్నాయి. శౌనక లేక ధాతకి-కుముద లట. ఇవి రెండును సిరియా మెసపటేమియాలు. మత్స్యమున చెప్పిన స్వాదూదధి Tigris river మరియు Euphrates river నదులు. ఇచట వర్ణ ప్రసక్తియే లేదు. సత్యానృతములు లేవు. ఒకరు ఎక్కువ మరియొకరు తక్కువని లేదు. అచటి జనులందరు ఒకటే వేషము. వారందరును దైవసమనులు. ఇది భౌమస్వర్గము. ఇచట మానసోత్తర పర్వత మొకటి తప్ప మరి పర్వతములు లేవు. కాని గిరులున్నవి.
ఆధునిక అర్ధము[మార్చు]

- భూగోళశాస్త్ర నిర్వచనం: చుట్టూ నీటిచే ఆవరించబడి, మధ్యలో వున్న భూభాగాన్ని ద్వీపం లేదా దీవి (Island) అని అంటారు. ద్వీపాలు నదీ ద్వీపాలు గాని సముద్ర ద్వీపాలు కానీ అవ్వచ్చు. మన భారత దేశంలోని అస్సాంలో గల మజూలి ప్రపంచంలోనే అతి పెద్దదైన నదీ ద్వీపం.
- సముద్ర ద్వీపాల ఉదా: గ్రేట్ బ్రిటన్, శ్రీలంక, అండమాన్ మరియు నికోబార్ దీవులు, లక్ష దీవులు