గీత్ సేఠీ

వికీపీడియా నుండి
(గీత్ సేథి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Medal record
Men's english billiards
ప్రాతినిధ్యం వహించిన దేశము  భారతదేశం
Asian Games
స్వర్ణము 1998 Bangkok Teams
Silver 1998 Bangkok Singles
Silver 2002 Busan Teams
Bronze 2002 Busan Singles
Bronze 2006 Doha Teams

గీత్ శ్రీరామ్ సేఠీ (జననం ఏప్రిల్ 17, 1961), భారత్ కు చెందిన ఈయన [1] ఇంగ్లీష్ బిలియర్డ్స్ లో నైపుణ్యమున్న ఆటగాడు. 1990ల్లో ఆటలో ఆయనదే రాజ్యంగా ఉండేది. స్నూకర్ ఆటగానిగా ఆయన చాలా పేరు గడించాడు. ప్రొఫెషనల్ స్థాయిలో సేఠీ ఆరుసార్లు విజేతగా నిలిచారు. ప్రపంచ ఛాంపియన్ షిప్స్ ను మూడుసార్లు గెలిచారు. ఇంగ్లిష్ బిలియర్డ్స్ లో రెండు ప్రపంచ రికార్డులు ఆయన పేరుమీద ఉన్నాయి.[1][2] ప్రకాశ్ పదుకొనేతో కలిసి ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ ను స్థాపించారు. ఇది భారతదేశంలో క్రీడలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేశారు.

క్రీడా జీవితం[మార్చు]

ఢిల్లీలోని పంజాబ్ కుటుంబంలో జన్మించిన ఆయన అహ్మదాబాద్[1] లో పెరిగారు. సేఠీ 1982లో[1] పెద్దదైన ఇంగ్లిష్ బిలియర్డ్స్ కార్యక్రమం, ది ఇండియన్ నేషనల్ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ (అంతర్జాతీయ కార్యక్రమం)ను తొలిసారిగా గెలిచారు. ఇందులో మైకేల్ ఫెర్రీరాను ఓడించారు. తరువాత NBCని వరుసగా నాలుగేళ్లు 1985-1988 వరకూ గెలుచుకున్నారు. మళ్లీ 1997, 1998లో అదే టైటిల్ ని సాధించారు.[1][3]

1985లో ప్రత్యర్థి బాబ్ మార్షల్ పై IBSF వరల్డ్ అమెచ్యుర్ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ లను ఎనిమిది గంటలపాటు సాగిన చివరి రౌండ్ లో గెలిచారు. దీంతో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు లభించాయి.[1] 1987లో ఆయన మళ్లీ IBSF ని గెలుచుకున్నారు. అలాగే ACBS ఏషియన్ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ లో విజయం సాధించారు. 2001లో వరల్డ్ అమెచ్యుర్ బిలియర్డ్స్ టైటిల్ ని గెలుచుకున్నారు.[2][3]

సేఠీ, ఇండియన్ నేషనల్ స్నూకర్ ఛాంఫియన్ షిప్ లను వరుసగా నాలుగుసార్లు సాధించారు. 1985-1988 మధ్యలో నేషనల్ ఇంగ్లిష్ బిలియర్డ్స్ లో గెలిచారు.[3] ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో 1989లో జరిగిన పోటీలో టైటిల్ గెలవలేకపోయినా, ప్రపంచపు మొట్టమొదటి స్థానానికి చేరువ కాలేకపోయినా, అధికారిక పోటీలో 147 పాయింట్లను దాదాపు బ్రేక్ చేయగలిగారు..[1][3] ఏదేమైనా, ప్రపంచ స్నూకర్ ర్యాంకింగ్స్ లో ఎప్పుడూ మొదటి స్థానం దక్కించుకోలేకపోయారు. స్నూకర్ పోటీలో అత్యధిక స్కోరు (147) పాయింట్లు, మరియు బిలియర్డ్స్ పోటీలో 1000+ పాయింట్లు బ్రేక్ చేశారు. రెండు పోటీల్లోనూ ఇలా చేసి చరిత్రలో నిలిచిన ఒకే ఒక్క ఆటగాడు సేఠీ.

1992లో వరల్డ్ ప్రొఫెషనల్ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ లో సేఠీ వరల్డ్ రికార్డ్ ఇంగ్లిష్ బిలియర్డ్స్ రికార్డును నెలకొల్పారు. త్రీ పాట్ రూల్ లో 1276 పాయింట్లు సాధించారు. ఐదు దశాబ్దాల్లో ఇదే అత్యధికగా బ్రేక్ చేసిన రికార్డ్. అందుకే మొట్టమొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.break[1][3] 1993, 1995, 1998, మరియు 2006లో ఆయన మళ్లీ టైటిల్ ని గెలుచుకున్నారు.[2][2][3][3]

2006లో ప్రస్టేయన్ వేల్స్ లో జరిగిన పోటీలో, క్వార్టర్ ఫైనల్ లో డేవిడ్ కాజియర్ ని ఓడించారు మరియు డిఫెండింగ్ వరల్డ్ ప్రో ఛాంపియన్ అయిన క్రిస్ షట్ ని సెమీ ఫైనల్ లో ఇంటి ముఖం పట్టించారు. inningఐదుగంటల పాటు జరిగిన ఫైనల్ లో ఆయన టైటిల్ రౌండ్ లో 2073-1057 తో (సగటున 34.3 vs.17.0) లీ లంగన్ పై గెలిచారు. (2003 IBSF అమెచ్యుర్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో 6 టూ 5తో ఈ మధ్యే ఆయనను ఓడించారు.)frames తొలి గంటలో రెండు రౌండ్లు ముగిసిన తరువాత, సేఠీ 150 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. తరువాత మొదటి రెండింటిలో ఒకటి పూర్తయ్యేసరికి మరో రెండు సెంచరీలతో 427 పాయింట్లకు స్కోరును పెంచుకున్నారు. తరువాత 238తో అనుసరించారు. ఇదే సమయంలో మొదటి సెషన్ లో లంగన్ రెండు సెంచరీలను మాత్రమే చేయగలిగారు.centuriessessionsdouble centurypoints సమయం గడుస్తున్నకొద్దీ, సేఠీ మళ్లీ రెండు సెంచరీలన చేయగలిగారు. 206 దగ్గర, మరో బ్రేక్ ని చేయగలిగారు.match[1]

[2] ఇంగ్లిష్ బిలియర్డ్స వరల్డ్ ఛాంపియన్ ని ఎనిమిది సార్లు గెలుచుకున్న ఇంగ్లాండ్ కు చెందిన మైక్ రస్సెల్ యొక్క "ప్రధాన ప్రత్యర్ధిగా" సేఠీని వర్ణించారు. వీళ్లు టైటిల్ కోసం జరిపిన పోరాటంలో ఒకరిని మరొకరు ఓడించారు. రస్సెల్ 1996లో విజయం సాధిస్తే, సేఠీ 1998లో విజేతగా నిలిచాడు. మళ్లీ వీళ్లిద్దరి మధ్యా 2007లో పోటీ జరిగింది. వీళ్లిద్దరూ సెమీ ఫైనల్స్ లో చెరో మూడు సెంచరీలను సాధించారు. 1835-1231 (సగటున 65.5 vs. 45.6)పాయింట్లతో రస్సెల్, సేథీని ఓడించారు. రస్సెల్ టైటిల్ ని గెలుచుకుని, తొమ్మిదోసారి ప్రపంచ రారాజుగా కిరీటాన్ని అందుకున్నారు.[4]

1998లో థాయ్ లాండ్ లోని బ్యాంకాక్ లో జరిగిన 13వ ఆసియా క్రీడలు లో ఇంగ్లిష్ బిలియర్డ్స్ డబుల్స్ మరియు సింగిల్స్ లో సేఠీ బంగారు, వెండి పతకాలను సాధించారు.[5] 2002లో దక్షిణ కొరియాలోని బసెన్ లో జరిగిన 14వ ఆసియా క్రీడల లో ఇంగ్లిష్ బిలియర్డ్స్ లోని డబుల్స్ మరియు సింగిల్స్ లో, వెండి మరియు బ్రాండ్ పతకాలను ఆయన గెలిచారు.[5] 15వ ఆసియా క్రీడలు (2006, దోహా, ఖతార్) లో ఇంగ్లిష్ బిలియర్డ్స్ (అశోక్ హరిశంకర్ శాండిల్యతో కలిసి పురుషుల డబుల్స్)లో బ్రాండ్ మెడల్ ని సాధించారు.[5]

ఈ రెండు క్రీడలను ఒలింపిక్ క్రీడల్లో[3] అనుమతించడంతో భారతదేశం తరపున ఆడడానికి ఆయన తన ప్రణాళికలను ప్రకటించారు. (వరల్డ్ కాన్ఫిడరేషన్ ఆఫ్ బిలియర్డ్ స్పోర్ట్స్ మరియు ఇంటర్నేషన్ ఒలింపిక్ కమిటీ మధ్య చాలా కాలం పాటు చర్చలు జరిగాయి).

సేఠీ యొక్క ఆట వ్యవహారాలను చూసే TNO స్పాన్సర్ షిప్[3] వాళ్లు ఏమన్నారంటే, “సరికొత్త ఉత్సాహంతో ఆయన తన ఆట పై దృష్టి కేంద్రీకరించగలుగుతున్నారు[sic] ” మరియు “సరైన సమయంలో అత్యున్నత దశలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.”[2]

వరల్డ్ ప్రొఫెషనల్ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ ఫలితాలు[మార్చు]

 • 1992: విజయం (మైక్ రస్సెల్ ని ఓడించారు, 2529-718)
 • 1993:విజయం (మైక్ రస్సెల్ ని ఓడించారు, 2139-1140)
 • 1994: సెమీ ఫైనలిస్ట్ ( పీటర్ గిల్ క్రిస్ట్ చేతిలో ఓటమి, 916-1312)
 • 1995: విజయం (దేవేంద్ర జోషిని ఓడించారు, 1661-931)
 • 1996: రన్నరప్ (మైక్ రస్సెల్ చేతిలో ఓటమి, 1848-2534)
 • 1997 : పోటీ జరగలేదు
 • 1998: విజయం (మైక్ రస్సెల్ ని ఓడించారు, 1400-1015)
 • 1999:
 • 2000: పోటీ జరగలేదు
 • 2001: క్వార్టర్ ఫైనల్ కు చేరారు.
 • 2002: సెమీ ఫైనల్ కు చేరారు. (పీటర్ గిల్ క్రిస్ట్ చేతిలో ఓటమి, 851-1767)
 • 2003: గ్రూప్ స్టేజ్ లో ఓటమి
 • 2004: క్వార్టర్ ఫైనల్ కు చేరారు (డేవిడ్ కాజియర్ చేతిలో ఓటమి, 722-971)
 • 2006: విజయం, (ఇంగ్లాండ్ కు చెందిన లీ లంగన్ ను ఓడించారు. 2073-1057)
 • 2007: సెమీ ఫైనల్ కు చేరారు (మైక్ రస్సెల్ చేతిలో ఓటమి, 1231-1835)
 • 2008: రన్నరప్ ( మైక్ రస్సెల్ చేతిలో ఓటమి, 1342-1821)

బిరుదులు[మార్చు]

 • వరల్డ్ ప్రొఫెషనల్ బిలియర్డ్స్ ఛాంపియన్: 1992, 1993, 1995, 1998, 2006
 • వరల్డ్ అమెచ్యుర్ బిలియర్డ్స్ ఛాంపియన్: 1985, 1987, 2001
 • 1998లో బ్యాంకాక్ లో జరిగిన 13వ ఆసియా క్రీడలలో బంగారు పతకం సాధించారు.
 • ఆసియన్ బిలియర్డ్స్ ఛాంపియన్: 1987
 • నేషనల్ బిలియర్డ్స్ ఛాంపియన్ : 1982, 1985, 1986, 1987, 1988, 1997, 1998
 • నేషనల్ స్నూకర్ ఛాంపియన్: 1985, 1986, 1987 మరియు 1988

పురస్కారాలు మరియు గుర్తింపు[మార్చు]

భారతదేశంలో ఒక ప్రధాన క్రీడా నాయకుడు అయిన ఈయన భారతదేశ అత్యున్నత క్రీడా అవార్డు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని 1992-1993 సంవత్సరానికి గాను అందుకున్నారు. 1986లో పద్మశ్రీ మరియు అర్జున అవార్డును అందుకున్నారు. 1993లో కె.కె.బిర్లా అవార్డును ఆయనకు ప్రదానం చేశారు.[1][3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

సేఠీ తన భార్య కిరణ్ మరియు ఇద్దరు పిల్లలు జాజ్, రాగ్ లతో కలిసి అహ్మదాబాద్ లో నివసిస్తున్నారు.[2][6] బిలియర్డ్స్ పోటీలతో పాటు సేఠీ, అహ్మదాబాద్ మరియు ముంబైలలో రాగ్ ట్రావెల్స్ పేరుతో ప్రైవేట్ ట్రావెల్ ఏజన్సీని నడుపుతున్నారు.[6] బి.కె. స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్ మెంట్ నుంచి సేఠీ ఎం.బి.ఎ.ని పూర్తిచేశారు. అహ్మదాబాద్ లో సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాల, సెయింట్ జేవియర్స్ కళాశాల లోనూ చదువుకున్నారు[6].

2005లో తన స్వీయచరిత్రను ఆటోబయోగ్రఫీగా సక్సెస్ వర్సెస్ జాయ్ పేరుతో రచించారు. ఇది స్ఫూర్తిని కలిగించే విధంగా ఉంటుంది.[7]

ప్రస్తుత వెంచర్లు[మార్చు]

ప్రస్తుతం ఆయన ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ ను నడుపుతున్నారు. ఒలింపిక్ లో పతకం సాధించేలా భారత క్రీడాకారులకు మద్దతుగా ఇది పనిచేస్తుంది.[8]

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 1.9 "Geet Sethi Profile". ILoveIndia.com. no date specified. pp. "Sport in India" section. Retrieved 2007-11-30. Check date values in: |date= (help)
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "Geet Sethi crowned World Billiards Champion for the 8th Time!". TNQ.in. TNQ Sponsorship (India) Pvt. Ltd. 2006. Retrieved 2007-11-30.
 3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 3.9 "Geet Sethi Page". TNQ.in. TNQ Sponsorship (India) Pvt. Ltd. 1998. Retrieved 2007-11-30.
 4. "2007 World Professional Billiards Championship". EABAonline. English Amateur Billiards Association. 2007. pp. "Tournaments" section. Retrieved 2007-12-01.
 5. 5.0 5.1 5.2 "Player Profile". IBSF. Retrieved 2009-11-15. Cite web requires |website= (help)
 6. 6.0 6.1 6.2 "Geet Sethi". India's Who is Who. Retrieved 2008-04-22. Cite web requires |website= (help)
 7. Sethi, Geet. Success vs Joy.
 8. "A strategy for medals". The Wall Street Journal. 2007-08-24. Retrieved 2009-11-15. Text " Geet Sethi " ignored (help); Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=గీత్_సేఠీ&oldid=2766088" నుండి వెలికితీశారు