నటరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదంబరం లో నెలకొన్న నటరాజు

నటరాజు పరమ శివుని అవతారం. సకల నాట్యాలకు అధిపతి. లోహంతో గానీ, రాతితో చెక్కిన నటరాజు విగ్రహాలు దక్షిణ భారతదేశంలో శివాలయాల్లో తరచుగా దర్శనమిస్తాయి. పదవ, పదకొండవ శతాబ్దంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చోళుల కాలానికి చెందిన ఇత్తడి విగ్రహాల్లో నటరాజ విగ్రహం నాలుగు చేతులతో రూపొందించబడి ఉంటుంది. [1] జడలు గాలిలో ఎగురుతూ ఉంటాయి. మరుగుజ్జు బొమ్మపై నిలుచుని నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుంది. ఈ మరుగుజ్జు , అపస్మార పురుషుడు ( మానవులోని అజ్ఞాని) కి చిహ్నం. కుడి వైపున వెనుక ఉండే చేయి ఢమరుకాన్ని కలిగి ఉంటుంది. ముందుకు ఉండే కుడి చేయి అభయ ముద్రను సూచిస్తుంటుంది. వెనుక వైపునున్న వామ హస్తం అగ్ని ని కలిగి ఉంటుంది. ముందువైపు ఉండే ఎడమచేయి గజహస్తం ముద్రలో ఉంటుంది. జులపాలు నలువైపులకు విసిరివేసినట్లు ఉంటాయి. ఝటాజూటంలో గంగాదేవి, అర్థ చంద్రాకారం ఇమిడి ఉంటాయి. ఆయన ఆకారం మొత్తం గుండ్రటి ప్రభామండలంలో అమర్చబడి ఉంటుంది.

(శివ) నటరాజ (నాట్యానికి ప్రభువు)

మూలాలు[మార్చు]

  1. student's Britannica India. p. 93.
"https://te.wikipedia.org/w/index.php?title=నటరాజు&oldid=3878916" నుండి వెలికితీశారు