మరుగుజ్జు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మరుగుజ్జు వ్యక్తి

మరుగుజ్జు (Dwarf) అనగా పొట్టి ఆకారం గల మనిషి. ఒక వ్యక్తి యొక్క ఇలాంటి స్థితిని మరుగుజ్జుతనం (Dwarfism) అంటారు. ఎవరైనా యవ్వనంలో 4 అడుగుల 10 అంగుళాల ఎత్తుకంటే తక్కువ ఎత్తు ఉంటే వారిని మరుగుజ్జు అని వ్యవహరిస్తారు. 70% మరుగుజ్జుతనం ఎముకలు సరిగ్గా పెరగకుండా ఉండటం వల వస్తుంది.[1] దీనినే వైద్య పరిభాషలో అకోండ్రోప్లేసియా అని వ్యవహరిస్తారు. అంటే శరీరంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ భాగాలు, మిగతా భాగాలతో పోలిస్తే బాగా పెద్దవిగా లేదా బాగా చిన్నవిగా ఉంటాయి.

కారణాలు[మార్చు]

మరుగుజ్జు తనం కలగడానికి చాలా వైవిధ్యమైన కారణాలున్నాయి. కానీ అకాండ్రోప్లేసియా, గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ అనేవి దీనికి ప్రధాన కారణాలుగా గుర్తించడం జరిగింది.

అకాండ్రోప్లేసియా[మార్చు]

కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల ఎముకల పెరుగదల ఆగిపోతుంది. ప్రపంచంలో మరుగుజ్జులలో 70% మంది దీనివల్లే ప్రభావితులైనట్లు అంచనా.

గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ[మార్చు]

శరీరంలో గ్రోత్ హార్మోన్ సరిపడినంతగా విడుదల కాకపోవడం వలన కూడా మురుగుజ్జుతనం సంక్రమిస్తుంది.

ఇతర కారణాలు[మార్చు]

నివారణ[మార్చు]

మరుగుజ్జులుగా జన్మించేవారు జన్యులోపాలతో పుట్టడం మూలాన దీన్ని ముందుగానే నివారించడం దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చు. మరుగుజ్జు తనాన్ని కలుగజేసే అనేక కారణాల్ని శాస్త్రవేత్తలు కనిపెట్టి ఉండటం మూలాన ఒక శిశువు మరుగుజ్జుగా జన్మిస్తాడనేది కచ్చితంగా చెప్పలేము. అయితే దీన్ని కలుగజేసే పోషకాహార లేమి, హార్మోన్ల సమతుల్యతలోలో లోపం మొదలైన కారణాలను సరైన ఆహార పద్ధతుల ద్వారా, హార్మోన్ థెరపీ ద్వారా కొంత వరకు నివారించవచ్చు.

సాహిత్యం[మార్చు]

మరుగుజ్జుతనాన్ని ఆధారంగా చేసుకుని పాశ్చాత్య సాహిత్యంలోనూ, భారతీయ జానపద కథల్లోనూ చాలా రచనలు ప్రచురింపబడ్డాయి. గల్లివర్ ట్రావెల్స్ అనే ప్రసిద్ధి గాంచిన ఆంగ్ల రచనలో వీరి గురించిన ప్రస్తావన ఉంది.

మూలాలు[మార్చు]

  1. "MedlinePlus: Dwarfism". MedlinePlus. National Institute of Health. 2008-08-04. Retrieved 2008-10-03.

Weblinks[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.