కేంద్రపాలిత ప్రాంతం

వికీపీడియా నుండి
(కేంద్రపాలిత ప్రాంతము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కేంద్రపాలిత ప్రాంతం
రకంసమాఖ్య
స్థానంభారతదేశం
సంఖ్య8
జనాభా వ్యాప్తిలక్షదీవులు - 64,473 (అత్యల్పం); ఢిల్లీ - 31,181,376 (అత్యధికం)
విస్తీర్ణముల వ్యాప్తి32 కి.మీ2 (12 చ. మై.) లక్షదీవులు – 59,146 కి.మీ2 (22,836 చ. మై.) లడఖ్
ప్రభుత్వంభారత ప్రభుత్వం

కేంద్రపాలిత ప్రాంతం అనగా భారతదేశం లోని పరిపాలన ప్రాంతాలలో ఒక ప్రధాన విభాగం. రాష్ట్రాలకు స్వంత ప్రభుత్వాలుండగా, కేంద్రపాలిత ప్రాంతాలు పూర్తిగా గాని, పాక్షికంగా కాని భారత ప్రభుత్వంచే పరిపాలించబడతాయి. [1] [2][3] విభిన్న చరిత్ర, సాంస్కృతిక వారసత్వం గల కొన్ని ప్రాంతాలను, భౌగోళికంగా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న ప్రదేశాలను, అంతర్ రాష్ట్ర వివాదాల వలన కేంద్ర ప్రభుత్వంచే పాలించాల్సివచ్చిన ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పరిచారు.

కేంద్రప్రభుత్వం ప్రతి కేంద్రపాలిత ప్రాంతంలో ఒక లెఫ్టినెంట్ గవర్నర్ను నియమిస్తుంది. ఆ అధికారి ప్రాంతీయ ప్రభుత్వానికి అధినేత. కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలో శాసనసభలు ఉన్నాయి. అటువంటి ప్రాంతాలలో ముఖ్య మంత్రి పదవి కూడా వుంటుంది.

జాబితా[మార్చు]

2021 నాటికి , భారతదేశంలో 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి.

 1. అండమాన్ నికోబార్ దీవులు - ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న దీవులు
 2. చండీగఢ్ - పంజాబ్, హర్యానాల మధ్య ఎవరికి చెందాలనే వివాదంతో కేంద్రపాలిత ప్రాంతమయ్యింది. పంజాబ్ ఒడంబడిక ప్రకారం దీనిని పంజాబ్ కు ఇవ్వడం జరిగింది కానీ, బదిలీ ఇంకా పూర్తవలేదు. అంతదాకా కేంద్రపాలిత ప్రాంతంగానే కొన్సాగుతుంది
 3. దాద్రా నగరు హవేలీ, డామన్ డయ్యూ - పోర్చుగీసు సాంస్కృతిక వారసత్వం, గోవా నుండి చాలా దూరంగా ఉండటం
 4. లక్షదీవులు - ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న దీవులు
 5. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం - జాతీయ రాజధాని ప్రాంతం
 6. పాండిచ్చేరి - ఫ్రెంచి సాంస్కృతిక వారసత్వం. ఈ కేంద్రపాలిత ప్రాంతం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ హద్దులుగా వున్నది.
 7. జమ్మూ కాశ్మీర్
 8. లడఖ్

రాజ్యాంగ ప్రకారం ఢిల్లీ 1991 నుంచి "జాతీయ రాజధాని ప్రాంతం" హోదా కలిగి ఉంది, కానీ వ్యవహారికంగా ఢిల్లీని కేంద్ర పాలిత ప్రాంతంగా పరిగణించవచ్చు.2019 ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసి 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అవి ఒకటి జమ్మూకాశ్మీర్ ఇది అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లఢఖ్ ఇది అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసింది. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు 2019 అక్టోబరు 31 నుంచి ఉనికిలోకి వచ్చాయి.

గణాంకాలు[మార్చు]

సంఖ్య కేంద్రపాలిత ప్రాంతం రాజధాని విస్తీర్ణం
(చ.కి.మీ)
జనాభా
2001
జనసాంద్రత
2001
అక్షరాస్యత (%)
2001
ప్రధానభాషలు
1 అండమాన్ నికోబార్ దీవులు పోర్ట్ బ్లెయిర్ 8, 249 356, 152 43 81.18 హిందీ
2 చండీగఢ్ చండీగఢ్ 144 9, 00, 635 7, 900 81.76 హిందీ, పంజాబీ
3 దాద్రా, నగర్ హవేలీ సిల్వస్సా 491 220, 490 491 60.03 గుజరాతీ, హిందీ
4 డామన్ డయ్యు డామన్ 122 158, 204 1, 411 81.09 గుజరాతీ
5 ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ 1, 483 13, 850, 507 9, 294 81.82 హిందీ
6 లక్షద్వీప్ కవరట్టి 32 60, 650 1, 894 87.52 మలయాళం
7 పాండిచ్చేరి పాండిచ్చేరి 492 9, 74, 345 2, 029 81.49 తమిళం

మూలాలు[మార్చు]

 1. Union Territories. Know India: National Portal of India Archived 2012-11-26 at the Wayback Machine
 2. "States and Union Territories". KnowIndia.gov.in. Archived from the original on 24 October 2013. Retrieved 17 November 2013.
 3. "Union Territories of India".

బయటి లింకులు[మార్చు]