Jump to content

కవరట్టి

అక్షాంశ రేఖాంశాలు: 10°34′N 72°38′E / 10.57°N 72.64°E / 10.57; 72.64
వికీపీడియా నుండి

కవరత్తి
కవరట్టి దీవులు
భూగోళశాస్త్రం
ప్రదేశంఅరేబియా
అక్షాంశ,రేఖాంశాలు10°34′N 72°38′E / 10.57°N 72.64°E / 10.57; 72.64
ద్వీపసమూహంలక్షద్వీప్
ప్రక్కన గల జలాశయాలుహిందూ మహాసముద్రం
మొత్తం ద్వీపాలు1
ముఖ్యమైన ద్వీపాలు
  • Kavaratti
విస్తీర్ణం3.93 కి.మీ2 (1.52 చ. మై.)[1]
పొడవు5 km (3.1 mi)
వెడల్పు1.5 km (0.93 mi)
అత్యధిక ఎత్తు1 m (3 ft)
నిర్వహణ
కేంద్రపాలిత ప్రాంతంలక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం
జిల్లాలక్షద్వీప్
దీవులులక్షద్వీప్ దీవులు
తాలూకాకవరట్టి
విభాగంకవరట్టి
అతిపెద్ద ప్రాంతముKavaratti (pop. 10,000)
జనాభా వివరాలు
జనాభా11,473 (2014)
జన సాంద్రత2,920 /km2 (7,560 /sq mi)
జాతి సమూహాలుమలయాళీ, మెహల్సు
అదనపు సమాచారం
సమయం జోన్
పిన్‌కోడ్682555
ప్రాంతీయ ఫోన్‌కోడ్04896
ISO codeIN-LD-05[2]
అక్షరాస్యత88.6%
సగటు. వేసవి ఉష్ణోగ్రత35 °C (95 °F)
సగటు. శీతాకాలపు ఉష్ణోగ్రత25 °C (77 °F)
లింగ నిష్పత్తి1.227

కవరత్తి, భారతదేశంలోని కేంద్ర భూభాగమైన లక్షద్వీప్ రాష్ట్ర రాజధాని. కవరత్తి ఒక జనగణన పట్టణం. దీనికే పగడాల దీవి అని కూడా పేరు. ఇది సహజమైన తెల్లని ఇసుక తీరాలు, ప్రశాంతమైన మడుగులకు ప్రసిద్ధి చెందింది. ఇది ఒక పేరున్న పర్యాటక కేంద్రం. ఇది కొచ్చి నగరానికి పశ్చిమాన 404 కి.మీ. (251 మైళ్లు) దూరంలో ఉంది.

చరిత్ర

[మార్చు]

నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రధాన స్మార్ట్ సిటీస్ మిషన్ కింద నిధులు పొందడానికి జాతీయస్థాయి పోటీలో పోటీ పడుతున్న వంద భారతీయ నగరాల్లో ఈ నగరం ఒకటి. భారతదేశం అంతటా 20 నగరాలలో చివరి 10 ప్రదేశాలలో కవరత్తి ఒకదానికి పోటీ పడనుంది.

భౌగోళికం

[మార్చు]

కవరత్తి ద్వీపం కేరళ రాష్ట్ర తీరంలో 360 కి.మీ (190 మైళ్లు) దూరంలో 10°34′N 72°38′E / 10.57°N 72.64°E / 10.57; 72.64 వద్ద ఇది సముద్ర మట్టానికి సగటు ఎత్తు 0 మీ. (0 అ.) గా ఉంది. [3] కవరత్తి ద్వీపానికి ఉత్తరంగా 24 కి.మీ. (13 నాటికల్ మైళ్లు) దూరంలో జనావాసాలు లేని పిట్టి ద్వీపం సమీప ద్వీపంగా ఉంది. కవరత్తి ద్వీపానికి 54 కి.మీ దూరంలో జనాభా నివసించని అగట్టి ద్వీపం, 53 కి.మీ దూరంలో ఎస్.డబ్యూ, ఎన్.డబ్యూ, సుహెలి పార్ ఉన్నాయి.

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ఆధారంగా కవరత్తి మొత్తం జనాభా 11,210.[4] అందులో పురుషులు 55% మంది స్త్రీలు 45% మంది ఉన్నారు. ద్వీపంలోని 1797 కుటుంబాలలో 57 కుటుంబాలు (సుమారు 3%) దారిద్య్రరేఖకు దిగువన ఉన్నాయి. కవరత్తి పట్టణ అక్షరాస్యత 88.6%గాఉంది. ఇది 1971లో 44.4% నుండి పెరిగింది. పురుషుల అక్షరాస్యత రేటు 94.1% కాగా, మహిళా అక్షరాస్యత 81.66%గా ఉంది.[4] కవరత్తి మొత్తం జనాభాలో 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు 12% మంది ఉన్నారు.

వాతావరణం

[మార్చు]

కవరత్తి ఉష్ణమండల రుతుపవనాల వాతావరణంతో ఉంటుంది. మార్చి నుండి మే వరకు ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఏడాది పొడవునా ఉష్ణోగ్రత 25 నుండి 35 °సి లేదా 77 నుండి 95 ° ఎఫ్ మధ్య ఉంటుంది. తేమ పరిధి 70 నుండి 76 శాతం మధ్య ఉంటుంది.[5] సాధారణంగా మే చివరిలో మొదలై నవంబరు ఆరంభం వరకు రుతుపవనాల వర్షాలు కొనసాగుతాయి. ఈ ద్వీపంలో సంవత్సరంలో సగటున 1,675 మి.మీ. (66 అం) వర్షపాతం ఉంటుంది.

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]
కవరత్తి యొక్క అందమైన తీరము

ద్వీపంలోని ప్రాథమిక పరిశ్రమలలో పర్యాటకం ఒకటి. ఈ ద్వీపంలో సహజమైన తెల్లని ఇసుక సముద్ర తీరాలు ఉన్నాయి. సూర్య స్నానం చేయడానికి పర్యాటకులు ఇష్టపడతారు. కవరత్తి ద్వీపంలోని ప్రశాంతమైన మడుగునీటిలో ఆడుకునే ఆటలకు, ఈతకు అనువైనవి.[6]

ఇటీవలి సంవత్సరాలలో కవరత్తిలో అనేక హోటళ్ళు, ఆశ్రయ మందిరాలు అభివృద్ధి చేయబడ్డాయి. పగడపు దీవుల చుట్టూ ఉన్న జలాలు విభిన్న సముద్ర జీవులతో సమృద్ధిగా ఉంటాయి. కవరత్తి మత్స్య ప్రదర్శనశాల (జలజీవశాల)లో పగడాల గొప్ప సేకరణ, ఉష్ణమండల చేపల నమూనాల విస్తారమైన సేకరణ ఉంది.

ఈ ద్వీపంలోని ప్రధాన పరిశ్రమలు చేపలు, వ్యవసాయం. ఇతర పంటగా కొబ్బరికాయ ఉంది. పర్యాటక రంగం పెరగడంతో, చేపల పరిశ్రమ పెద్ద క్షీణతను ఎదుర్కొంది.

రవాణా

[మార్చు]
కవరత్తి వద్ద వాటర్ స్పోర్ట్

భారతీయ ప్రధాన భూభాగం కొచ్చి నుండి కవరత్తి, ఇతర లక్షద్వీప్ ద్వీపాల వరకు ప్రయాణించే అత్యంత ప్రాచుర్యం పొందిన మార్గాలలో ప్రయాణీకుల నౌకల రాత్రిపూట సముద్రయానం ద్వారా అనేక ప్రయాణీకులను చేరవేసే మార్గాలు పనిచేస్తాయి.

దీనికి సమీప దేశీయ విమానాశ్రయం 54 కి.మీ (29 మైళ్లు) దూరంలో అగట్టి ద్వీపం లోని అగట్టి విమానాశ్రయం. అగట్టి నుండి కవరత్తికి హెలికాప్టర్ లేదా పడవ ద్వారా చేరుకోవచ్చు.[4] సాధారణంగా కొచ్చి నుండి అగట్టి వరకు వాణిజ్య విమానాలు నడుస్తాయి. ప్రధాన భూభాగంలోని కొచ్చిలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప అంతర్జాతీయ విమానాశ్రయం.

నీటి సరఫరా

[మార్చు]

కవరత్తికి నీటి సరఫరాకు భూగర్భ జలాలు ప్రధాన వనరు. ఈ ద్వీపంలో 1325 బావులు, 190 చెరువులు రుతుపవనాల వర్షాలు దారా సేకరించడానికిఉన్నాయి. భారత ప్రభుత్వం పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని, 2005 మేలో కవరత్తిలో తక్కువ ఉష్ణోగ్రత డీశాలినేషన్ ప్లాంట్ (ఎల్‌టిటిడి) ను, 5 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసి ప్రారంభించింది. డీశాలినేషన్ ప్లాంట్ ప్రతి రోజు 100,000 లీటర్లు త్రాగునీటి సరఫరా సామర్థ్యం కలిగిఉంది.[7] [8]

మూలాలు

[మార్చు]
  1. "Islandwise Area and Population - 2011 Census" (PDF). Government of Lakshadweep. Archived from the original (PDF) on 22 జూలై 2016. Retrieved 6 డిసెంబరు 2020.
  2. Registration Plate Numbers added to ISO Code
  3. Falling Rain Genomics, Inc - Kavaratti
  4. 4.0 4.1 4.2 "Kavaratti Island" (PDF). Union Territory of Lakshdweep. Archived from the original (PDF) on 5 మే 2012. Retrieved 6 మే 2012.
  5. "Kavaratti Climate". Union Territory of Lakshadweep. Archived from the original on 2 ఫిబ్రవరి 2014. Retrieved 6 మే 2012.
  6. "Kavaratti Islands, Lakshadweep". Must See India. Archived from the original on 18 మే 2012. Retrieved 6 మే 2012.
  7. "A New Desalination Plant at Kavaratti to Supply Drinking Water from Monday". Ministry of Science and Technology, Government of India. 20 మే 2005. Archived from the original on 21 నవంబరు 2008. Retrieved 22 డిసెంబరు 2008.
  8. "Desalination: India opens world's first low temperature thermal desalination plant". IRC International Water and Sanitation Centre. 31 మే 2005. Archived from the original on 27 మార్చి 2009.

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కవరట్టి&oldid=4081508" నుండి వెలికితీశారు