Jump to content

డోగ్రీ భాష

వికీపీడియా నుండి
భారతదేశం, పాకిస్తాన్ లలో డోగ్రీ, సంబంధిత మాండలికాలు మాట్లాడే ప్రాంతాలు

డోగ్రీ (डोगरी or ڈوگری ) అన్నది భారతదేశం, పాకిస్తాన్ లలో 50 లక్షల మంది వరకు మాట్లాడే ఇండో-ఆర్యన్ భాష.[1] భారత రాజ్యాంగపు 8వ షెడ్యూల్లో ప్రస్తావించిన 22 షెడ్యూల్డ్ భాషల్లో డోగ్రీ ఒకటి.[2] ఈ భాషను ప్రధానంగా జమ్మూ కాశ్మీరులోని జమ్ము, హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువగానూ, ఉత్తర పంజాబ్, జమ్ము కాశ్మీర్ లోని ఇతర ప్రాంతాలు, తదితర ప్రాంతాల్లోనూ మాట్లాడతారు.[3] పాకిస్తానులో డోగ్రిని పహాడీ' (पहाड़ी or پہاڑی) అనే పిలుస్తారు. డోగ్రీ మాట్లాడే వారిని డోగ్రాలనీ, డోగ్రీ-మాట్లాడే ప్రాంతాన్ని దుగ్గర్ అనీ పిలుస్తారు.[4] డోగ్రి (దుగ్గర్ అనే పదంతో) మొట్టమొదటిసారిగా వ్రాతపూర్వకంగా 1317 సంవత్సరంలో కవి అమీర్ ఖుస్రో పెర్షియన్ భాషలో రాసిన నుహ్ సిపిహర్ (“ది నైన్ హెవెన్స్”) లో ప్రస్తావింపబడింది.[5] పంజాబీ భాషలో ఒక మాండలీకం అని పూర్వం భావించినా, ప్రస్తుతం డోగ్రీని పశ్చిమ పహాడి భాషా విభాగంలో ప్రత్యేక భాషగా గుర్తిస్తున్నారు.[6] డోగ్రి భాషలోని కొన్నిలక్షణాలు పశ్చిమ పహాడి భాషలలో, పంజాబీ భాషలో కనిపిస్తాయి. అలాంటిదే ఒక లక్షణం భాషా స్వరానికి సంబంధించినది[7]. డొగ్రీలో చాలా రకాలున్నా, వాటి పదాల సారూప్యత 80 శాతం దగ్గరగా ఉంటుంది.[8] భారత జనాభా లెక్కల ప్రకారం భాషా హోదా పొందటానికి ముందు డోగ్రిని పంజాబీ భాషలో మాజి, దోయాబీ లాగా ఒక రకంగా వర్గీకరించేవారు[9].

సంగీతం

[మార్చు]

పండిత్ రవిశంకర్, పండిత్ శివ్ కుమార్ శర్మ వంటి కళాకారులు డోగ్రీ జానపద శ్రావ్యాలను స్వరపరచారు.[10] వాటిని సితార్, సంతూర్ వాయిద్యాలతో కూడా అమర్చారు.

ప్రముఖులు

[మార్చు]
  • చంపా శర్మ
  • కరణ్ సింగ్[11]
  • ధీను భాయి పంథ్
  • ప్రొఫెసర్ మదన్ మోహన్ శర్మ
  • బి.పి. సథాయి
  • రాం నాథ్ శాస్త్రీ

మూలాలు

[మార్చు]
  1. Sharma, Sita Ram (1992). Encyclopaedia of Teaching Languages in India, v. 20. Anmol Publications. p. 6.
  2. "India Census". Distribution of Scheduled languages. Retrieved November 22, 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. Billawaria, Anita K. (1978). History and Culture of Himalayan States, v.4. Light & Life Publishers.
  4. Narain, Lakshmi (1965). An Introduction to Dogri Folk Literature and Pahari Art. Jammu and Kashmir Academy of Art, Culture and Languages.
  5. "Dogri Language". Britannica. Retrieved నవంబరు 22, 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. Masica, Colin P. (1993). The Indo-Aryan Languages. Cambridge University Press. p. 427. ISBN 0-521-29944-6.
  7. Ghai, Ved Kumari (1991). Studies in Phonetics and Phonology: With Special Reference to Dogri. Ariana Publishing House. ISBN 81-85347-20-4. non-Dogri speakers, also trained phoneticians, tend to hear the difference as one of length only, perceiving the second syllable as stressed
  8. Brightbill, Jeremy D.; Turner, Scott B. (2007). "A Sociolinguistic Survey of the Dogri Language, Jammu and Kashmir" (PDF). SIL International. Retrieved 11 March 2016.
  9. "Social Mobilisation And Modern Society".
  10. "Dogri". Veethi - the face of India. Retrieved November 22, 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  11. "Karan Singh". Wikipedia.{{cite web}}: CS1 maint: url-status (link)