భారతదేశంలో ప్రతిపాదిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతదేశంలోని ప్రతిపాదిత రాష్ట్రాలు

భారతదేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలను[1] పునర్ వ్యవస్థీకరించి లేదా విభజించి ఏర్పాటుచేయాలన్న డిమాండ్ ఉన్నవి ప్రతిపాదిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. ఇప్పటికే నెలకొన్న పలు రాష్ట్రాల్లోని ప్రాంతాలను విభజించి రాష్ట్రాల ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వేర్వేరు తీవ్రతల్లో ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

1951లో భారతదేశంలోని రాష్ట్రాలు

స్వాతంత్ర్యానికి పూర్వం, భారతదేశం బ్రిటీష్ పరిపాలిత ప్రావిన్సులుగా, పాక్షిక స్వయంపాలన అధికారం ఉన్న స్థానిక రాజ్యాలుగా ఉండేది. భారత విభజన తర్వాత కొన్ని పరిపాలనా విభాగాలు పాకిస్తాన్ లో భాగం అయ్యాయి. మిగిలినవి భారతదేశంగా ఏర్పడ్డాయి. 1950ల్లో తెలుగు, మరాఠీ తదితర ప్రాంతాల వారు భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటుచెయ్యమన్న డిమాండ్ తో తీవ్రస్థాయి ఉద్యమాలు నడిపారు. 1956లో రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రావిన్సులను పునర్విభజన చేస్తూ భాష, జాతి ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటుచేసింది.

1956 అనంతరం పలు కొత్త రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి. బాంబే పునర్వ్యవస్థీకరణ చట్టం బొంబాయి రాష్ట్రాన్ని భాషా ప్రాతిపదికన గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలుగా 1960 మే 1న విభజించింది.[2] నాగాలాండ్ 1963 డిసెంబరు 1న ఏర్పడింది.[3] 1966 నాటి పంజాబ్ పునర్విభజన చట్టం ద్వారా హిందీ మాట్లాడే వారు అధికంగా ఉన్న హర్యానాగా పంజాబ్ దక్షిణ ప్రాంతాన్ని,[4] హిమాచల్ ప్రదేశ్ గా ఉత్తర జిల్లాలను ఏర్పాటుచేసింది, కేంద్ర పాలిత ప్రాంతంగా చండీగఢ్ను పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఏర్పాటుచేశారు.[5]

1971 జనవరి 25న హిమాచల్ ప్రదేశ్,[6] మణిపూర్, మేఘాలయ, త్రిపురలకు రాష్ట్రం హోదానిచ్చారు.[7] సిక్కిం రాజ్యం భారతదేశంలో రాష్ట్రంగా 1975 ఏప్రిల్ 26న చేరింది.[8] 1987లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం ఫిబ్రవరి 20న, గోవా మే 30న రాష్ట్రాలుగా, గోవాకి ఉత్తరాన ఉన్న డామన్ అండ్ డయ్యు ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించాయి.[9]

నవంబరు 2000న మరో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతం ఛత్తీస్‌గఢ్గా ఏర్పాటైంది;[10] ఉత్తర ప్రదేశ్ లోని వాయువ్యంలోని పర్వత ప్రాంతం ఉత్తరాంచల్ (తర్వాత 2007లో ఉత్తరాఖండ్ గా పేరు మారింది[11]) గా విభజితమైంది, బీహార్ దక్షిణ జిల్లాల నుంచి జార్ఖండ్ ఏర్పాటైంది.[12] On 2 2014 జూన్ 2న, ఆంధ్ర ప్రదేశ్ విభజన ద్వారా తెలంగాణ ఏర్పడింది.[13]

అస్సాం[మార్చు]

కర్బీ ఆంగ్లాంగ్[మార్చు]

కర్బీ ఆంగ్లాంగ్ అన్నది అస్సాంలోని రెండు జిల్లాల్లో ఒకటి. దీన్ని పూర్వం మికిర్ కొండలు అని పిలిచేవారు. బ్రిటీష్ ప్రభుత్వం మినహాయించిన, పాక్షికంగా మినహాయించిన ప్రదేశాలుగా వ్యవహరించిన ప్రదేశాల్లో ఇది భాగం. బ్రిటీష్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ప్రభుత్వంలో భాగంగా పరిణమించలేదు. ఆ కారణంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలూ జరగలేదు, పన్నులూ తీసుకోలేదు. కర్బీ భూమి గురించి తొలి వినతిపత్రం 1940 అక్టోబరు 28న గవర్నర్ రీడ్ కు సెంసొన్సింగ్ ఇంగ్తి, ఖొర్సింగ్ తెరంగ్ మొహోంగ్దిజువా వద్ద సమర్పించారు.,[14] . కర్బీ నాయకులు 1960 జూలై 6న ఏర్పాటైన అఖిల పక్ష సమావేశంలో భాగస్వాములయ్యారు.[15] కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా కౌన్సిల్ ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ 1981లో తీర్మానం ఆమోదించారు. దాంతో 1986 నుంచి అటానమస్ స్టేట్ డిమాండ్ కమిటీ (ఎ.ఎస్.డి.సి.) 244 (ఎ) అధికరణం ద్వారా స్వయంనిర్ణయాధికారం కల రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేసింది. 2002లో కార్బీ ఆంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ తిరిగి మరో ప్రతిపాదన చేసి పత్రికలకు పంపింది. ఇవి కాక పలు సంస్థలు పలుమార్లు మొమొరాండాలు సమర్పించారు. కార్బీ ఆంగ్లాంగ్ కు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలన్ని డిమాండ్ 2013 జూలై 31లో హింసాత్మక మార్గం పట్టింది. ఈ సందర్భంగా విద్యార్థి ఆందోళనకారులు ప్రతి ప్రభుత్వ భవనానికి నిప్పుపెట్టారు. కార్బీ ఆంగ్లాంగ్ ప్రాంతపు ఎన్నికైన ప్రతినిధులు సంయుక్తంగా భారత ప్రధానికి ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ మొమొరాండం సమర్పించారు. ప్రధాని ఈ అంశంపై వారికి హామీ ఇచ్చారు.

బోడోలాండ్[మార్చు]

ప్రత్యేక బోడోలాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటుచేసేందుకు జరిగిన ఆందోళన భారతప్రభుత్వం, బోడో లిబరేషన్ టైగర్ ఫోర్స్ లకు మధ్య ఒప్పందానికి దారితీసింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం 2003 ఫిబ్రవరి 10న బోడో టెరిటోరియల్ కౌన్సిల్ అనే అస్సాం ప్రభుత్వ సబ్-ఆర్డినేట్ సంస్థ ఏర్పడింది. దీని కిందికి అస్సాంలోని నాలుగు జిల్లాల్లో, 3082 బోడో జనాధిక్య గ్రామాలు వస్తాయి.[16][17] 2003 మే 13లో కౌన్సిల్ కు ఎన్నికలు జరిగాయి, 46 మంది సభ్యుల కౌన్సిల్ కు ఛీఫ్ గా హగ్రామా మోహిలరీ ప్రమాణ స్వీకారం చేశారు.[18]

బీహార్[మార్చు]

మిథిల[మార్చు]

మైథిలి భాషా ప్రాంతం

మిథిల బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో మైథిలి మాట్లాడే ప్రాంతాలతో ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదిత ప్రాంతం. మైథిలి వ్యవహర్తలు ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్న జిల్లాలు బీహార్ రాష్ట్రంలో 24, జార్ఖండ్ లో 6 ఉన్నాయి. ప్రతిపాదిత రాష్ట్రానికి ఏది రాజధానిగా ఉండాలన్న దానిపై ఏకాభిప్రాయం లేదు, వివిధ వ్యక్తులు, సమూహాలు ముజఫర్ పూర్, బరౌనీ, దర్భంగా నగరాలను ప్రతిపాదిస్తున్నాయి.

Bhojpur[మార్చు]

</ref>[19]

-->

మూలాలు[మార్చు]

 1. "First Schedule of the Constitution of India" (PDF). Government of India. Retrieved 23 May 2013. Cite web requires |website= (help)
 2. J.C. Aggarwal and S.P. Agrawal, editors, Uttarakhand: Past, Present, and Future (New Delhi: Concept Publishing, 1995), p89-90
 3. Nagaland History & Geography-Source india.gov.in
 4. The Punjab Reorganisation Act 1966
 5. "State map of India". Travel India guide. Retrieved 2013-06-17. Cite web requires |website= (help)
 6. Statehood Himachal Pradesh
 7. "Snapshot of North Eastern States" (PDF). మూలం (PDF) నుండి 2009-12-22 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-05-30. Cite web requires |website= (help)
 8. Sikkim joins Indian Union
 9. "Goa Chronology". మూలం నుండి 2011-07-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-06-01. Cite web requires |website= (help)
 10. "Chhattisgarh state - History". Cg.gov.in. 1979-12-19. మూలం నుండి 2010-07-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-06-17. Cite web requires |website= (help)
 11. Chopra, Jasi Kiran (2 January 2007). "Uttaranchal is Uttarakhand, BJP cries foul". TNN. The Time of India. Retrieved 22 January 2013.
 12. "Official Website of Government of Jharkhand". Jharkhand.gov.in. Retrieved 2013-06-17. Cite web requires |website= (help)
 13. "Notification" (PDF). The Gazette of India. Government of India. 4 March 2014. Retrieved 6 February 2015.
 14. Dharamsing Teron, "Opium Curse - A Forgotten Chapter", unpublished.
 15. J. I. Kathar (IAS Retd), "1971 Aningkan Kilik Kehai Un:e....", Thekar (5 February 2013); available from http://thekararnivang.com/2013/02/05/1971-aningkan-kilik-kehai-un-e-karbi-asongja-atum-karbi-atum-aphan-autonomous-state-kapelong-aphurkimo-2/ Archived 2018-05-16 at the Wayback Machine.
 16. "The Hindu : Assam: accord and discord". Hinduonnet.com. Retrieved 2012-03-04. Cite web requires |website= (help)[permanent dead link]
 17. "Memorandum of Settlement on Bodoland Territorial Council (BTC)". Satp.org. 10 February 2003. Retrieved 2012-03-04. Cite web requires |website= (help)
 18. "Mahillary sworn in Bodoland council chief". The Hindu. Chennai, India. 4 June 2005.
 19. http://archive.indianexpress.com/news/demand-for-creation-of-ten-new-states/482355/