కాసర్‌గోడ్
Kasaragod | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
Municipal Town | ||||||||||
Casrod | ||||||||||
Clockwise from top: Bekal beach, Chandragiri River, Chandragiri Fort, Ranipuram, Bekal Fort, Kavvayi Backwaters at Nileshwaram, Malik Dinar Mosque, and Arikady fort | ||||||||||
Nickname(s): The Land of Seven Languages,The Land of God[1] | ||||||||||
Location of Kasaragod in Kerala | ||||||||||
Coordinates: 12°30′N 75°00′E / 12.5°N 75.0°E | ||||||||||
Country | India | |||||||||
State | Kerala | |||||||||
జిల్లా | Kasaragod | |||||||||
Municipality Established | 1966 | |||||||||
Government | ||||||||||
• Type | District | |||||||||
• Body | Kasaragod Municipality | |||||||||
• Municipal Chairman | V.M.Muneer (UDF) | |||||||||
• District Collector | Smt. Bhandari Swagat Ranveerchand IAS | |||||||||
• Superintendent of Police | P B Rajeev IPS | |||||||||
• MP | Rajmohan Unnithan | |||||||||
• MLA | N. A. Nellikkunnu | |||||||||
విస్తీర్ణం | ||||||||||
• Municipal Town | 16.7 కి.మీ2 (6.4 చ. మై) | |||||||||
• Metro | 93.3 కి.మీ2 (36.0 చ. మై) | |||||||||
Elevation | 19 మీ (62 అ.) | |||||||||
జనాభా | ||||||||||
• Municipal Town | 54,172 | |||||||||
• జనసాంద్రత | 3,200/కి.మీ2 (8,400/చ. మై.) | |||||||||
• Metro | 1,92,856 | |||||||||
Languages | ||||||||||
• Official | Malayalam, English[2] | |||||||||
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) | |||||||||
పిన్ కోడ్ | 671121 | |||||||||
Telephone | 91–04994 | |||||||||
Vehicle registration | KL-14 |
కాసరగోడ్, భారతదేశం, కేరళ రాష్ట్రం, కాసరగోడ్ జిల్లాకు చెందిన పురపాలకసంఘ పట్టణం. ఇది అదే జిల్లాకు పరిపాలనా ప్రధాన కార్యాలయం.కాసరగోడ్ జిల్లాలో 1966లో స్థాపించబడిన మొదటి పురపాలకసంఘ పట్టణం.ఇది కేరళకు ఉత్తరాన ఉంది. దీనిని సప్త భాషా సంగమ భూమి ('ఏడు భాషల భూమి') అని కూడా పిలుస్తారు. పశ్చిమ కనుమలలో సుసంపన్నమైన జీవవైవిధ్యంలో నెలకొని ఉన్న పట్టణం.[3] చంద్రగిరి నది, చారిత్రాత్మకమైన కోలాతిరి రాజాలు పాలించిన రాణిపురం, కొట్టంచేరి కొండలతో సహజ వాతావరణం కలిగిన పట్టణం. మడియన్ కులోం ఆలయం, మధుర్ దేవాలయం, అనంతపుర సరస్సు దేవాలయం, మాలిక్ దీనార్ మసీదు వంటి చారిత్రక, మతపరమైన ప్రదేశాలకు ఇది ప్రసిద్ధి చెందిన పట్టణం. ఎజిమల చారిత్రాత్మక కొండ, నీలేశ్వరం కవ్వాయి, బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. కాసరగోడ్ నగరం, కన్నూర్ నగరానికి ఉత్తరాన 90 కిమీ, మంగళూరుకు దక్షిణంగా 50 కి.మీ.దూరంలో ఉంది.కేరళ రాష్ట్రంలో కాసరగోడ్ జిల్లాలో అత్యధిక నదులు (12) ఉన్నాయి.[4] ఈ పట్టణం జిల్లాలోనే అతిపొడవైన చంద్రగిరి నది అరేబియా సముద్రంలో కలిసిపోయే సముద్రతీర ప్రాంతానికి సమీపంలోఉంది.కాసరగోడ్ ఆరికడి కోట, బేకల్ కోట, చంద్రగిరి కోట, హోస్దుర్గ్ కోటతో సహా అనేక కోటలకు ఇది నిలయం.బేకల్ కోటకేరళలో అతిపెద్దకోట.[3] కాసరగోడ్ 16వ శతాబ్దం వరకు కుంబ్లా రాజవంశం క్రింద ఉంది. ఇది కన్నూర్ కేంద్రంగా ఉన్న కొలతునాడు రాజ్యానికి సామంతుడిగా ఉంది.[5] సా.శ.16వ శతాబ్దం లో కన్నడ రాజ్యాలు ఓడరేవు, పరిసరాలపై దృష్టి సారించాయి.[6][7][8][9]
వ్యుత్పత్తి శాస్త్రం
[మార్చు]కాసరగోడ్ పేరు ఉత్పన్నంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి కాసర (అంటే సరస్సు లేదా చెరువు) క్రోడ్ లేదా గోడ్ (నిధిని ఉంచే ప్రదేశం) అనే రెండు సంస్కృత పదాల కలయికతో ఏర్పడింది. కాసరగోడ్‌ను మలయాళంలో కన్హిరకోడ్ (కణిరం చెట్లభూమి) అని పిలుస్తారు. ఇక్కడ సమృద్ధిగా కనిపించే కసరక చెట్లకు (కన్నడ పేరు) కాంజీరం మలయాళం.[10][11]
చరిత్ర
[మార్చు]ప్రాచీన యుగం
[మార్చు]రాజకీయంగా ఈ ప్రాంతం ప్రస్తుత కన్నూర్ జిల్లాలోని ఎజిమల వద్ద రాజధానితో ఎజిమల రాజ్యంలో భాగంగా ఉంది. ఎజిమల అత్యంత ప్రసిద్ధి పొందినరాజు నన్నన్, అతని రాజ్యం గూడలూర్, కోయంబత్తూరు ఉత్తర ప్రాంతాల వరకు విస్తరించింది. పూజినాడ్, కర్కనాడ్‌తో పాటు ఎజిమల రాజవంశం తూర్పు ప్రాంతాలను (కొడగులోని కొన్నిప్రాంతాలతో వాయనాడ్-గూడలూర్ ప్రాంతం) కలిగి ఉంది.దాని రాజధాని ఎజిమల వద్ద ఉంది.మూషకరాజులు నన్నన్ వారసులుగా పరిగణించబడ్డారు. సా.శ.14వ శతాబ్దం నాటికి మూషక రాజ్యాన్ని కోలాతిరినాడ్ ను పాలకులను కోలాతిరిస్ అని పిలిచేవారు.కొలతునాడ్ రాజ్యం దాని శక్తిశిఖరాగ్రంలో ఉత్తరాన [12] నేత్రావతి నది (మంగుళూరు) నుండి దక్షిణాన కొరపుజా (కోజికోడ్) వరకు పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పు సరిహద్దులో కొడగు కొండలు, వివిక్త ద్వీపాలతో సహా అరేబియా సముద్రంలో లక్షద్వీప్ వరకు విస్తరించింది.[13]
మధ్యయుగం
[మార్చు]కాసరగోడ్, మంగుళూరు నగరానికి దక్షిణంగా సుమారు 50 కి.మీ.దూరంలోఉంది. పూర్వ కాలంలో ఇది ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉండేది.రామచరితం, బహుశా పాత మలయాళంలో వ్రాయబడిన పురాతన సాహిత్య రచన, ఇది సా.శ. 12 వ శతాబ్దం నాటి దాని చేతివ్రాత ప్రతులు నీలేశ్వరంలో కనుగొన్నారు.కవితలలో కుంబ్లాలోని అనంతపుర సరస్సు ఆలయం గురించి వివరంగా ప్రస్తావించారు.[14] కాసరగోడ్‌ను అరబ్బులు హార్క్‌విలియా అనే పేరుతో పిలిచేవారు.[6] కాసరగోడ్ పట్టణంలోని మాలిక్ దినార్ మసీదు భారత ఉపఖండంలోని పురాతన మసీదులలో ఒకటి.[15] కిస్సాత్ శకర్వతి ఫార్మాడ్ ప్రకారం కొడంగల్లూర్, కొల్లం, మాదాయి, బర్కూర్, మంగళూరు, కాసరగోడ్, కన్నూర్, ధర్మాడం, పంథాలాయిని, చలియమ్ లోని మసీదులు మాలిక్ దినార్ కాలంలో నిర్మించారు.అవిభారత ఉపఖండంలో భారతీయమసీదులలో పురాతనమైనవి.[16] కాసరగోడ్ పట్టణంలోని తలంగరలో మాలిక్ దినార్ మరణించినట్లు భావిస్తారు.[15] సా.శ. 9వ - సా.శ. 14వ శతాబ్దాల మధ్య కేరళను సందర్శించిన చాలామంది అరబ్ యాత్రికులు కాసరగోడ్‌ను సందర్శించారు.ఇది అప్పట్లో ఒక ముఖ్యమైన వాణిజ్యకేంద్రం.1514లో కాసరగోడ్ పట్టణ సమీపంలోని కుంబ్లాను సందర్శించిన పోర్చుగీస్ యాత్రికుడు డువార్టే బార్బోసా మాల్దీవులకు కొబ్బరికాయల కోసం బియ్యం ఎగుమతి చేస్తున్నట్లు నమోదు చేశాడు.[6] బార్బోసా ప్రకారం, భారతదేశ నైరుతి మలబార్ తీరంలో ఉన్న ప్రజలు ఉత్తరాన చంద్రగిరి నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు ఒక ప్రత్యేకమైన భాషను మాట్లాడేవారు. దానిని వారు "మలియామా" అనిపిలిచారు.అదే మళయాళంగా పేరొందింది.[17][18]
సా.శ.16వ శతాబ్దం వరకు,కాసర్‌గోడ్ పట్టణాన్ని మలయాళంలో కన్హిరాకోడ్ ('కాన్హిర చెట్ల భూమి' అని అర్ధం కావచ్చు) అనేపేరుతో పిలిచేవారు.[10] కుంబ్లా లోని మైపాడి రాజగృహం నుండి చంద్రగిరి నది, నేత్రావతి నది (ప్రస్తుత మంజేశ్వర్, కాసరగోడ్ తాలూకాలతో సహా) మధ్య ఉన్న దక్షిణ తుళునాడు భూభాగాన్ని చుట్టుముట్టిన కుంబ్లా రాజవంశం, అంతకు ముందు ఉత్తర మలబార్‌లోని కోలతునాడు రాజ్యానికి సామంతులుగా ఉన్నారు.[19] కుంబ్లా రాజవంశం మలయాళీ నాయర్లు, తుళువ బ్రాహ్మణుల మిశ్రమ వంశాన్ని కలిగి ఉంది.[5] వారు కేరళకు చెందిన చేరమాన్ పెరుమాళ్ల నుండి తమ మూలాన్ని పేర్కొన్నారు. కుంబ్లా రాజవంశం ఆచారాలు సమకాలీన మలయాళీ రాజుల మాదిరిగానే ఉన్నాయని ఫ్రాన్సిస్ బుకానన్-హామిల్టన్ పేర్కొన్నాడు.[5] కోలతిరి డొమినియన్ పది స్వతంత్ర సంస్థానాలుగా ఉద్భవించాయి.అవి కడతనాడు (వడకరా), రండతర లేదా పోయినాడ్ (ధర్మడోమ్), కొట్టాయం ( తలస్సేరి), నీలేశ్వరం, ఇరువజినాడు (పానూరు), కురుంబ్రానాడ్ మొదలైనవి. అంతర్గత విభేదాల ఫలితంగా వేర్వేరు రాజకీయ నాయకుల క్రింద ఉన్నాయి.[20] నేటి హోస్‌దుర్గ్ తాలూకా (కన్హంగాడ్), వెల్లరికుండు లోని అనేక భాగాలు నీలేశ్వరం రాజవంశంలో భాగాలుగా ఉన్నాయి. వీరు మధ్యయుగ కాలంలోని కోలతునాడు, జామోరిన్ ఆఫ్ కాలికట్ రెండింటికి దగ్గరి సంబంధం ఉంది.[21] చంద్రగిరి నదికి ఉత్తరాన ఉన్న ప్రాంతాలు (ప్రస్తుత మంజేశ్వరం, కాసరగోడ్ తాలూకాలు) కుంబళ రాజవంశంచే పాలించబడ్డాయి.[5]
స్వాతంత్ర్యం తరువాత
[మార్చు]కేరళ ఏర్పడక ముందు, కాసర్‌గోడ్ మద్రాసు ప్రెసిడెన్సీలోని దక్షిణ కెనరా జిల్లాలో భాగంగా ఉండేది. అయితే, సా.శ.19వ శతాబ్దంలో, కాసర్‌గోడ్ తాలూకా దక్షిణ కెనరా నుండి ఈ ప్రాంతాన్ని విడదీయడానికి, దక్షిణ కెనరాలోని ఏకైక మలయాళ-మెజారిటీ ప్రాంతం కాబట్టి దీనిని మలబార్ జిల్లాలో కలపడానికి అనేక పోరాటాలు జరిగాయి.రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 1956 నవంబరు 1 న కేరళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాసర్‌గోడ్ కేరళలోని కన్నూర్ జిల్లాలో భాగంగా మారింది [22] తర్వాత కాసర్‌గోడ్‌ను పరిపాలన సౌలభ్యం కోసం రెండు తాలూకాలుగా విభజించారు. కాసర్‌గోడ్, హోస్‌దుర్గ్. 1984లో కాసర్‌గోడ్‌ను జిల్లాగా ప్రకటించారు. తుళు, కన్నడ మాట్లాడే గణనీయమైన జనాభా ఉన్నందున కాసరగోడ్‌ను కేరళతో కలపడం వివాదాస్పద అంశంగా మారింది.
1951భారత జనాభా లెక్కల సమయంలో, జిల్లా జనాభాలో కేవలం 72.0% మంది మాత్రమే తమ మాతృభాషను మలయాళంగా ఎంచుకున్నారు.[23] 14.2% మంది తులు,6.3% మంది కన్నడను ఎంచుకున్నారు.[23] కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం జనాభాలో 8.8%, 4.2% మంది మాత్రమే వరుసగా తుళు, కన్నడ మాతృభాషగా మాట్లాడు తున్నారు. 2012లో రెండవ ఊమెన్ చాందీ మంత్రిత్వ శాఖ, కేరళలోని ఈ ఉత్తరాది జిల్లా ఎదుర్కొంటున్న వెనుకబాటు తనం, సమస్యల గురించి అధ్యయనం చేయడానికి జిల్లాకు ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రణాళిక రూపొందించడానికి మాజీ ప్రధాన కార్యదర్శి పి. ప్రభాకరన్ నేతృత్వంలోఒక సంఘాన్ని నియమించింది.[24] 2013లో జిల్లాలో మంజేశ్వరం, వెల్లరికుండు అనే మరో రెండు తాలూకాలు ఏర్పడ్డాయి.[25]
భౌగోళిక శాస్త్రం
[మార్చు]నదులు
[మార్చు]కేరళ రాష్ట్రంలో కాసరగోడ్ అత్యధికంగా 12 నదులను కలిగి ఉంది.[4] అవన్నీ పశ్చిమాన ప్రవహించే నదులు.[26] వాటిలో పొడవైంది చంద్రగిరి నది (105 కిమీ పొడవు). కాసరగోడ్ పట్టణం చంద్రగిరినది ఒడ్డున ఉంది. ఇది తలంగర వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది.[26] చంద్రగిరి కోట దాని ఒడ్డున నిర్మించబడింది.ఈ నది కొడగు (కూర్గ్) లోని పట్టిమల వద్ద ఉద్భవిస్తుంది.[26] కేరళలోని అతి చిన్ననది ఈ జిల్లాలోనే ఉంది.
నదులు | మూలం | పొడవు (కి.మీ) | ||
మొత్తం | నౌకాయానం | |||
1 | మంజేశ్వర నది | కడందూర్ కొండలు | 16 | 3 |
---|---|---|---|---|
2 | ఉప్పల నది | కుడిపడి కొండలు, వీరకంబ | 50 | N/A |
3 | షిరియా నది | కనకడ్ కొండలు, అనెగుండి రిజర్వ్ ఫారెస్ట్ | 61 | 5 |
4 | కుంబ్లా నది | యెడనాడు | 11 | 3 |
5 | మొగ్రాల్ నది | కన్లూర్, కరడ్క రిజర్వ్ ఫారెస్ట్ | 34 | N/A |
6 | చంద్రగిరి నది | పట్టి అటవీ, తలకావేరి వన్యప్రాణుల అభయారణ్యం | 105 | 13 |
7 | కల్నాడ్ నది | చెట్టియాంచల్ | 8 | N/A |
8 | బేకల్ నది | కానియడ్క | 11 | N/A |
9 | చిత్తారి నది | కుండియా | 25 | N/A |
10 | నీలేశ్వరం నది(తేజస్విని నది) | కినానూరు, తలకావేరి వన్యప్రాణుల అభయారణ్యం | 47 | 11 |
11 | కరియాంగోడ్ నది | పదినల్కాడ్, కూర్గ్ కొండలు | 64 | 24 |
12 | కవ్వాయి నది | చీమేని | 23 | 10 |
విజ్ఞాన పరిశోధన
[మార్చు]కాసర్‌గోడ్ జిల్లా కన్నూర్ విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తుంది. కాసరగోడ్ సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ సంస్థకు నిలయం. వాస్తవానికి 1916లో కొబ్బరి పరిశోధనా కేంద్రంగా స్థాపించబడింది.ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కింద భారతదేశ జాతీయ వ్యవసాయ పరిశోధనా వ్యవస్థలో భాగం.[27]
- కాసరగోడ్‌లోని సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ [28] లో స్థాపించారు
- ప్రభుత్వ కళాశాల కాసరగోడ్ 1957లో స్థాపించారు.
- సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ కేరళ 2009లో స్థాపించారు [29][30]
- మాలిక్ దీనార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ సీతంగోలీ, కాసరగోడ్‌లో ఉంది.
- లాల్ బహదూర్ శాస్త్రి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాసరగోడ్, 1993లో స్థాపించారు.
- కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ త్రికరిపూర్ [31] లో స్థాపించారు.
- ఖాన్సా ఉమెన్స్ కాలేజ్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్, కాసరగోడ్
- జామియా స అదియా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కాసరగోడ్
- షరాఫ్ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల, పదన్న
- జైనాబ్ మెమోరియల్ బిఇడి సెంటర్, కాసరగోడ్
- పీపుల్స్ ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్, మున్నాడ్, కాసరగోడ్
- కో-ఆపరేటివ్ ఆర్ట్స్, సైన్స్ కళాశాల, బడియడ్క, కాసరగోడ్
- సెయింట్ గ్రెగోరియోస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, పెర్ల, కాసరగోడ్
రవాణా
[మార్చు]ముంబయి నుండి కన్యాకుమారి వరకు భారతదేశం లోని పశ్చిమ తీరాన్ని కలిపే జాతీయ రహదారి 66 జిల్లాలోని తీరప్రాంతం గుండా మంజేశ్వర్, ఉప్పల, కుంబ్లా, కాసరగోడ్, ఉద్మా, బేకల్, కన్హంగాడ్, నీలేశ్వరం, త్రికరిపూర్ వంటి ప్రధాన తీర పట్టణాలను కలుపుతుంది.[32][33][34] ఇది తాళ్లపాడువద్ద జిల్లాలోకి ప్రవేశించి పయ్యనూర్ మీదుగా బయటకు వెళుతుంది. రాష్ట్ర రహదారులు కాసర్‌గోడ్ నుండి ప్రారంభమై, కన్హంగాడ్‌లో ముగుస్తుంది.[35] కేరళ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ జిల్లాలో తన సేవలను నిర్వహించడానికి స్టేషన్లను కలిగి ఉంది.[36] రైలు తీరప్రాంతం గుండా వెళుతుంది. కాసరగోడ్ రైల్వే స్టేషన్ మంగళూరు - షోరనూర్ లైన్‌లో దక్షిణ విభాగంలోని పాలక్కాడ్ రైల్వే డివిజన్‌లో ఉంది.[37] కాసరగోడ్ జిల్లాలో కేరళలోని 13 చిన్న ఓడరేవులలో మూడు -మంజేశ్వర్, కాసరగోడ్, నీలేశ్వరం ఉన్నాయి. [38] సమీప అంతర్జాతీయ విమానాశ్రయం మంగళూరులో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, కాసరగోడ్ పురపాలకసంఘ పరిధిలో 54,172 మంది జనాభా ఉన్నారు, ఇందులో 26,319 మంది పురుషులు కాగా, 27,853 మంది మహిళలు ఉన్నారు.కాసరగోడ్ పురపాలక సంఘం 16.69 కి.మీ2 (6.44 చ. మై.) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో 10,202 కుటుంబాలు నివసిస్తున్నాయి. రాష్ట్ర సగటు 1084కి వ్యతిరేకంగా స్త్రీ లింగ నిష్పత్తి 1058గా ఉంది. 0-6 సంవత్సరాల వయస్సు గల జనాభా 7,234 (13.4%) మంది ఉన్నారు. అందులో 3,716 మంది పురుషులు ఉండగా, 3,518 మంది స్త్రీలు ఉన్నారు. కాసరగోడ్ పట్టణం అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 94% కంటే 94.76% ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 96.5% స్త్రీల అక్షరాస్యత 93.1%.[40]
సందర్శస ప్రదేశాలు
[మార్చు]- అనంతపురం సరస్సు దేవాలయం
- ఆరికడి కోట
- బేకల్ కోట [41]
- చంద్రగిరి కోట [42]
- ఎడాయిలక్కడ్ ద్వీపం [43]
- కణ్వతీర్థ బీచ్
- కప్పిల్ బీచ్ [44]
- కొట్టంచెరి కొండలు
- మాలిక్ దినార్ మసీదు
- మయిపడి ప్యాలెస్ [45]
- నీలేశ్వరం ఈస్ట్యూరీ బీచ్
- అవర్ లేడీ ఆఫ్ సారోస్ చర్చి
- పల్లిక్కర బీచ్
- రాణిపురం హిల్ స్టేషన్
- వలియపరంబ ద్వీపం
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- అంబికాసుతన్ మంగడ్ - మలయాళ రచయిత
- అనిల్ కుంబ్లే - భారత మాజీ క్రికెటర్, కోచ్ , వ్యాఖ్యాత
- ఆర్య - భారతీయ నటుడు
- ఆసిఫ్ కొట్టాయిల్ - భారత ఫుట్‌బాల్ క్రీడాకారుడు
- బెల్లికోత్ రఘునాథ్ షెనాయ్ - భారతీయ ఆర్థికవేత్త
- డికె చౌతా - భారతీయ వ్యాపారవేత్త
- ఇ. చంద్రశేఖరన్ – కేరళ మంత్రి
- హరికుమార్ పల్లతడ్క - ఆర్.టి.ఐ కార్యకర్త
- కె.కె వేణుగోపాల్ - భారత అటార్నీ జనరల్
- కనాయి కున్హిరామన్ - భారతీయ కళాకారుడు
- కావ్య మాధవన్ - భారతీయ నటి
- కయ్యర్ కిన్హన్న రాయ్ - భారత స్వాతంత్ర్య కార్యకర్త
- మహిమా నంబియార్ - భారతీయ నటి
- మిర్షాద్ మిచు - భారత ఫుట్‌బాల్ గోల్ కీపర్
- మహ్మద్ రఫీ - భారత ఫుట్‌బాల్ క్రీడాకారుడు
- మహ్మద్ అజారుద్దీన్ - భారత క్రికెటర్
- పి. కున్హిరామన్ నాయర్ – మలయాళ కవి
- పల్లతడ్క ప్రమోద కుమారి - శాస్త్రవేత్త
- ప్రకాష్ బేరే - నటుడు
- రూపేష్ శెట్టి – కన్నడ, తుళు చిత్ర పరిశ్రమలో నటుడు, మంగళూరులో రేడియో జాకీ, మోడల్
- సంతోష్ ఎచిక్కనం - మలయాళ చిన్న కథా రచయిత
- సారా అబూబకర్ - కన్నడ రచయిత్రి
- సత్య - భారతీయ నటుడు
- వైశాఖ్ - మలయాళ చిత్ర దర్శకుడు
- కె.వి. రమేష్ - కళాకారుడు
ఇవి కూడ చూడు
[మార్చు]- కాసరగోడ్ తూర్పు
- కూలూర్
- కాసరగోడ్ జిల్లాలోని విద్యా సంస్థల జాబితా
- కాసరగోడ్‌లోని పర్యాటక ఆకర్షణల జాబితా
మూలాలు
[మార్చు]- ↑ "Cazrod - the land of seven languages". invest kerala. Government of Kerala. Retrieved 12 September 2020.
- ↑ "The Kerala Official Language (Legislation) Act, 1969" (PDF). Archived from the original (PDF) on 2016-04-20. Retrieved 2023-05-28.
- ↑ 3.0 3.1 "Draft Map" (PDF). keralaczma.gov.in. 2012. Archived from the original (PDF) on 28 జనవరి 2021. Retrieved 22 January 2021.
- ↑ 4.0 4.1 "Rivers in Kasargod". Kerala Tourism. Retrieved 12 September 2020.
- ↑ 5.0 5.1 5.2 5.3 Sreedhara Menon, A. (2007). A Survey of Kerala History (2007 ed.). Kottayam: DC Books. ISBN 9788126415786.
- ↑ 6.0 6.1 6.2 "Kasaragod History". Government of Kerala. Archived from the original on 25 September 2008. Retrieved 11 March 2009.
- ↑ Steever, Sanford B. (15 April 2015). The Dravidian Languages. Taylor & Francis. pp. 158–159. ISBN 9781136911644.
- ↑ Bhat, N. Shyam (1998). South Kanara, 1799-1860, A Study in Colonial Administration and Regional Response. Mittal Publications. p. 6. ISBN 9788170995869.
- ↑ Caldwell, Robert (1998). A Comparative Grammar of the Dravidian Or South-Indian Family of Languages (in English). Asian Educational Services. p. 31. ISBN 9788120601178.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ 10.0 10.1 S. Muhammad Hussain Nainar (1942). Tuhfat-al-Mujahidin: An Historical Work in The Arabic Language. University of Madras. p. 97. Retrieved 10 July 2021.
- ↑ "About District | Website of Kasargod | India". Retrieved 9 July 2021.
- ↑ Sreedhara Menon, A. (2007). Kerala Charitram (2007 ed.). Kottayam: DC Books. p. 175. ISBN 978-8126415885. Retrieved 19 July 2020.
- ↑ District Census Handbook, Kasaragod (2011) (PDF). Thiruvananthapuram: Directorate of Census Operation, Kerala. p. 9.
- ↑ "Aadyakla Malayala kavitha" (PDF). Archived from the original (PDF) on 2021-06-08. Retrieved 2023-05-28.
- ↑ 15.0 15.1 Pg 58, Cultural heritage of Kerala: an introduction, A. Sreedhara Menon, East-West Publications, 1978
- ↑ Prange, Sebastian R. Monsoon Islam: Trade and Faith on the Medieval Malabar Coast.
- ↑ Barbosa, Duarte (1989). The Book of Duarte Barbosa: An Account of the countries bordering on the Indian Ocean and their inhabitants (Volume 2) (in ఇంగ్లీష్). Asian Educational Services. pp. 1–7. ISBN 9788120604513.
Per Barbosa, Malabar begins at the point where the kingdom of Narasyngua or Vijayanagar ends, that is at Cumbola (Cambola) on the Chandragiri river. But, as he (Barbosa) says, the Malayalam language extends as far north as the Chandragiri, and Malabar may be reckoned as extending south from this point to Cape Comorin.
- ↑ Barbosa, Duarte; Dames, Mansel Longworth (1918). "The Book of Duarte Barbosa: An Account of the countries bordering on the Indian Ocean and their inhabitants - Volume I" (PDF). indianculture.gov.in. Asian Educational Services. pp. 194–198. Retrieved 24 April 2022.
- ↑ M. Vijayanunni. 1981 Census Handbook- Kasaragod District (PDF). Directorate of Census Operations, Kerala.
- ↑ Logan, William (2010). Malabar Manual (Volume-I). New Delhi: Asian Educational Services. pp. 631–666. ISBN 9788120604476.
- ↑ The Hindu staff reporter (21 November 2011). "Neeleswaram fete to showcase its heritage". The Hindu. Retrieved 24 November 2016.
- ↑ "Kasargod After District Formation". Kasargod District. Archived from the original on 10 April 2009. Retrieved 11 March 2009.
- ↑ 23.0 23.1 J. I. Arputhanathan (1955). South Kanara, The Nilgiris, Malabar and Coimbatore Districts (Village-wise Mother-tongue Data for Bilingual or Multilingual Taluks) (PDF). Madras Government Press.
- ↑ Roy Mathew (24 May 2012). "Commission to draw up package for Kasaragod". The Hindu.
- ↑ "12 new taluks to be formed in Kerala". The Hindu. 21 March 2013.
- ↑ 26.0 26.1 26.2 26.3 Government of India (2014–15). District Census Handbook - Kasaragod (Part-A) 2011 (PDF). Directorate of Census Operations, Kerala.
- ↑ "About Institute". CPCRI.in. Central Plantation Crops Research Institute. Archived from the original on 2016-02-01. Retrieved 25 January 2016.
The Coconut Research Station at Kasaragod in Kerala was initially established in 1916 by the then Government of Madras and subsequently it was taken over by the Indian Central Coconut Committee in 1948
- ↑ "Central Plantation Crops Research Institute(CPCRI)". cpcri. Retrieved 24 September 2012.
- ↑ Description on official website[permanent dead link]
- ↑ Prospectus of Central University of Kerala
- ↑ "CETKR | College Of Engineering Trikaripur". cetkr.ac.in (in ఇంగ్లీష్). Archived from the original on 8 డిసెంబరు 2017. Retrieved 8 December 2017.
- ↑ "All new national highways to be made of concrete: Nitin Gadkari". timesofindia-economictimes.
- ↑ "National Highway work gains speed in Kerala". 27 August 2017.
- ↑ "Home". OnManorama. Retrieved 19 November 2021.
- ↑ "Economic review 2015" (PDF). Retrieved 27 February 2016.[permanent dead link]
- ↑ "All about KSRTC". Keralartc.com. Archived from the original on 25 June 2018. Retrieved 16 June 2018.
- ↑ "SALIENT FEATURES OF PALGHAT DIVISION" (PDF). sr.indianrailways.gov.in/. Southern Railway.
- ↑ Chandran 2018, p. 424.
- ↑ "Religion – Kerala, Districts and Sub-districts". Census of India 2011. Office of the Registrar General.
- ↑ Kerala, Directorate of Census Operations. District Census Handbook, Kasaragod (PDF). Thiruvananthapuram: Directorateof Census Operations,Kerala. p. 86,87. Retrieved 14 July 2020.
- ↑ Simran Gill (14 June 2020). "5 Lesser Known Forts in India". Outlook India. Retrieved 12 September 2020.
- ↑ Divakaran, Kattakada (2005). Kerala Sanchaaram. Thiruvananthapuram: Z Library. p. 925.
- ↑ "Proposal Submitted to Government of India: Integrated Coastal Zone Management" (PDF). sisem.in. Government of Kerala. 2015. p. 60. Retrieved 12 September 2020.
The area has rich biodiversity. The sacred grove viz. Edayilakkad island preserves many rare and endemic species.
[permanent dead link] - ↑ Vishnu Mohan (27 July 2020). "6 Lesser-Known Places in Kerala for a Weekend Break". Outlook India. Retrieved 12 September 2020.
- ↑ Giridhar Khasnis (17 May 2015). "Finding everland". Deccan Herald. Retrieved 12 September 2020.