ముషిడి
| స్ట్రైక్నైన్ చెట్టు | |
|---|---|
| Scientific classification | |
| Kingdom: | |
| Division: | |
| Class: | |
| Order: | |
| Family: | |
| Binomial name | |
| Strychnos nux-vomica | |
ముషిడి నల్లజీడి చెట్టు. ఇది భారతదేశం లోను, ఆగ్నేయాసియా లోనూ ఉండే ఆకురాల్చే చెట్టు. ఆకురాల్చే చెట్లు అంటే శీతాకాలం లేదా ఎండాకాలంలో ఆకులను రాల్చి, వసంతకాలంలో తిరిగి చిగురించే మొక్కలు. దీని ఆకులు అండాకారంగా, 5-9సెం.మీ పరిమాణంలో ఉంటాయి.[1]
జీవావరణ శాస్త్రం
[మార్చు]దీని పండులో ఉండే గుజ్జును కోతులు, పక్షులు తింటాయి. [2] హార్న్‌బిల్‌లోని కొన్ని జాతులు, మలబార్ పైడ్ హార్న్‌బిల్ కూడా దీన్ని తింటాయి.
విషప్రభావం
[మార్చు]దీని గుండ్రని, ఆకుపచ్చ లేదా నారింజ రంగు పండ్ల లోపలి విత్తనాలు అత్యంత విషపూరితమైనవి. దీనికి ప్రధాన కారణం, ఇందులో ఉండే చేదైన ఆల్కలాయిడ్లు స్ట్రైక్నైన్, బ్రూసిన్‌లు. ఈ విత్తనాలలో సుమారు 1.5%, ఎండిన పువ్వులలో 1.0% విషపదార్ధాలు ఉంటాయి.[3] అయితే, చెట్టు బెరడులో బ్రూసిన్, ఇతర విష సమ్మేళనాలు కూడా ఉంటాయి.[4]
ఉపయోగాలు
[మార్చు]స్ట్రైక్నైన్ అనేది ముషిడి వంటి మొక్కల నుండి లభించే అత్యంత విషపూరితమైన, చేదు రుచిగల తెల్లని స్ఫటికాకార పొడి. ఇది కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసి, కండరాల సంకోచాలు, మూర్ఛలకు కారణమవుతుంది. ఈ పదార్ధాన్ని వేట లోను, యుద్ధాల లోనూ బాణం మొనలకు పూసే విషంగా ఉపయోగిస్తారు. [5] దీని వాడకాన్ని చాలా దేశాలలో నియంత్రించారు. దీనిని పక్షులు, ఎలుకల వంటి చిన్న జంతువులను చంపడానికి పురుగుమందుగా వాడతారు. ఈ పొడిని పీల్చడం వల్ల ప్రాణాపాయం కలగవచ్చు.
మూలాలు
[మార్చు]- ↑ Howes, Melanie-Jayne R. (2015-10-14). "Book Review for the Botanical Journal of the Linnean Society: by Schmelzer, GH & Gurib-Fakim, A (2013) Plant Resources of Tropical Africa. 11(2). Medicinal Plants 2. PROTA Foundation, Wageningen, Netherlands". Botanical Journal of the Linnean Society. 179 (3): 546–547. doi:10.1111/boj.12271. ISSN 0024-4074.
- ↑ Hargreaves, Dorothy; Hargreaves, Bob (1970). Tropical Trees of the Pacific. Kailua, Hawaii: Hargreaves. p. 59.
- ↑ Harry L. Arnold (1968). Poisonous Plants of Hawaii. Tokyo, Japan: Charles E. Tuttle. p. 20. ISBN 0-8048-0474-5.
- ↑ Han, Quan-Bin; Li, Song-Lin; Qiao, Chun-Feng; Song, Jing-Zheng; Cai, Zong-Wei; Pui-Hay But, Paul; Shaw, Pang-Chui; Xu, Hong-Xi. "A Simple Method to Identify the Unprocessed Strychnos Seeds used in Herbal Medicinal Products". Planta Medica (in ఇంగ్లీష్). 74 (4): 458–463. doi:10.1055/s-2008-1034359. ISSN 0032-0943.
- ↑ Hargreaves, Dorothy; Hargreaves, Bob (1970). Tropical Trees of the Pacific. Kailua, Hawaii: Hargreaves. p. 59.