Jump to content

జెన్షియనేలిస్

వికీపీడియా నుండి

జెన్షియనేలిస్
జెంటియానా క్రూసియాటా"
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
ఆస్టెరిడ్స్
Order:
జెన్షియనేలిస్

లిండ్లే

జెన్షియనేలిస్ (లాటిన్ Gentianales) వృక్ష శాస్త్రములోని క్రమము. ఇందులో 5 కుటుంబాలు, సుమారు 1,200 ప్రజాతులు, 20,000 కంటే ఎక్కువ జాతులూ ఉన్నాయి.[1]ఈ క్రమంలో ఉన్న జాతుల్లో 80% పైచిలుకు జాతులు రుబియేసి అనే ఒకే కుటుంబానికి చెందినవి.

ఈ పుష్పించే మొక్కలలో చాలావాటిని సాంప్రదాయిక వైద్యంలో ఉపయోగిస్తారు. నొప్పి, ఆందోళన, క్యాన్సర్లు, నరాల వ్యాధులకు చికిత్స చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నారు.[2]

ముఖ్య లక్షణాలు

[మార్చు]
  • పుష్పాలు సౌష్టవయుతము, అండకోశాధస్థితము.
  • కేసరాలు మకుటదళోపరిస్థితము.
  • పత్రాలు సాధారణంగఅ అభిముఖంగా ఉంటాయి.

వర్గీకరణం

[మార్చు]

డాల్‌గ్రెన్ వర్గీకరణ వ్యవస్థలో జెంటియల్స్ క్రమం జెంటియానిఫ్లోరే (జెంటియాననే అని కూడా పిలుస్తారు) సూపర్ క్రమంలో ఉంది. ఏపిజి III వ్యవస్థ ప్రకారం ఇందులో ఈ క్రింది కుటుంబాలు ఉన్నాయి: [3]

ఫైలోజెని

[మార్చు]

ఫైలోజెనెటిక్ వృక్షం అనేది జీవుల మధ్య పరిణామ సంబంధాలను చూపించే రేఖాచిత్రం. ఇది ఖచ్చితంగా డిఎన్ఏ శ్రేణుల పరమాణు ఫైలోజెనెటిక్ అధ్యయనాలపై ఆధారపడి ఉంటుంది. [4]

జెంటియానల్స్

 

రూబియేసి

జెల్సిమియాసి

లోగానియేసి

అపోసైనేసి

జెన్షియనేసి


శబ్దవ్యుత్పత్తి శాస్త్రం

[మార్చు]

దీని పేరు జెంటియానేసి కుటుంబం నుండి వచ్చింది.[5] ఇది జెంటియానా అనే జాతి పేరు మీద ఆధారపడి ఉంటుంది. ఈ జాతికి పేరు జెంటియస్‌ రాజు పేరు పెట్టారు.

మూలాలు

[మార్చు]
  1. Magallón, Susana; Castillo, Amanda. "Angiosperm diversification through time". American Journal of Botany (in ఇంగ్లీష్). 96 (1): 349–365. doi:10.3732/ajb.0800060. ISSN 0002-9122.
  2. Wiley (2005-09-09). Encyclopedia of Life Sciences (in ఇంగ్లీష్) (1 ed.). Wiley. doi:10.1038/npg.els.0003732. ISBN 978-0-470-01617-6.
  3. Angiosperm Phylogeny Group. "An update of the Angiosperm Phylogeny Group classification for the orders and families of flowering plants: APG III".
  4. . "Phylogenetic relationships within the Gentianales based on NDHF and RBCL sequences, with particular reference to the Loganiaceae".
  5. Yang, Lei‐Lei; Li, Hong‐Lei; Wei, Lei; Yang, Tuo; Kuang, Dai‐Yong; Li, Ming‐Hong; Liao, Yi‐Ying; Chen, Zhi‐Duan; Wu, Hong; Zhang, Shou‐Zhou. "A supermatrix approach provides a comprehensive genus‐level phylogeny for Gentianales". Journal of Systematics and Evolution (in ఇంగ్లీష్). 54 (4): 400–415. doi:10.1111/jse.12192. ISSN 1674-4918.