Jump to content

రూబియేసి

వికీపీడియా నుండి

రూబియేసి
Lady's Bedstraw (Galium verum)
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
రూబియేసి

Type genus
Rubia
ప్రజాతులు

See text
For a full list, see: List of Rubiaceae genera

రూబియేసి (లాటిన్ Rubiaceae) పుష్పించే మొక్కలలో ఒక కుటుంబము.

కుటుంబ లక్షణాలు

[మార్చు]
  • అభిముఖంగా అమరి ఉండే సరళపత్రాలు.
  • వృంతంతర లేదా గ్రీవ పుచ్ఛాలు.
  • డైఖేసియల్ సైమ్ పుష్పవిన్యాసము.
  • పుష్పాలు ద్విలింగకము, చక్రీయము, అండకోశోపరిస్థితము, చతుర్బాగ లేదా పంచభాగయుతము.
  • రక్షక పత్రాలు 4-5, సంయుక్తము.
  • ఆకర్షణ పత్రాలు 4-5, సంయుక్తము, గరాట ఆకారము లేదా నాళికాకారము.
  • కేసరము 4-5, మకుట దళోపరిస్థితము.
  • ఫలదళాలు 2, సంయుక్తము, నిమ్న అండాశయము.
  • స్తంభ అండాన్యాసము.
  • విత్తనము అంకురచ్ఛదయుతము.

ఆర్ధిక ప్రాముఖ్యత

[మార్చు]
  • కాఫియా విత్తనాల నుండి కాఫీ పొడి లభిస్తుంది.
  • సింకోనా బెరడులో క్వినైన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీనిని మలేరియా వైద్యంలో ఉపయోగిస్తారు.
  • ఇపికాక్ ఒక మందు మొక్క. దీని కొమ్ముల నుండి 'ఇపికాక్' మందు లభిస్తుంది. దీనిని దగ్గు, అతిసార వ్యాధుల వైద్యంలో ఉపయోగిస్తారు.
  • బండారు నుండి కలప లభిస్తుంది.
  • మొరిండ, రాండియా వేళ్ళ నుండి ఎరుపు అద్దకపు రంగు లభిస్తుంది.
  • అనేక మొక్కలను అందం కొరకు తోటలలో పెంచుతారు.

ముఖ్యమైన మొక్కలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • బి.ఆర్.సి. మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.
"https://te.wikipedia.org/w/index.php?title=రూబియేసి&oldid=4101046" నుండి వెలికితీశారు