పుష్పించే మొక్కలు
స్వరూపం
(పుష్పించే మొక్క నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పుష్పించే మొక్కలు Temporal range: Late Jurassic - Recent
| |
---|---|
Magnolia virginiana flower | |
Scientific classification | |
Kingdom: | |
Division: | మాగ్నోలియోఫైటా
|
Classes | |
సృష్టిలో జీవులన్నింటిలో సుందరమైనవి పుష్పించే మొక్కలు.
ప్రధాన లక్షణాలు
[మార్చు]- పుష్పించే మొక్కలు దాదాపుగా ఈ భూప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి.
- ఇవి గుల్మాలుగా గానీ, పొదలుగా గానీ, వృక్షాలుగా ఉండవచ్చు.
- ఇవి ప్రత్యుత్పత్తి కోసం పుష్పాలనుగాని లేదా పుష్పాలతో క్రియాసామ్యమైన శంకులనుగాని ఏర్పరుస్తాయి.
- వీటిలో భిన్నరూప ఏకాంతర జీవిత దశలు ఉంటాయి. సిద్ధబీజదం ప్రబలమైన దశ. సంయోగబీజదం క్షీణించి ఉంటుంది. అందువల్ల సంయోగబీజదం పోషణకోసం పూర్తిగా సిద్ధబీజదంపై ఆధారపడి ఉంటుంది.
- పిండాన్ని కలిగిన బహుకణ విత్తనం ఏర్పడుతుంది.
- ఇవి సంక్లిష్ట నాళికా కణజాలాలతో బాగా సంవిధానం చెందిన సిద్ధబీజదాన్ని కలిగి ఉండే నిజమైన మొక్కలు.
వర్గీకరణ
[మార్చు]పుష్పించే మొక్కలు ఉపరాజ్యంలో ఒకే ఒక విభాగం ఉంది. అది స్పెర్మటోఫైటా (Spermatophyta). ఇవి ఫలయుతమైన లేదా ఫలరహితమయిన బీజయుత మొక్కలు. వీటిని రెండు ఉపవిభాగాలుగా విభజించారు.
వివృతబీజాలు
[మార్చు]వివృతబీజాలు (Gymnospermae) అండాశయం, ఫలంలేని పుష్పించే మొక్కలు. వీటి విత్తనాలను కప్పుతూ ఫలకవచం ఉండకపోవడం వల్ల విత్తనాలు నగ్నంగా ఉంటాయి.
ఆవృతబీజాలు
[మార్చు]ఆవృతబీజాలు (Angiospermae) అండాశయాలను, ఫలాలను కలిగి ఉండే పుష్పంచే మొక్కలు. వీటి విత్తనాలను ఆవరించి ఫలకవచం ఉంటుంది. ఆవృతబీజాలు రెండు రకాలు. అవి: 1. ద్విదళబీజాలు: విత్తనంలో రెండు బీజదళాలు ఉండటం వీటి ప్రధాన లక్షణం. 2. ఏకదళబీజాలు: విత్తనంలో ఒకే బీజదళం ఉండటం వీటి ప్రధాన లక్షణం.
వైవిధ్యం
[మార్చు]The most diverse families of flowering plants, in order of number of species, are:
- ఆస్టరేసి లేదా కంపోజిటే (daisy కుటుంబం): 23,600 జాతులు[1]
- ఆర్కిడేసి (ఆర్కిడ్ కుటుంబం): 21,950 జాతులు[1]
- ఫాబేసి లేదా లెగూమినేసి (pea కుటుంబం): 19,400 జాతులు[1]
- రూబియేసి (madder కుటుంబం): 13,183 జాతులు[2]
- పోయేసి లేదా గ్రామినే (గడ్డి కుటుంబం): 10,035 జాతులు[1]
- లామియేసి or Labiatae (mint కుటుంబం): 7,173 జాతులు[1]
- యుఫోర్బియేసి (spurge కుటుంబం): 5,735 జాతులు[1]
- సైపరేసి (sedge కుటుంబం): 4,350 జాతులు[1]
- మాల్వేసి (mallow కుటుంబం): 4,225 జాతులు[1]
- అరేసి (aroid కుటుంబం): 4,025 జాతులు[1]