పోయేసి
Appearance
(గ్రామినే నుండి దారిమార్పు చెందింది)
పోయేసి | |
---|---|
Flowering head of Meadow Foxtail (Alopecurus pratensis), with stamens exserted at anthesis | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | పోయేసి |
ఉపకుటుంబాలు | |
There are 7 subfamilies: |
పోయేసి లేదా గ్రామినే (లాటిన్ Poaceae, Gramineae) పుష్పించే మొక్కలలో ఒక పెద్ద కుటుంబం. దీనిలో 620 ప్రజాతులు, 10,000 జాతులు ఉన్నాయి. ఇవి అన్ని ప్రాంతాలలోను, అన్ని రకాల నేలలలోను పెరుగుతాయి.
కుటుంబ లక్షణాలు
[మార్చు]ఆర్థిక ప్రాముఖ్యం
[మార్చు]- ధాన్యాలు మానవునికి కావలసిన ముఖ్య ఆహారపదార్ధాలు. వరి, గోధుమ, బార్లీ, ఓట్ లు ముఖ్యమైన ధాన్యాలు. వీటినుండి పిండిపదార్ధాలు లభిస్తాయి.
- చెరకు కాండము నుండి చక్కెర, బెల్లంను తయారుచేస్తారు.
- వెదురు కాండాలనుండి, స్టైపా, సామా మొదలైన మొక్కల పత్రాలనుండి లభించే గుజ్జుతో కాగితం, అట్టలను తయారుచేస్తారు.
- వెటివేరియా వేళ్ళు మంచి సువాసనతో ఉంటాయి.
- వెదురు కాండాలను ఇళ్ళు నిర్మించడానికి, బుట్టలు, తడికెలు మొదలగునవి తయారుచేయుటకు ఉపయోగిస్తారు.
- డెండ్రోకలామస్ కాండాలను కుర్చీలు, బల్లలు తయారీలో ఉపయోగిస్తారు.
- నిమ్మగడ్డి పత్రాల నుండి, వట్టివేరు వేళ్ళ నుండి పరిమళ తైలాలు లభిస్తాయి.
- అనేక రకాల గడ్డి జాతులు పశువులకు ముఖ్యమైన పశుగ్రాసము.
ముఖ్యమైన మొక్కలు
[మార్చు]- ఒరైజా (Oryza) : ఒరైజా సటైవా - (వరి)
- జియా (Zea) : జియా మేస్ - (మొక్కజొన్న)
- వటివేరియా - వట్టివేరు
- గడ్డి
- పోతువెదురు
బాంబూసాయిడే
[మార్చు]క్లోరిడాయిడే
[మార్చు]- ఇల్యూసిస్ కొరకానా - (రాగి)
పానికోయిడే
[మార్చు]- సింబోపోగాన్ - (నిమ్మగడ్డి)
- సక్కారమ్ :
- సోర్గమ్ వల్గేర్ - (జొన్న)
- సెటారియా ఇటాలికా - (కొఱ్ఱలు)
పోయిడే
[మార్చు]మూలాలు
[మార్చు]- బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.