మాల్వేసి
Appearance
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మల్వేసి | |
---|---|
Least Mallow, Malva parviflora | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | మాల్వేసి |
Subfamilies | |
Bombacoideae |
మాల్వేసి (Malvaceae) కుటుంబంలో సుమారు 82 ప్రజాతులు, 1500 జాతులు ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి.
కుటుంబ లక్షణాలు
[మార్చు]- ఈ మొక్కలు అధికంగా గుల్మాలు లేదా పొదలు. కొన్ని వృక్షాలు. శాకీయ భాగాలమీద నక్షత్రాకారపు కేశాలుంటాయి. కణజాలాల్లో జిగురు కుహరాలు ఉంటాయి.
- తల్లివేరు వ్యవస్థ.
- కాండం సాధారణంగా నిటారుగా ఉండే వాయుగతం. కొన్ని ప్రజాతుల్లో కాండం ఉద్వక్రంగా సాగిలబడి మృదువుగా గాని, దృఢంగా గాని ఉంటుంది. శాఖాయుతం, వర్తులాకారం.
- పత్రం ప్రకాండ సంబంధం, ఏకాంతర పత్రవిన్యాసం, పుచ్ఛసహితం, వృంతసహితం, పృష్ఠోదరం. సాధారణంగా సరళపత్రాలు (హైబిస్కస్) లేదా హస్తాకారంగా చీలి ఉంటాయి లేదా బహుదళ హస్తాకార సంయుక్త పత్రాలు. జాలాకార ఈనెల వ్యాపనం.
- పుష్పవిన్యాసం: ఏకాంతపుష్పం, గ్రీవస్థం (హైబిస్కస్) లేదా శిఖరస్థం (గాసిపియమ్) అరుదుగా సామాన్య అనిశ్చితం.
- పుష్పాలు: సాధారణంగా పెద్దవిగా ఆకర్షణీయంగా ఉంటాయి. వృంతసహితం, పుచ్ఛసహితం. లఘుపుచ్ఛాలు 3-10 వరకు ఉంది రక్షకపత్రవళి వెలుపల ఒక వలయంగా ఏర్పడతాయి. దీనిని పుటదళోపరిచక్రపుచ్ఛావళి (Epicalyx) అంటారు.
- రక్షకపత్రవళి - 5, సంయుక్తం, కవాటయుత పుష్పరచన.
- ఆకర్షణపత్రవళి - 5, అసంయుక్తం, మెలితిరిగిన పుష్పరచన. ఇవి కేసరదండాల కలయికవల్ల ఏర్పడ్డ నాళంతో పీఠభాగంలో సంయుక్తంగా ఉంటాయి.
- కేసరావళి అసంఖ్యాకం, మకుటాదళోపరిస్థితం, అనిశ్చితం, ఏకబంధకం (హైబిస్కస్), కేసరదండాలు సంయుక్తమై కీలం చుట్టూ కేసరనాళం ఏర్పడుతుంది.
ఆర్థిక ప్రాముఖ్యత
[మార్చు]- హైబిస్కస్ వంటి మొక్కలను అలంకరణ కోసం పెంచుతారు.
- వివిధ గాసిపియమ్, బొంబాక్స్ జాతులనుంచి లభించే పత్తి బట్టలు, పరుపులు తయారీలో ఉపయోగపడుతుంది. పత్తి విత్తనాల నుంచి లబించే నూనె వంటలకు సబ్బుల తయారీకి పనికి వస్తుంది. నూనె తీయగా మిగిలిన పిందిని పశువులకు ఆహారంగా వాడతారు.
- హైబిస్కస్ కన్నాబినస్ ఆకుకూరగా ఉపయోగపడుతుంది. దీని నుంచి గోగునార లభిస్తుంది.
- బెండకాయలు కూరగాయలుగా వాడతారు.
- అబూటిలాన్, సైడా వంటి కొన్ని మొక్కలు మందుల క్రింద ఉపయోగపడతాయి.
ముఖ్యమైన మొక్కలు
[మార్చు]- హైబిస్కస్ (Hibiscus) :
- గాసిపియమ్ (Gossypium) : పత్తి (గాసిపియమ్ హెర్బేసియమ్)
- బొంబాక్స్ (Bombax) : బూరుగ (బొంబాక్స్ సీబా)
- బెండ (అబిల్ మాస్కస్ ఎస్కులెంటస్)
- థెస్పీసియా (Thespesia) : గంగరావి (థెస్పీసియా పాపుల్నియా)
- అబూటిలాన్ (Abutilon) : తుత్తురు బెండ (అబుటిలాన్ ఇండికమ్)
- సైడా (Sida) : అతిబల, గాయపాకు (సైడా కార్డిపోలియా)
- బోబాబ్ (Adansonia or Baobab) : బ్రహ్మ మల్లిక
- సీబా : తెల్లబూరుగ
మూలాలు
[మార్చు]- బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.