అతిబల
అతిబల | |
---|---|
Sida rhombifolia (Family Malvaceae).jpg | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | S. rhombifolia
|
Binomial name | |
Sida rhombifolia |
అతిబల అన్ని రుతువులలో సంవత్సరం పొడవునా పెరుగుతూ ఉండే మొక్క లేక కొన్నిసార్లు వార్షిక మొక్క. ఇది మాల్వేసి (Malvaceae) కుటుంబానికి చెందినది. దీని మూలాలు కొత్త ప్రపంచ ఉష్ణమండలాలు, ఉపఉష్ణమండలాలు. ఈ మొక్క కాడలు నిలువుగా ఉండి, కొమ్మలు చాపి నట్లుగా ఉంటాయి. ఇది 50 నుంచి 120 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని కింది భాగం చేవతో ఉంటుంది. దీని ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుతో వజ్రం ఆకారాన్ని కలిగి కాడపై ఒకటి మార్చి ఒకటిగా అమరి ఉంటాయి. దీని ఆకులు 4 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. అతిబల ఆకుతొడిమ ఆకు పొడవు కంటే తక్కువ పొడవుతో ఆకు యొక్క మూడో భాగంలో ఉంటుంది. వీటి చివరల కింద పొట్టిగా కొంచెం నెరిసిన రోమాల వలె ఉంటుంది. ఆకు యొక్క అర్ధ శిఖరభాగం పళ్ల వలె లేక రంపపు పళ్ల వలె ఉండి మిగతా ఆకు భాగం మామూలుగా ఉంటుంది. ఆకు తొడిమలు వాటి ఆధార భాగం వద్ద చిన్న చిన్న సన్న ముండ్లు కలిగి ఉంటాయి.