బ్రహ్మ మల్లిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్రహ్మ మల్లిక
Baobab tree in Tanzania
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
A. digitata
Binomial name
Adansonia digitata

బ్రహ్మ మల్లిక అనునది ఎత్తుగా, లావుగా పెరిగె ఒక వృక్షం పేరు. ఆఫ్రికా ఖండంలో పెరిగే ఈ చెట్టు వృక్ష శాస్త్రీయ నామం : Adansonia digitata. దీనిని ఆంగ్లంలో baobab, dead-rat tree (from the appearance of the fruits), monkey-bread tree (the soft, dry fruit is edible), upside-down tree (the sparse branches resemble roots) and cream of tartar tree అని పిలుస్తారు.

పెరుగుదల

[మార్చు]

ఇవి చాలా పెద్ద వృక్షాలుగా పెరిగా సామాన్యంగా ఒంటరిగా కనిపిస్తాయి. చూచినవెంటనే గుర్తించేవిధంగా అనగా తిరగబడిన వృక్షం మాదిరిగా ఉంటాయి. ఇవి వేయి కన్నా ఎక్కువ సంవత్సరాలు జీవిస్తాయి.[1] దీని పుష్పాలు తెల్లని తెలుపు రంగులో పెద్దవిగా ఉండి వ్రేలాడుతుంటాయి. ఇవి మంచి సువాసన కలిగివుండి గబ్బిలాలు ద్వారా పరాగసంపర్గం జరుపుకుంటాయి. దీని పండ్లు తెల్లని గుజురు కలిగి ఎండి గట్టిపడి క్రిందపడి రొట్టె ముక్కలుగా కనిపిస్తాయి.[2] ఇది ఆఫ్రికాలో సాంప్రదాయపు ఆహార ప్రధానమైన మొక్క.[3] దీని జాతి నామం digitata వీని ఆకుల ఆకారం ఆధారంగా వచ్చినది. ప్రతి దానిలో ఐదు ఆకులు కలిసి చేతివేళ్లలాగా కనిపిస్తాయి.


పండు

[మార్చు]

ఆఫ్రికన్ బోబాబ్ పండు 6 నుండి 8 సెం.మీ పొడవుంటుంది. దీనిలో కాల్షియం, ఏంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి.[4] కొన్ని సందర్భాలలో ఇది సూపర్ ఫ్రూట్ గా పిలువబడుతుంది.[4] దీని ఆకులు కూడా తింటారు. పండును పాలు లేదా నీటిలో కలుపుకుని పానీయంగా త్రాగుతారు. దీని విత్తనాల నుండి వంట నూనె తయారుచేస్తారు.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Varmah, J. C.; Vaid, K. M. (1978). "Baobab - the historic African tree at Allahbad". Indian Forester. 104 (7): 461–464.
  2. National Research Council (January 25, 2008). "Baobab". Lost Crops of Africa: Volume III: Fruits. Lost Crops of Africa. Vol. 3. National Academies Press. ISBN 978-0-309-10596-5. Archived from the original on 2012-03-31. Retrieved July 15, 2008.
  3. National Research Council (October 27, 2006). "Baobab". Lost Crops of Africa: Volume II: Vegetables. Lost Crops of Africa. Vol. 2. National Academies Press. ISBN 978-0-309-10333-6. Retrieved July 15, 2008.
  4. 4.0 4.1 [http://www.independent.co.uk/news/world/africa/the-tree-of-life-and-its-super-fruit-869737.html Claire Soares 2008. The tree of life (and its super fruit), The Independent, Thursday, 17 July 2008

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.