ఫాబేసి
స్వరూపం
Legumes | |
---|---|
Kudzu | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | ఫాబేసి |
ఉపకుటుంబాలు | |
References | |
GRIN-CA 2002-09-01 |
ప్రపంచవ్యాప్తంగా ఫాబేసి కుటుంబంలో 452 ప్రజాతులు 7,200 జాతులు ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో పెరుగుతుంటాయి. దీనినే లెగూమినేసి కుటుంబం అని కూడా అంటారు.
కుటుంబ లక్షణాలు
[మార్చు]- వేరు బుడిపెలు ఉంటాయి.
- పత్రపుచ్ఛాలు ఉంటాయి. సంయుక్త పత్రాలు.
- పల్వైనస్ పత్రపీఠము.
- ద్విలింగ పుష్పాలు, పాక్షిక సౌష్టవ యుతము.
- పాపిలియొనేషియస్ ఆకర్షణ పత్రావళి.
- పది కేసరాలు, ఏకబంధకము లేదా ద్విబంధకము.
- అండకోశము ఏకఫలదళయుతము, ఏకబిలయుతము.
- ఉపాంత అండాన్యాసము.
- ఫలము ద్వివిధారకము లేదా పాడ్.
ఆర్ధిక ప్రాముఖ్యం
[మార్చు]- నత్రజని స్థాపనశక్తి అధికంగా ఉండడం వల్ల చాలా పంటలను పంటల మార్పిడికి ఉపయోగిస్తారు.
- కందులు, శనగలు మొదలైనవి మన ఆహారంలోని నవధాన్యాలు మాంసకృత్తులు అధికంగా ఉంటాయి.
- బఠానీ, చిక్కుడు ఫలాలు కూరగాయలుగా వాడతారు.
- వేరుశనగ, సోయా చిక్కుడు నుంచి నూనె తీసి ఆహారంగా వాడతారు.
- గురివింద విత్తనాలను కంసాలి తూకానికి వాడతారు.
ముఖ్యమైన మొక్కలు
[మార్చు]సిసాల్పినాయిడే
[మార్చు]- టామరిండస్ ఇండికా - చింత
- సరాక ఇండికా - అశోకవృక్షం
- సిసాల్పినియా (Caesalpinia) : గచ్చకాయ
- సెన్నా (Senna) : సెన్నా ఆరిక్యులేటా - తంగేడు
- కాసియా (Cassia) :
- బాహీనియా (Bauhinia) :
- డెలోనిక్స్ (Delonix) : డెలోనిక్స్ రీజియా - తురాయి
- హిమటాక్సిలమ్ (Haematoxylum) - హిమటాక్సిలమ్ కాంపిచియానమ్
మైమోసాయిడే
[మార్చు]- అకేసియా (Acacia) :
- అకేసియా అరాబికా - (నల్ల తుమ్మ)
- అకేసియా ల్యూకోఫ్లియా - (తెల్ల తుమ్మ)
- అకేసియా కెటాచ్యూ - (కాచు)
- అకేసియా కాన్సిన్నా - (శీకాయ)
- అకేసియా మెలనోజైలాన్ - ఆస్ట్రేలియా తుమ్మ
- అకేసియా ఫార్నెసియానా - (నాగ తుమ్మ)
- అకేషియా అరికులిఫోర్మిస్
- అడినాంథిరా (Adenanthera) : అడినాంథిరా పావోనియా - బండి గురివింద
- ఆల్బిజియా (Albizzia) :
- ఎంటిరోలోబియం (Enterolobium) : ఎంటిరోలోబియం సమాన్ - (నిద్ర గన్నేరు)
- నెప్ట్యూనియా (Neptunia) : నెప్ట్యూనియా ఒలరేషియా - నీరు తలుపు
- పితకలోబియం (Pithecolobium) : పితకలోబియం డల్సి - సీమ చింత
- ప్రోసోపిస్ (Prosopis) :
- ప్రోసోపిస్ జూలిఫెరా - సర్కారు తుమ్మ
- ప్రోసోపిస్ స్పైసిజెరా - శమి లేదా జమ్మి
- మైమోసా (Mimosa) : మైమోసా పుడికా - (అత్తిపత్తి లేదా లజ్జావతి)
- జైలియా (Xylia) : జైలియా జైలోకార్పా - కొండ తంగేడు
- ల్యూసినా (Leucaena) : ల్యూసినా గ్లాకా
ఫాబోయిడే
[మార్చు]- అరాచిస్ (Arachis) : అరాచిస్ హైపోజియా (వేరుశనగ)
- ఇండిగోఫెరా (Indigophora) : ఇండిగోఫెరా టింక్టోరియా (నీలిమందు మొక్క)
- ఏబ్రస్ (Abrus) : ఏబ్రస్ ప్రికటోరియస్ (గురివింద)
- కజానస్ (Cajanus) : కజానస్ కజాన్ (కందులు)
- క్రోటలేరియా (Crotalaria) : క్రోటలేరియా జన్షియా (జనుము), గిలిగిచ్చకాయ
- గ్లైసీన్ (Glycine) : గ్లైసీన్ మాక్స్ (సోయా చిక్కుడు)
- పైసమ్ (Pisum) : పైసమ్ సటైవమ్ (బఠానీ)
- మాక్రోటిలోమా (Macrotyloma) : మాక్రోటిలోమా యూనిఫ్లోరమ్ (ఉలవలు)
- విగ్నా (Vigna) :
- సైసర్ (Cicer) : సైసర్ అరైటినమ్ (శనగలు)
- బుటియా : (మోదుగ)
- సెస్బానియా (Sesbania) : సెస్బానియా గ్రాండిఫ్లోరా (అవిశ)
- (అతిమధురము)
- (దూలగొండి)
- టిరోకార్పస్ (Pterocarpus) :
- డాల్బెర్గియా (Dalbergia) :
మూలాలు
[మార్చు]- బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.