కసింద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కసింద
కసింద మొక్క
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
(unranked):
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Species:
S. occidentalis
Binomial name
Senna occidentalis
(L.) Link, 1829
Synonyms

Cassia caroliniana, C. ciliata Raf.
C. falcata L.
C. foetida Pers.
C. laevigata sensu auct. non Prain non Willd.
C. macradenia, C. obliquifolia, C. occidentalis, C. occidentalis L. var. arista sensu Hassk.
C. occidentalis L. var. aristata Collad.
C. planisiliqua
C. torosa Cav.
Ditrimexa occidentalis (L.) Britt.& Rose

కసింద లేదా కసివింద ఒక కాసియా ప్రజాతికి చెందిన మొక్క. తక్కువ కొమ్మలుగా ఉండే స్వల్పకాలిక శాశ్వత మొక్క 0.5-2 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది . కసింద కాండం ఎర్ర,ముదురు రంగులలో ఉండి , లేత ఆకుపచ్చ ఆకులతో ఉంటుంది. ఈ మొక్క బలమైన ప్రాధమిక మూలాన్ని కలిగి ఉంది. ఆకులు ఎర్రటి కాండాలపై లేత ఆకుపచ్చగా ఉంటాయి.ఆకులలో 2నుంచి 6 వరకు మనకు పువ్వులు కనిపించగలవు. పండు ముదురు గోధుమ రంగుసుమారుగా 75-130 మి .మీ పొడవు , 8-10 మి.మీ వెడల్పు లో ఉంటాయి. ఒక వరుసలో 25-35 విత్తనాలను కలిగి ఉంటాయి. విత్తనాలు ముదురు గోధుమ రంగు, , 5 మి.మీ పొడవు ,3 మి.మీ వెడల్పుతో ఉంటాయి [1] కసింద మొక్కలు మన దేశంలో రాజస్థాన్ లో ఎక్కువ ఉష్ణోగ్రత వాతావరణం లో వర్షంలు కురిసిన వెంటనే బంజరు భూములలో ఎక్కువగా పెరుగగలవు [2] అమెరికాలోని( తూర్పు, దక్షిణ) ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాలలో, ఆస్ట్రేలియా, తూర్పు ఆఫ్రికా దేశాలలో కనిపిస్తుంది .రోడ్డు పక్కన, వ్యర్థ , ప్రదేశాలు, పచ్చిక బయళ్ళు, గడ్డి భూములు, బహిరంగ అడవులలో, తీరప్రాంత పరిసరాలు ప్రాంతాలలో పెరిగే మొక్క. అమెరికా , ఆస్ట్రేలియా వంటి దేశాలలో పర్యావరణ చెట్లుగా పరిగణిస్తున్నారు [3] మన దేశములో దీని అస్సాం లో హాట్ తెంగా , కుసుమ్, జోంజోనిగోచ్, ఇంగ్లీష్ లో కాఫీసెన్నా, సెప్టిక్వీడ్, నీగ్రో కాఫీ, ఫెటిడ్ సెన్నా, హిందీలో కసోన్డి, మళయాళం లో పొన్నారివీరం, పొన్నియోంతకర, మత్తంతకర, పయవిరామ్, నాథ్రామ్‌తకర, పొన్నారి, కరింతకర, తమిళంలో పాయవరై అని కసింద ను పిలుస్తారు [4]

కసింద ఉపయోగం కసింద విత్తనములు, ఆకులు, బెరడు ( కాండములో వుండే) ఆయుర్వేదిక్ మందుల తయారీలో వాడుతున్నారు. మలేరియా, కాలేయ రుగ్మతలను నయం చేయడానికి, చెడు బాక్టీరియా ను నిర్ములించడానికి ,, రోగనిరోధక శక్తిని శరీరం లో పెంచడానికి , దగ్గు, మూర్ఛల వంటి మందుల లాంటివి చేయడానికి వాడుతున్నారు [5]

మూలాలు[మార్చు]

  1. "Senna occidentalis". www.cabi.org. 2020-08-12. Archived from the original on 2017-07-26. Retrieved 2020-08-12.
  2. "Plant Description". bioinfo.bisr.res.in. Retrieved 2020-08-13.
  3. "Factsheet - Senna occidentalis (Coffee Senna)". keys.lucidcentral.org. Retrieved 2020-08-13.
  4. "Senna occidentalis (L.)Link". India Biodiversity Portal. Retrieved 2020-10-27.
  5. "Cassia Occidentalis". www.indiamart.com. Retrieved 2020-08-13.
"https://te.wikipedia.org/w/index.php?title=కసింద&oldid=3877569" నుండి వెలికితీశారు