కాచు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాచు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Genus:
Species:
A. catechu
Binomial name
Acacia catechu
Range of Acacia catechu
Synonyms

కాచు తుమ్మ (లాటిన్ Acacia catechu) ప్రజాతికి చెందిన చెట్టు. కాచు తుమ్మ చెట్టు 1500 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఆకులు రాల్చే చెట్టు. మన దేశంలో పంజాబ్, బీహార్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ప్రాంతములలో ఎక్కువగా చెట్లు కనబడతాయి. తేమ, చల్లగా, పొడిగా ఉండే ప్రాంతాలలో తక్కువగా చెట్లు ఉంటాయి. ఎక్కవగా ఉష్ణ వాతావరణం 37.50 సెంటీగ్రేడ్ నుంచి 43.50 సెంటీగ్రేడ్ వున్నా తట్టుకునే చెట్టు[2] సంవత్సర వర్ష పాతం 500-2000 మి.మి, ఇసుక, కంకర, బంకమట్టి నేలలు. పేలవమైన నిస్సారమైన నేలల్లో పెరుగుతుంది. మట్టిపై లేదా పేలవంగా పారుతున్న నేలలపై కూడా తట్టుకునే చెట్టు. భారతదేశంలో మనకు మూడు రకములైన పేర్లతో ( కాటేచు, కాటేచుయోయిడ్స్, సుంద్రా పేర్కొంటారు . ఏ పేర్లతో పిలిచినా ఈ చెట్టు ప్రజలందరికి ఉపయోగకరం గా ఉన్నది . తుమ్మ చెట్టును గృహ, వాణిజ్య, భవన నిర్మాణ పనులకు (ప్లై ఉడ్, రంగుల పరిశ్రమలో ) ఇంధన తయారిలో వాడుతున్నారు . ఈ చెట్టు సమిధలను హిందువులు తమ యజ్ఞములలో వాడుతారు. శవ దహనానికి కూడా వీటిని వాడతారు [3]

ఉపయోగములు

[మార్చు]
  • అన్ని తుమ్మ మొక్కల భాగాలు ఔషధ, మేకలు, పశువులకు పశుగ్రాసం ఉపయోగిస్తారు.
  • పర్యావరణం పరిరక్షణలో తుమ్మ చెట్టు కాపాడ గలుగుతుంది.
  • విలువైన పోషక పదార్థములను కలిగి ఉంటుంది . ఇతర దేశములలో ఆహార పదార్థ తయారీలో వాడతారు.[4]

మూలాలు

[మార్చు]
  1. International Legume Database & Information Service (ILDIS)
  2. http://www.frienvis.nic.in/WriteReadData/UserFiles/file/pdfs/Khair.pdf
  3. Singh, K.; Lal, B. (2006). "Notes on Traditional Uses of Khair (Acacia catechu Willd.) by Inhabitants of Shivalik Range in Western Himalaya". Ethnobotanical Leaflets (in ఇంగ్లీష్).
  4. "NUTRITIONAL ASSESSMENT OF DIFFERENT PARTS OF ACACIA CATECHU WILLD. COLLECTED FROM CENTRAL INDIA | INTERNATIONAL JOURNAL OF PHARMACEUTICAL SCIENCES AND RESEARCH" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-27.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కాచు&oldid=3948235" నుండి వెలికితీశారు