తుమ్మ

వికీపీడియా నుండి
(అకేసియా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

తుమ్మ
Acacia greggii
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Acacieae
Genus:
అకేసియా

Philip Miller
జాతులు

About 1,300; see List of Acacia species

తుమ్మ ఒక రకమైన దట్టంగా ముళ్ళతో కూడిన చెట్టు. ఇవి ఫాబేసి (Fabaceae) కుటుంబంలోని అకేసియా (Acacia) ప్రజాతికి చెందినవి. ఇది ముళ్లతో ఉండే కొమ్మలు, నల్లని బెరడు, పసుపు రంగులో ఉండే పువ్వులు కలిగి యుంటాయి.

రకాలు

[మార్చు]

పెరిగే ప్రదేశాలు

[మార్చు]

ఇది ప్రాథమికంగా పాకిస్థాన్, లోని సింధ్ ప్రాంతానికి చెందినది. ఇది భారతదేశంలో ఎక్కడ చూసినా తుమ్మచెట్లు విరివిగా కనబడుతాయి. ఆఫ్రికా అంతటా ఇది పెరుగుతుంది. తుమ్మ చెట్టులోంచి మనకి దొరికేది ముఖ్యంగా జిగురు అనేవిషయం మనందరికీ తెలిసినదే.

ఉపయోగాలు

[మార్చు]
  • తుమ్మ చెట్టులో ముఖ్యంగా ఉపయోగపడేవి ఆకులు, బెరడు, జిగురు, వీటిలోనే ఔషధ గుణాలున్నాయి.
  • కొన్ని జాతుల మొక్కలు ఔషధాలుగా ఉపయోగపడతాయి.
  • తుమ్మ చెట్టు నుండి జిగురు లభిస్తుంది.
  • తుమ్మ ఆకులు జీలకర్ర, వాము కలిపి కాచిన కషాయం తాగితే డయేరియా తగ్గుతుంది.బెరడుతో చేసే కషాయం కూడా ఇలానే పనిచేస్తుంది.
  • రోజూ తుమ్మ బెరడును నములుతుంటే పంటి సమస్యలు తగ్గిపోతాయి. కదిలే పళ్ళు గట్టిపడతాయి. చిగుళ్ల వాపులు తగ్గుతాయి.
  • దంత సమస్యలను నివారిస్తుంది. కొద్దిగా బొగ్గుపొడి, తుమ్మబెరడు చూర్ణం, పటికపొడి, కొద్దిగా సైంధవ లవణం కలిపిన పౌడర్ తో రూజూ పళ్ళు తోముకుంటె ఎటువంటి దంత సమస్యలు దరిచేరవు.
  • తుమ్మ బెరడు కషాయంలో కొద్దిగా సైంధవ లవణం కలిపి పుక్కిలి పడితే వాచిన టాన్సిల్స్ నొప్పి వెంటనే తగ్గిపోతుంది.
  • బెరడు కషాయాన్న్ని "వెజైనల్ వాష్" (యోని ప్రక్షాళన) కు వాడితే లుకేరియా తగ్గుతుంది.
  • లేత తుమ్మకాయలు తింటే స్వప్న స్ఖలనాలు తగ్గుతాయి. అలాగే శీఘ్ర స్కలనం నివారించబడుతుంది.
  • ఎండిన తుమ్మ చెట్టు కంపలను కంచెగా పంటపొలాలను పశువులనుండి రక్షించడానికి వేస్తారు.

చిత్రమాలిక

[మార్చు]

సూచికలు

[మార్చు]

యితర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తుమ్మ&oldid=3966988" నుండి వెలికితీశారు