జిగురు
Jump to navigation
Jump to search

జిగురు (ఆంగ్ల భాష Gum) ఒక విధమైన అంటుకునే పదార్ధము. ఇది కొన్ని వృక్షాల నుండి తయారవుతుంది. ఇది కొన్ని దారుయుత వృక్షాల బెరడు క్రింద గాని లేదా విత్తనాల ఆవరించిగాని లభిస్తుంది. ఇవి సామాన్యంగా పాలిసాకరైడ్ ఆధారంగా అధిక అణుభారాన్ని కలిగివుండి నీటిలో కరిగే గుణాన్ని (hydrophilic) [1] లేదా కొల్లాయిడల్ లక్షణాల్ని కలిగివుంటాయి.
రకాలు[మార్చు]
- యూకలిప్టస్ జిగురు:
- తుమ్మ జిగురు:
- తప్సి జిగురు లేదా కోవెల జిగురు: ఇది స్టెర్కులియా యురెన్స్ అనే తప్సి చెట్టు కాండం నుండి లభిస్తుంది. ఈ జిగురు నీటిలో కరిగిపోకుండా ఉబ్బే స్వభావం కలిగివుంటుంది.
ఉపయోగాలు[మార్చు]
జిగురును మందులు, ఐస్ క్రీమ్ లు, చాక్లెట్లు, పెయింట్లు, సౌందర్య ఉపకరణాలు, టెక్స్ టైల్స్, కాగితపు పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.
మూలాలు[మార్చు]
- ↑ M.J.A. Schröder, 2003
ఈ వ్యాసం వృక్షశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |