Jump to content

వెంపలి

వికీపీడియా నుండి

వెంపలి
var. purpurea
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Tribe:
Genus:
Species:
T. purpurea
Binomial name
Tephrosia purpurea

వెంపలి (లాటిన్ Tephrosia purpurea) ఫాబేసి (చిక్కుడు) కుటుంబానికి చెందిన ఒక ఔషధ మొక్క. ఇది పోషకాలు తక్కువగా ఉన్న నేలల్లో కూడా పెరుగుతుంది, సాధారణంగా మెట్ట ప్రదేశాల్లో కనిపించే కలుపు మొక్క. ఇది ముఖ్యంగా ఉష్ణ మండల ప్రాంతాల్లో విస్తరించి ఉంటుంది. ఇది దక్షిణ–పశ్చిమ ఆసియా ప్రాంతాలకు (అరేబియా ద్వీపకల్పం, ఇరాన్, పాకిస్థాన్, భారతదేశం, శ్రీలంక) అలాగే ఆఫ్రికా ఖండంలో (ఈజిప్ట్, సూడాన్, ఈథియోపియా, సోమాలియా) దేశాలలో విస్తరించింది.[1][2] కొన్ని జంతువులకు ఇది విషపూరితంగా కూడా గుర్తించారు.

ఒక రకమైన వెంపలి కాయలకు మృదువైన నూగు ఉండడం వలన వీటిని నూగు వెంపలి గా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం: Tephrosia villosa.

లక్షణాలు

[మార్చు]
వెంపలి పుష్పాలు, ఆకులు, కాయలు
  • నిటారుగా పెరిగే గుల్మం లేదా చిన్న పొద.
  • గురు అగ్రంతో అగ్రకంటకితమై విపరీత అండాకారంలో ఉన్న పత్రకాలు గల విషమ పిచ్ఛక సంయుక్త పత్రం.
  • గ్రీవేతరంగా ఏర్పడిన అనిశ్చిత విన్యాసాలలో అమరివున్న లేత కెంపు రంగు పుష్పాలు.
  • తప్పడగా ఉన్న ద్వివిధారక ఫలాలు.

ఉపయోగాలు

[మార్చు]

ఈ వెంపలి మొక్కను నీలిమందు (ఇండిగో) వర్ణం తయారు చేయడానికి ఉపయోగిస్తారు.[3] 1800లలో నూబియా ప్రాంతంలో ఈ మొక్కను ఈ ప్రయోజనానికి సాధారణంగా సాగు చేసేవారని పేర్కొన్నారు.

ఈ మొక్కను ప్రజావైద్యంలో బాక్టీరియాను నివారించడానికి ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం, ఈ మొక్కకు కృమినాశక, విషహర, బలవర్ధక, జ్వరనాశక గుణాలు ఉన్నాయి. ఈ మొక్క యొక్క ఆకులు, వేరును ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లోని వైద్యులు కఫం, దగ్గు, చెవినొప్పి, గాయాలు, ఎముకల విరుగుడు వంటి సమస్యల చికిత్సలో ఉపయోగించారు.[4] వెంపలి ఆకులను పొడి చేసి ముక్కు దిబ్బడ ఉన్నప్పుడు పీల్చడం కోసం వాడతారు లేదా చెవిలో వేయడానికి నీటితో మరిగించి పోస్తారు. బెరడు చేసిన పొడి నీటిలో కలిపి పేలు ఉన్న ఒంటెల చెవుల్లో పోస్తారు. ఆకుల పొడి ముద్దగా తయారుచేసి గాయాలపై రాస్తారు. ఈ మొక్కను కుష్టు, పుండ్లు, ఉబ్బసం (ఆస్తమా), గడ్డలు, కాలేయం, ప్లీహ, గుండె, రక్త సంబంధిత వ్యాధులు వంటి సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు. వేర్లతో చేసిన కషాయాన్ని అజీర్ణం, విసర్జన సమస్యలు, సంధివాతం, ఆస్తమా, మూత్ర సంబంధ వ్యాధులు కోసం ఇస్తారు. వేరు పొడి పళ్లను తోమడానికి కూడా ఉపయోగిస్తారు; ఇది పళ్ల నొప్పిని త్వరగా తగ్గిస్తుందని, రక్తస్రావం ఆపుతుందని చెబుతారు. ఆఫ్రికాలోని పశువుల కాపరులు పాముకాటు పడిన జంతువులకు ఎక్కిన విషాన్ని తీయడానికి ఈ మొక్కను నూరి పానీయం తయారు చేయడానికి ఉపయోగిస్తారు.

గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Tephrosia apollinea". Flora of Pakistan, eFloras.org. Missouri Botanical Garden. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 April 2014.
  2. "Tephrosia apollinea". ILDIS LegumeWeb. International Legume Database & Information Service. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 April 2014.
  3. Lindley, John (1836). A Natural System of Botany: Or a Systematic View of the Organisation Natural Affinities and Geographical Distribution of the Whole Vegetal Kingdom ... (2nd ed.). Longman, Rees, Orme, Brown, Green, and Longmans. p. 153.
  4. Ghazanfar, Shahina A.; Al-Sabahi, Ahmed Mohammed Ali (1993). "Medicinal plants of northern and central Oman (Arabia)". Economic Botany. 47 (1). New York Botanical Garden Press on behalf of The Society for Economic Botany: 89–98. doi:10.1007/bf02862209. ISSN 1874-9364. JSTOR 4255485. S2CID 45450754.
"https://te.wikipedia.org/w/index.php?title=వెంపలి&oldid=4836146" నుండి వెలికితీశారు