కంసాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వెండి, బంగారము, మొదలైన లోహాలతో ఆభరణాలు చేయువాడు కంసాలి.

కంసాలిగా పిలిచే స్వర్ణకారుడు

కర్మశాలిలో నుండి వచ్చినది కంసాలి

కుల చరిత్ర[మార్చు]

వ్యుత్పత్తి

కంసాలీలు విరాట్ విశ్వకర్మ యొక్క సంతతి. విరాట్ విశ్వకర్మ యొక్క పంచ ముఖాల నుండి

సహజంగా పూర్వ కాలంలో వీరంతా, గ్రామంలో ఒక స్థలంలో ఈ ఐదు వృత్తులనూ చేస్తూ గ్రామానికి కావల్సిన వస్తువులను సమకూర్చేవారు. ఆ స్థలాన్నే విశ్వకర్మశాల అని ఆ రోజుల్లో వ్యవహరించేవాళ్ళు. క్రమేణా ఆ పేరు కాస్తా 'కర్మశాల'గా మారి, 'కమశాల'గా మారి, 'కంసాల' కులం పేరుగా, ఆ కులంలో పుట్టిన వారిని 'కంసాలి' గా పిలవడం జరుగింది.

అయోకారుడు[మార్చు]

అయో కారుడు ముడి ఇనుమును సంగ్రహించడం, ఇనుమును తయారు చెయ్యడం, ఆ ఇనుముతో వ్యవసాయానికి కావల్సిన కర్రు,పార,పలుగు,గునపం,గొడ్డలి,బండికట్టు మొదలైనవి, దేశానికి కావల్సిన వంతెనలు,పరిశ్రమలు,పడవలు,ఫిరంగులు...ఇనుప వస్తువు ప్రతిదీ చేసి ఇచ్చే మొట్ట మొదటి మెటల్ ఇంజనీర్ .ఆ రోజుల్లోనే వీరు చేసిన ఇనుములోని స్వచ్ఛత ఈ రోజుకీ నేటి విదేశీ ఇంజనీర్లు సైతం రాబట్టలేకున్నారు.ఉదాహరణకి ఢిల్లీ లోని విఠోబా స్థంబమే.తయారు చేసి వందల సంవత్సరాలు ఐనా, అది ఈ రోజుకీ తుప్పు పట్టలేదు.ఆ ఇనుము యొక్క స్వచ్ఛత ఈరోజుకీ ఎవ్వరూ సాధించలేదు.

ధారుకారుడు[మార్చు]

దారు కారుడు (వడ్రంగి)వ్యవసాయానికి కావల్సిన కాడి,మేడి,నాగలి,బండి..మొదలైనవీ, ప్రజలు బ్రతకడానికి కావల్సిన ఇల్లు,తలుపు ద్వారా బందం,పీట,మంచం..మానవ జీవిత చరిత్రలో అభివృద్ధికి మొట్ట మొదటి మెట్టైన 'చక్రం'...చక్కతో తయారయ్యే ప్రతిది...పిల్లలు ఆడుకున్నే బంగరం నుండి దేవుణ్ణి ఊరేగించే రథం వరకూ, ఊయల నుండి పడవల వరకు..తయారు చేసే మొట్ట మొదటి వుడ్ ఇంజనీర్ .

కాంస్యకారుడు[మార్చు]

కాంస్యకారుడు ప్రజలకు కావల్సిన ఇత్తడి,రాగి,కంచు పాత్రలు ఉగ్గు గిన్నెల దగ్గర్నుండి గంగాళాల వరకు ... ముడి ఇత్తడి సంగ్రహించడం దగ్గర్నించి, దానిని రాగిగా, కంచుగా మార్చి కరిగించి కావల్సిన ఆకారం లోకి పోత పోసే వరకు ఉద్ధరిణిల దగ్గరినుండి ఊరేగింపు వాహనాల వరకూ... ప్రతి పని చేసే మొట్ట మొదటి మెటల్ అల్లాయ్ ఇంజనీర్.

శిల్పకారుడు[మార్చు]

శిల్పకారుడు (శిల్పి) అంటే రాళ్ళను విగ్రహాలుగా చేసేవాడు అని కాదు.ఏదైనా తయారు చేసే వాడు (క్రియేటర్)అని అర్థం.దురదృష్టవశాత్తూ, శిల్పి అంటే శిల్పాలు చెక్కే వాడు అని అర్థం మారి పోయింది.శిల్పి గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈ నాడు మన భారతదేశంలో మనం చూస్తున్న విగ్రహాలు,అద్భుతమైన దేవాలయాలు,మహా మహా నిర్మాణాలు,వంతెనలు,శిలా శాసనాలు,అజంతా ఎల్లోరా గుహలు,కోటలు,మహల్ లు,చెరువులు,ఏకశిలా రథాలు,...... ఎన్ని చేశారో మహానుభావులు.వీరినే 'స్థపతులు' అని అంటారు.జంతర్ మంతర్,నలందా విశ్వ విద్యాలయం,తాజ్ మహల్,చార్మినార్,మహా బలిపురం,తిరుపతి,శబరిమల,ఎర్రకోట,గోమఠేశ్వర,మధుర మీనాక్షి..... శిలా నిర్ణయం దగ్గర నుండి విగ్రహాలు చెయ్యడం దగ్గర నుండి,స్థల పరీక్ష దగ్గర నుండి, వాస్తు పూజ దగ్గర నుండి, భవన లేదా దేవాలయ ప్లాన్ దగ్గర నుండి... గృహ ప్రవేశం లేదా దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపనాధికార పర్యంతం...వీరు చెయ్యలేని, వీరి చెయ్యి లేని పని లేదు. వీరు ప్రపంచ దేశాలలో భరత ఖండాన్ని సగర్వంగా తల ఎత్తుకునేలా చేసిన పుణ్య మూర్తులు.భారత దేశానికి పర్యాటకం మీద ఆదాయం రావడానికి మూలకారణం వీరి చలవే.వీరి కట్టాడాలలోని నైపుణ్యాన్ని,రహస్యాలను ఈనాటికీ మేటి విదేశీ సైంటిస్ట్ లు సైతం అందుకోలేక పోతున్నారు.ప్రపంచంలోనే మొట్టమొదటి అసలైన ఇంజనీర్లు.

స్వర్ణకారుడు[మార్చు]

స్వర్ణకారుడు అంటే ముడి బంగారాన్ని సేకరించి దాని నుండి అసలైన బంగారం గ్రహించి, దానికి రత్న మాణిక్యాలను కూర్చి,దాన్ని అనుభవ యోగ్యంగా,ఆభరణాలుగా మార్చగలిగిన వాడు.మరియు పురాతన దేవాలయాల్లో ఎటువంటి యంత్ర సహాయం లేకుండా చేసిన కిరీటం, నగలు,వస్తువులు అలనాటి విశ్వబ్రాహాన వృత్తి కి నిదర్శనం

ఇంటి పేర్లు[మార్చు]

ఓజు అను పదంతో అంతమయ్యే అవవై ఇంటిపేర్లను విశ్వ బ్రాహ్మణులు కలిగి ఉంటారు. ఉదాహరణకు, నామోజు, లక్కోజు, దాకోజు, కొమ్మోజు, బొల్లోజు, కన్నొజు, సంకోజు, మారోజు వంటివి. పూర్వం శిల్పులను ఓజులని సంబోధించేవారు. ఓజు అనగా గురువు (ఉపాధ్యాయుడు - ఒజ్జ - ఓజు) అని అర్థం. ఆ విధంగా వారి మామూలు నామానికి ఓజు తగిలించి వాడుకొనే వారు. కాల క్రమేణా అదే స్థిరమై ఇంటి పేరుగా మారిపొయ్యింది. భిన్న కులాలు ఒకే రకమైన ఇంటిపేర్లను కలిగి ఉండే అవకాశం ఉంది కానీ, ఈ విధంగా ఓజుతో అంతమయ్యే ఇంటిపేర్లు ఈ ఒక్క కులానికి మాత్రమే పరిమితమై ఉండటం గమనించవలసిన విషయం.

పంచార్షేయుల్లో ప్రసిద్దులు[మార్చు]

ఇటువంటి ఇంటి పేరు కలిగిన సాహితీకారుడు బొల్లోజు బసవలింగం.

బయటి లింకులు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కంసాలి&oldid=3062691" నుండి వెలికితీశారు