చర్చ:కంసాలి
కులవృత్తులను కాపాడండి
[మార్చు]కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న విశ్వబ్రాహ్మణ, కమ్మర, వడ్రంగుల ప్రాథమిక హక్కులను కాపాడాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ మనుమయ ఐక్యవేదిక రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేసింది. వడ్రంగులపై ఆటవీశాఖ అరాచకాలు నిలిపివేసి, మూసివేసిన సామిల్లులను తెరిపించి, లైసెన్సు విధానాన్ని రద్దు చేయాలని కోరింది. కేసు విచారణకు స్వీకరించిన కమిషన్ జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి డిసెంబరు 7లోపు సమగ్ర నివేదికను సమర్పించాలని చీఫ్ కంజర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌కు నోటీసులు జారీ చేశారు.సామిల్లుల నిర్వహణ కోసంగ్రామ పంచాయితీకి నిర్ణయించిన ఫీజులు గత 25 ఏళ్లుగా చెల్లిస్తున్నామన్నారు. అయినప్పటికీ కులవృత్తికి లైసెన్సు విధానం ప్రవేశపెట్టడం దారుణమన్నారు. ఎవరో టింబర్ డిపోలయాజమాన్యాలు లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నారని, తమపై కక్ష కట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి సామిల్లులను మూయించి తమ పొట్టకొట్టారని వాపోయారు. ఇది పరోక్షంగా కులవృత్తులను కాలరాయడమే అవుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్ల కమ్మరి, వడ్రంగుల వందల కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం ఉపాధిని కల్పించలేదని, స్వశక్తితో కులవృత్తులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్న తమపై జులుం చేయడం తగదన్నారు.(ఈనాడు27.11.2009)