Jump to content

లోహక్రియ

వికీపీడియా నుండి
వర్కుషాపులో లోహక్రియ చేస్తున్న వ్య్హక్తి

లోహక్రియ (Metalworking) అనేది విభిన్నమైన లోహాలతో పనిచేయడం. ఇది కొన్ని వస్తువులు తయారుచేయడానికి, అతికించి పెద్ద నిర్మాణాలు కట్టడానికి ఉపయోగిస్తారు. పెద్ద ఓడలు, వంతెనలు మొదలైనవి నిర్మించడం వీరు చేసే అతిక్లిష్టమైన పనులు. ఇందుకోసం భారీ పనిముట్లు అవసరం ఉంటుంది.

లోహక్రియ ఒక కళ, అలవాటు, పరిశ్రమ, వ్యాపారం. ఇది లోహసంగ్రహం, విజ్ఞానశాస్త్రం, కంసాలీపని మొదలైన విధాలుగా ప్రాచీనకాలం నుండి నేటివరకు బాగా విస్తరించింది. ఆదిమానవుని కాలంలోనే లోహాలను తన అవసరాలకనుగుణంగా మలిచి వ్యవసాయ పనిముట్లుగా, వేట ఆయుధాలుగా తయారుచేసి ఉపయోగించాడు. బంగారం వంటి ఖరీదైన లోహాలను ఆభరణాలుగా మలిచేవారిని కంసాలి (Goldsmith) అంటారు.

"https://te.wikipedia.org/w/index.php?title=లోహక్రియ&oldid=3277947" నుండి వెలికితీశారు