Jump to content

ఉలవలు

వికీపీడియా నుండి

ఉలవలు
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Species:
ఎమ్. యూనిఫ్లోరమ్
Binomial name
మాక్రోటిలోమా యూనిఫ్లోరమ్
(Lam.) Verdc.
ఉలవ చెట్టు

ఉలవలు (లాటిన్ Macrotyloma uniflorum) నవధాన్యాలలో ఒకటి.

ఉలవలు

[మార్చు]

ఉలవలు:- Dolichos Uniflorus, Dolichos Biflorus. Eng. Horse gram. సం. కుళుత్ధ, తామ్రబీజ, హిం. కుల్తీ. ఇవి తెలుపు ఎరుపు, నలుపు రంగులుగల మూడు జాతులుగ నుండును. ఉలవలు నవధాన్యాలలో ఒకటి. లక్షణాలు * దట్టంగా అమరిన మృదువైన కేశాలతో తిరుగుడు తీగ ద్వారా ఎగబాకే గుల్మము. * అండాకారం నుండి విషమకోణ చతుర్భుజాకార పత్రకాలు గల త్రిదళయుత హస్తాకార సంయుక్త పత్రాలు. * సమూహాలుగా గాని ఏకాంతంగా గాని అమరి ఉన్న పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చని పుష్పాలు. వీనిలో నలుపురంగు ఉలవలు ఎక్కువపనిజేయును. పై మూడు జాతులలో ఏజాతి ఉలవయొక్క కషాయము గాని లేక చూర్ణము గాని, వగరుగ, తీపిగ స్వాదుగనుండును. వేడిజేసి యార్చును; మిక్కిలి కాక జేయును, పైత్యము జేయును. వాతము, పీనస, శ్వాస, మూలవ్యాధి, మూత్రకృఛ్రము, ఊపిరిగొట్టునొప్పి, మలబద్ధము వీనిని హరించును; కఫమును లేక శ్లేష్మమును కరిగించును అనగా నీరుజేయును; స్త్రీలు బహిష్టు కావడములోని లోపములను (menstural disorders) పోగొట్టును; ప్రసవ స్త్రీల మైలరక్తమును వెడలించును. గురదాల లోని రాతిని కరిగించును;ఫఫడదశసడదస్స

ఆకలి కలిగించును

[మార్చు]

ఎక్కిళ్ళు, నేత్రరోగములు వీని నణచును; మూత్రము గావించును; ఋతురక్తమును జారీజేయును; నల్లదబ్బతో (Spleen) పుట్టెడు కంతులను హరించును; కడుపు నొప్పిని పోగొట్టును; ముల్లంగియాకు రసముతో నిచ్చిన మూత్రపుసంచిలోని (Bladder) రాయి పడిపోవును. ఉలవ కషాయముతో కాచినచారు (ఉలవచారు) పైనచెప్పిన రోగులకు పథ్యముగ నుండును. ఉలవ కట్టు :- Boilings of horse gram. వగరుగా, రుచిగా నుండును. వాతము, తూనివాతము, ప్రతూనివాతము, అనులోమవాతము, గుల్మము, ఉదరరోగము, మధుమేహము, మూత్రాశ్మరి, శ్లేష్మము, శూల, క్షయ, శ్వాస, కాస, గుదరోగము బోగొట్టును ఆయు్ర్వేదము : మూలము : డా. చిరుమామిళ్ల మురళీమనోహర్, ఎం.డి. ఆయుర్వేద ఉలవలతో కులత్థాద్వఘృతం, కులత్థాది ప్రలేపం, కులత్థయూషం వంటి ఆయుర్వేద ఔషధాలు తయారవుతాయి.

ప్రోటీన్ ఎక్కువ

[మార్చు]

ఉలవల్లో ప్రోటీన్ ఎక్కువ. పెరిగే పిల్లలకు మంచి టానిక్. ఉలవల్లో ఐరన్, మాలిబ్డినం వంటి ఖనిజ సంబంధ పదార్థాలూ ఎక్కువే. పొట్టు తొలగించటం, మొలకెత్తించటం, ఉడికించటం, వేయించటం వంటివి చేయడం ద్వారా ఉలవల్లోని పోషకతత్వాలు గణనీయంగా పెరుగుతాయి. * ఉలవలు ఆకలిని పెంచుతాయి. కఫాన్ని పల్చగా మార్చి వెలుపలకు తెస్తాయి. కళ్లు కన్నీరు కారటం, కళ్లలో పుసులు కట్టడం వంటి సమస్యల్లో వాడవచ్చు. * మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి వెలుపలకు రావడానికి ఉలవలు సహకరిస్తాయి. తరచూ ఎక్కిళ్లు వస్తుంటే ఉలవలు తగ్గిస్తాయి. * ఉలవలను తీసుకోవటంవల్ల మలనిర్హరణ సజావుగా, సాఫీగా జరుగుతుంది. ఉలవలను ఆహారంలో వాడేవారికి మూత్ర విసర్జన ధారాళంగా, నిరాటంకంగా జరుగుతుంది. మహిళల్లో బహిష్టురక్తం కష్టం లేకుండా విడుదలవుతుంది. ఉలవలు ప్లీహ వ్యాధులతో బాధపడేవారికి సైతం హితం చేస్తాయి. ఔషధోపయోగాలు స్థూలకాయం: ఉలవలను ఆహార రూపంలో తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. ముందుగా ఒక కప్పు ఉలవలకు నాలుగుకప్పులు నీళ్లు కలిపి కుక్కర్‌లో ఉడికించాలి. ఇలా తయారుచేసుకున్న ‘ఉలవకట్టు’ను ప్రతిరోజూ ఉదయంపూట ఖాళీ కడుపుతో, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. ఉలవలు తీసుకునే సమయంలో శరీరంలో మంటగా అనిపిస్తుంటే మజ్జిగ తాగితే సరిపోతుంది. బోదకాలు, కాళ్లవాపు: ఉలవల పిండినీ, పుట్టమన్నునూ ఒక్కోటి పిడికెడు చొప్పున తీసుకొని సమంగా కలపాలి. దీనికి కోడిగుడ్డు తెల్లసొనను కలిపి స్థానికంగా లేపనంచేస్తే హితకరంగా ఉంటుంది. లైంగిక స్తబ్ధత: ఉలవలను, కొత్త బియ్యాన్నీ సమంగా తీసుకొని జావ మాదిరిగా తయారుచేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాలపాటు క్రమంతప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతాయి. దీనిని వాడే సమయంలో మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. కాళ్లు, చేతుల్లో వాపులు, నొప్పి: ఉలవలను ఒక పిడికెడు తీసుకొని పెనంమీద వేయించి మందపాటి గుడ్డలో మూటకట్టి నొప్పిగా ఉన్న భాగంలో కాపడం పెట్టుకోవాలి. శరీరంలో వ్రణాలు (అల్సర్లు) తయారవటం: పావు కప్పు ఉలవలను, చిటికెడు పొంగించిన ఇంగువను, పావు టీస్పూన్ అల్లం ముద్దను, పాపు టీ స్పూన్ అతిమధురం వేరు చూర్ణాన్నీ తగినంత నీటిని కలిపి ఉడికించాలి. దీనికి తేనె కలిపి కనీసం నెలరోజులపాటు తీసుకుంటే బాహ్యంగా, అభ్యంతరంగా తయారైన వ్రణాలు (అల్సర్లు) త్వరితగతిన తగ్గుతాయి.

మూత్రంలో చురుకు, మంట నివారణ

[మార్చు]

ఒక కప్పు ఉలవచారుకి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రం జారీ అవుతుంది. మధుమేహం: మూత్రంలో చక్కెర కనిపిస్తున్నప్పుడు ఉలవల కషాయంలో వెంపరి (శరపుంఖ) చెట్టు చూర్ణాన్ని, సైంధవ లవణాన్ని కలిపి తీసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. సెగగడ్డలు: ఉలవ ఆకులను మెత్తగా నూరి, కొద్దిగా పసుపుపొడి కలిపి పై పూత మందుగా రాస్తే చర్మంమీద తయారైన సెగ గడ్డలు పగిలి, నొప్పి, అసౌకర్యం తగ్గుతాయి. విరేచనాలు: ఒక టీ స్పూన్ ఉలవ ఆకురసానికి అరటి పండు కలిపి రోజుకు 2-3 పర్యాయాలు తీసుకుంటే విరేచనాలు నియంత్రణలోకి వస్తాయి. చర్మంమీద తయారయ్యే వాపు, నొప్పి, దురదలు: మొలలమీద ఉలవల ముద్దను లేపనం చేస్తే నొప్పి, వాపు, దురదలు తగ్గుతాయి. ముఖ చర్మం కాంతి లేకుండా తయారవటం: ఉలవల పిండిని ఫేస్ ప్యాక్‌గా ప్రయోగిస్తే చెక్కిలి, బుగ్గలు కాంతితో మెరుస్తాయి. తెల్లబట్ట (వైట్ డిశ్చార్జ్) : ఉలవచెట్టు కట్టెతో తయారుచేసిన కషాయం తీసుకుంటే మహిళల్లో కనిపించే తెల్లబట్ట సమస్య తగ్గుతుంది. ప్రసవం పూర్తిగా జరగకపోతే : ప్రసవానంతరం గర్భాశయంలో మిగిలిపోయిన మైల సంబంధ రక్తం నిశే్సషంగా వెలుపలకు రావడానికి ఉలవలు సహకరిస్తాయి. ఆయుర్వేద గ్రంథాలు చెప్పిన చికిత్సలు జ్వరం: జ్వరంతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఉలవలతో కషాయం తయారుచేసుకొని పెసర కట్టుకు కలిపి తీసుకోవాలి. ఉలవల వల్ల చెమట పట్టి జ్వరం దిగుతుంది. పెసర కట్టు తేలికగా జీర్ణమై శక్తిని ఇస్తుంది. ఎక్కువగా చెమట పట్టడం (స్వేదాదిక్యత) : ఉలవలను కొద్దిగా వేయించి, పొడిచేసి చర్మంమీద రుద్దుకోవాలి. దీనిని నలుగు పిండిగా గాని లేదా స్నాన చూర్ణంగా గాని వాడుకోవచ్చు. దగ్గు, ఆయాసం: ఉలవల కషాయం తీసుకుంటే దగ్గు, ఉబ్బసంలో హితకరంగా ఉంటుంది.

గుండె జబ్బులు:

[మార్చు]

బార్లీగింజలతో అన్నం మాదిరిగా వండుకొని ఉలవ కషాయం కలిపి తీసుకుంటే గుండె జబ్బుల్లో హితకరంగా ఉంటుంది. మూత్ర పిండాల్లో రాళ్లు: ఉలవలతో ఘృతపాక విధానంలో ఘృతం తయారుచేసుకొని తీసుకోవాలి. దీనిని కులత్యాదిఘృతం అంటారు. ఉలవల ముద్దకు నాలుగురెట్లు నెయ్యిని, నెయ్యికి నాలుగురెట్లు నీళ్లనూ కలిపి, చిన్న మంట మీద నీరంతా ఆవిరయ్యేవరకూ మరిగించడాన్ని ఘృత పాక విధానం అంటారు. కడుపునొప్పి: ఉలవ కషాయాన్ని సక్రమమైన రీతిలో పులియబెట్టి, సైంధవ లవణం, మిరియాల పొడిని కలిపి తీసుకుంటే కడుపునొప్పిలో హితకరంగా ఉంటుంది. ఆహారం తీసుకున్న తరువాత కడుపునొప్పి వస్తుంటే (అన్నద్రవశూల) : ఉలవలు వేయించి, పొడిచేసి వెన్న లేని పాలతో తోడుపెట్టి చేసిన పెరుగుతో కలిపి తీసుకుంటే అన్నద్రవ శూలనుంచి ఉపశమనం లభిస్తుంది. నులిపురుగులు, అంత్రక్రిములు: పాలకు ఉలవ కషాయం చేర్చి తీసుకుంటే అంత్రక్రిములు నశిస్తాయి. దద్దుర్లు (శీతపిత్తం) (అర్టికేరియా) : ఉలవలు, ముల్లంగి దుంపల పొడి వంటివి ఆహారంలో తీసుకుంటే దద్దుర్లనుంచి ఉపశమనం లభిస్తుంది. ఆమవాతం (రుమటాయిడ్ ఆర్తరైటిస్) : ఉలవలతో సూప్ తయారుచేసుకొని తీసుకుంటే వాపులతో కూడిన కీళ్లనొప్పిలో హితకరంగా ఉంటుంది. గండమాల (సర్వైకల్ లింఫ్ ఎడినైటిస్) : తేమ లేని ఆహారానికి ఉలవల కషాయం చేర్చి తీసుకుంటే గండమాలలో హితకరంగా ఉంటుంది. నష్టార్తవం (బహిష్టు సక్రమంగా రాకపోవటం, బహిష్టు ఆగిపోవటం) (ఎమనోరియా) : ఉలవలు, చేపలు, పుల్లని మజ్జిగ, పుల్లని కషాయాలు, నువ్వులు, మినుములు, ద్రాక్షతో తయారైన వైన్ వంటివి తీసుకుంటే బహిష్టు రక్తం అడ్డులేకుండా సజావుగా స్రవిస్తుంది.

అర్శమొలలు:

[మార్చు]

ద్రవ రూప మలంతోపాటు అర్శమొలలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎండించిన ముల్లంగి దుంపల పొడిని, ఉలవ పొడినీ కలిపి తీసుకోవాలి. వెలగపండు, మారేడు పండ్లు, చెంగల్వకోష్టు వీటితో కషాయం తయారుచేసుకొని మేక మాంసంతో కలిపి తీసుకోవాలి. కఫంవల్ల ఎక్కిళ్లు, ఉబ్బసం వస్తుంటే: ఉలవ కషాయాన్ని, పంచకోలాల కషాయాన్ని నెయ్యికి చేర్చి ఘృత పాకం విధానంలో నెయ్యిని తయారుచేసుకొని తీసుకుంటే ఎక్కిళ్లు, ఉబ్బసం తగ్గుతాయి. శరీరంలో పెరుగుదలలు తయారవటం (గుల్మం) : ఉదర భాగంలో ట్యూమర్లు పెరుగుతున్నప్పుడు ఉలవలు, పెసర గింజలు, పిప్పళ్లు, శంఠి కొమ్ములు, ముల్లంగి, మారేడుపండ్లు, ఉలిమిరిపట్ట, చిరబిల్వ లేతాకులు, చిత్రమూలం వేరు, వాము... వీటిని నీళ్లకు కలిపి కషాయం తయారుచేసుకొని తీసుకోవాలి.

లక్షణాలు

[మార్చు]
  • దట్టంగా అమరిన మృదువైన కేశాలతో తిరుగుడు తీగ ద్వారా ఎగబాకే గుల్మము.
  • అండాకారం నుండి విషమకోణ చతుర్భుజాకార పత్రకాలు గల త్రిదళయుత హస్తాకార సంయుక్త పత్రాలు.
  • సమూహాలుగా గాని ఏకాంతంగా గాని అమరి ఉన్న పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చని పుష్పాలు.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఉలవలు&oldid=3688411" నుండి వెలికితీశారు