Jump to content

అలసంద

వికీపీడియా నుండి

Cow pea
Black-eyed peas
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
V. unguiculata
Binomial name
Vigna unguiculata
Synonyms

Vigna sinensis

అలసంద కాయలు

అలసందను అలసందులు, బొబ్బర్లు అని కూడా అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం Vigna unguiculata. నవ ధాన్యాలలో ఒక రకం అలసంద. ఇది ఫాబేసి కుటుంబానికి చెందినది. ముఖ్యంగా అలసందలు రెండు రకాలుగా అనగా ఒకటి తీగ మాదిరిగా అల్లుకోగా, రెండవది చెట్టు వలె పెరుగుతుంది.

పంటగా

[మార్చు]

ఇది సుమారు మూడు నెలల పంట. అలసంద తీగను మిశ్రమ పంటగా, అలసంద చెట్టును ప్రత్యేక పంటగా పండిస్తారు. అలసందలు తీయగా, లేదా తక్కువ తీయదనాన్ని కలిగి ఉంటాయి. కాయలు పచ్చిగా ఉన్నప్పుడు విత్తనాలు మెత్తగాను, ఎండినప్పుడు గట్టిగా ఉంటాయి. కాయలు గుత్తులు, గుత్తులుగా కాస్తాయి. కాయల నుంచి విత్తనాలు వేరు చేయడానికి కాయలను ఎండ బెట్టి కల్లంలో ట్రాక్టర్ చేత తొక్కించడం లేదా తుంట కర్రతో బాదడం చేస్తారు. బొబ్బర్లు ఒక రకము చిక్కుడు జాతి గింజలు . వీటిలో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. చౌకగా లబించే ప్రోటీన్ ఉన్న శాకాహారము. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి - రుచిగా ఉంటాయి. శాకాహారులకు ఇది మంచి ప్రోటీన్ ఉన్న ఆహారము. మాంసకృత్తుల లోపము రాకుండా కాపాడుతుంది. చేపనునేలో ఉన్నా గుడ్ఫతి ఆసిడ్స్ దీనిలో ఉన్నాయి. గుండె జబ్బు, మధుమేహము ఉన్నవారికి మంచిది. ఇనుము, మెగ్నీషియం, కాల్సియం, ఫాస్ఫరస్, లాంటి ఖనిజ లవణాలు ఉన్నాయి. థయామిన్, రైబోఫ్లెవిన్, నియాసిన్, లాంటి విటమిన్లు ఉన్నయి .

అలసంద తీగ

[మార్చు]

అలసంద తీగ కాయలు ఎర్రగా, చెట్టు అలసంద కంటే కొంచెము చిన్నవిగా ఉంటాయి. ఇది నేల మీద పాకుతూ, లేదా ప్రక్కనున్న ఇతర మిశ్రమ పంటలకు అల్లుకుని పెరుగుతుంది. వీటి కాయలు సుమారు జాణ పొడవు ఉంటాయి. ఒక్కొక్క కాయలో 10 నుంచి 20 గింజలుంటాయి. అలసంద తీగ పూర్వం బాగా పండించేవారు, నేడు చెట్టు మాదిరిగా పెరిగే అలసందను పండిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో అలసందలను బొబ్బర్లు అని కూడ అంటారు.

అలసంద గింజలు

అలసంద చెట్టు

[మార్చు]

చెట్టు అలసందను హైబ్రిడ్ అలసంద అని అంటారు. ఇది మూడు నాలుగు అడుగుల ఎత్తు పెరుగుతుంది. తీగ అలసంద కాయల కంటే వీటి కాయలు కొంచెం పెద్దవిగా, తెల్లగా, జాణ కంటే ఎక్కువ పొడవు ఉంటాయి. ఒక్కొక్క కాయలో 10 నుంచి 20 గింజలుంటాయి.

నాట్లు, కోతలు

[మార్చు]

అలసంద విత్తనాలు గోరు ద్వారా విత్తనానికి, విత్తనానికి మధ్య సుమారు అడుగు దూరంలో పడేలా వేస్తారు. అలసంద మెట్ట పైరు, వర్షం ద్వారా పండే పంటలలో రెండు కోతలుగా, నీటి తడులు ఇచ్చే సౌకర్యం ఉన్న పొలల్లో నాలుగు కోతలుగా కాయలు కోస్తారు.

ఉపయోగాలు

[మార్చు]
  • గుగ్గుళ్ళ తయారీకి, వడల తయారీకి, రసం తయారీకి ఉపయోగిస్తారు.
  • పచ్చి రొట్ట ఎరువు కోసం పండించే పంటలలో అలసంద ఒకటి.
  • అలసంద మిశ్రమ పంటలలో భాగంగా పశుగ్రాసం కొరకు పండిస్తారు.
  • మలబధ్ధకం సమస్యతో ఇబ్బంది పదుతున్నవాళ్ళు రోజూ అలసంద గుగ్గిళ్ళు తింటే సుఖ మల విసర్జనం ఔతుంది (ఆయుర్వేదం).

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అలసంద&oldid=3790358" నుండి వెలికితీశారు