యుఫోర్బియేసి
Appearance
Spurge family | |
---|---|
Candlenut tree (Aleurites moluccana) | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | యుఫోర్బియేసి |
ఉప కుటుంబాలు | |
For a detailed taxonomy to the genus level, see |
యుఫోర్బియేసి పుష్పించే మొక్కలలో ఒక కుటుంబము.
కుటుంబ లక్షణాలు
[మార్చు]- ఎక్కువగా గుల్మాలు లేదా పొదలు.
- శాఖీయ భాగాలలో లేటెక్స్ ఉంటుంది.
- పత్రాలు లఘు పత్రాలు లేదా హస్తాకార సంయుక్త పత్రాలు, ఏకాంతరము, పుచ్ఛయుతము.
- సయాథియం పుష్పవిన్యాసం.
- ఏకలింగ పుష్పము, అండకోశాధస్థితము.
- పరిపత్ర భాగాలు ఒకే వలయంలో అమరి ఉంటాయి.
- కేసరాలు ఒకటి నుండి అనేకము.
- త్రిఫలదళ, సంయుక్త ఊర్థ్వ అండాశయము.
- స్తంభ అండన్యాసము.
- రెగ్మా ఫలము.
- విత్తనములు అంకురచ్ఛద యుతము. విత్తనముల బీజ రంధ్రాల వద్ద 'కారంకుల్' ఉంటుంది.
ఆర్ధిక ప్రాముఖ్యత
[మార్చు]- ఆముదము గింజల నుండి నూనె లభిస్తుంది.
- హీవియా, మానిహాట్ ల లేటెక్స్ నుండి రబ్బరు లభిస్తుంది.
- కర్ర పెండలము వేరు దుంపలను ఆహారముగా వాడతారు.
- అకాలిఫ, పాయిన్, కోడియం మొదలగు మొక్కలను తోటలలో అందానికి పెంచుతారు.
ముఖ్యమైన మొక్కలు
[మార్చు]- యుఫోర్బియా (Euphorbia) : సన్న జెముడు
- రిసినస్ (Ricinus) : రిసినస్ కమ్యూనిస్ - ఆముదము
- అకాలిఫా (Acalypha) : అకాలిఫా ఇండికా - మురిపిండి
- హీవియా : హీవియా బ్రెసిలియెన్సిస్ - రబ్బరు చెట్టు
- జట్రోఫా (Jatropha) : అడవి ఆముదము, నేపాళము
- ట్రాజియా (Tragia) : దురదగుంట తీగ
మూలాలు
[మార్చు]- Charles C. Davis, Maribeth Latvis, Daniel L. Nickrent, Kenneth J. Wurdack, David A. Baum. 2007. Floral gigantism in Rafflesiaceae. Science Express, published online January 11, 2007 (online abstract here).
- International Euphorbia Society
- Data from GRIN Taxonomy
- Euphorbiaceae Archived 2007-01-03 at the Wayback Machine in L. Watson and M.J. Dallwitz (1992 onwards). The families of flowering plants: descriptions, illustrations, identification, information retrieval. Archived 2007-01-03 at the Wayback Machine http://delta-intkey.com Archived 2007-01-03 at the Wayback Machine