క్వినైన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్వినైన్ అణు నిర్మాణ రేఖా చిత్రం

క్వినైన్ సింకోనా కుటుంబానికి చెందిన చెట్ల బెరడు నుండి సంగ్రహించబడుతుంది.క్వినైన్ అనేది ఒక ఆల్కలాయిడ్. ఆల్కలాయిడ్ అనేవి ప్రాథమికంగా సహజసిద్ధంగా జీవులలో ఏర్పడే సేంద్రీయ నత్రజనికలిగిన రసాయన సమ్మేళన పదార్థాలు.ఇది మానవులపై ముఖ్యమైన,విభిన్నమైన శారీరక ప్రభావాలను కల్గిస్తాయి.ఇవి సాధారణంగా మొక్కలు, పుష్పించే కుటుంబాల కొన్ని మొక్కలలో ఆల్కలాయిడ్స్‌లో పుష్కలంగా ఉంటాయి. జంతు జాతులలో కూడా కొన్ని ఆల్కలాయిడ్స్ కనుగొనబడ్డాయి.ఆల్కలాయిడ్స్ ద్వారా మొక్కలను నాశనం చేసే కొన్ని రకాల కీటక సంహరిగా పనిచేసి మొక్కలను చేయకుండా కాపాడతాయి.క్వినైన్ ఔషధం సింకోనా చెట్టు యొక్క బెరడు ద్వారా ఎక్కువగా సంగ్రహించబడుతుంది , దీనిని ప్రధానంగా మలేరియా వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు. [1]క్వినైన్ ను మలేరియా జ్వరం వచ్చిన దానిని తగ్గించుటకు,నయం చేయుటకు ఉపయోగిస్తారు. ప్లాస్మోడియం ఫాల్సిపరమ్ వల్ల కలిగే సంక్లిష్టత లేని మలేరియా జ్వర చికిత్సకు ఉపయోగిస్తారు.అలాగే క్లోరోక్విన్-రెసిస్టెంట్ పి.వైవాక్స్ వల్ల కలిగే సంక్లిష్టత లేని మలేరియా చికిత్సకు అలాగే ప్లాస్మోడియల్ కారణం కానీ సంక్లిష్టమైన మలేరియా చికిత్సకు కూడా ఉపయోగిస్తారు. క్లోరోక్వీన్ చే నయం కానీ, ప్లాస్మోడియం ఫాల్సిపరమ్ వల్ల వచ్చే మలేరియా జ్వరం చికిత్సకు క్వినైన్ ఉపయోగిస్తారు.[2]

సింకోనా చెట్టు

[మార్చు]

క్వినైన్ దాదాపు 23 రకాల మొక్కలు, చాలా చెట్ల మొక్కల జాతి నుండి సంగ్రహింపబడుతుంది. ఈ చెట్లు [[దక్షిణ అమెరికా]లోని అండీస్‌కు చెందిన మడ్డర్ కుటుంబంలో కనిపిస్తాయి. ఈ చెట్ల బెరడులో క్వినైన్ ఉంటుంది. అలాగే సింకోనా చెట్టు బెరడులో కూడా లభిస్తుందిమొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మలేరియా చికిత్సకు సింకోనా చెట్టు బెరడు నుండి తీసిన క్వినైన్ మందు మాత్రలు ప్రభావవంతమైన ఔషధంగా పనిచేసాయి.[1]

క్వినైన్ జ్వరనివారిణిగా వాడుక నేపధ్యం

[మార్చు]

ఒక కథనం ప్రకారం, అధిక జ్వరంతో ఉన్నఒక ఇండియన్ ఆండియన్ అడవిలో తప్పిపోయాడు. దాహం తో, అతను అక్కడ కనిపించిన నీటి కొలన లోని నీటిని తాగాడు.ఆ నీరు చేదుగా ఉండటం గమనించాడు.చుట్టుపక్కల ఉన్న క్వినైన్ చెట్ల వల్ల నీరు కలుషితమైందని గ్రహించిన అతను, ఆనీరు విషంగా మారడం వల్ల చేదుగా మారిందని,ఆనీరు తాగడమ్ వల్ల తనకు హాని జరుగుదుందని భావించాడు. కాని ఆశ్చర్యకరంగా, అతని జ్వరం త్వరలోనే తగ్గిపోయింది. అతను తాను అనుకోకుండా కనుగొన్న విష యాన్ని తోటి గ్రామస్థులతో పంచుకున్నాడు, ఆ తర్వాత వారు జ్వరానికి చికిత్స చేయడానికి క్వినా-క్వినా బెరడు నుండి తీసిన సారాలను ఉపయోగించడం మొదలు పెట్టారు.మొరోక ఐరోపాలో ప్రచారంలో కథనం ప్రకారం, క్వినైన్ యొక్క ఆవిష్కరణ పెరూను సందర్శించిన చిన్చోన్‌ను యొక్క భార్య/వితంతువు వలన జరిగింది.పెరూలో ఉన్నప్పుడు, చిన్చోన్‌ కౌంటెస్ ఒక కొత్త రకపు జ్వరం బారిన పడింది, అది ఒక చెట్టు బెరడు ద్వారా నయమైంది. ఆ చెట్టు బెరడుతో స్పెయిన్కు తిరిగి వచ్చిన ఆమె 1638లో ఐరోపా కు క్వినైన్‌ను పరిచయం చేసింది.1742లో స్వీడిష్ వృక్షశాస్త్రజ్ఞుడు కరోల్ లిన్నెయస్ (1707-1778) ఆమె గౌరవార్థం చెట్టును "సింకోనా" అని పిలిచారు.అయితే ఈ కథనం పూర్తిగా అవాస్తవం.ఆధార రహితం.నిజానికి, కౌంటెస్‌కు మలేరియా సోకలేదు, స్పెయిన్ చేరుకోవడానికి ముందు కొలంబియా లో మరణించింది.[3]

క్వినైన్ సంశ్లెషణ/తయారీ

[మార్చు]
క్వినైన్ 3D చిత్రం

మలేరియా ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక వ్యాధి గా పరిణామం చెందిన పరిస్థితిలో. సింకోనా చెట్తు బెరడుకు ఉన్న మలేరియా జ్వరచికిత్స గుణం వలన ,బెరడు లోని క్వినైన్ ను వేరుచెసిన దాని చికిత్స ప్రభావం మరింత వేగవంతంగా వుండును.అందువలన దాని ఆవశ్యకత క్వినైన్ సంశ్లేషణపై పరిశోధనలకు పలువురిని ప్రేరేపించింది.1820లో ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త పియరీ-జోసెఫ్ పెల్లెటియర్ (1788-1842), జోసెఫ్-బీనైమ్ కావెంటౌ (1795-1877) సింకోనా బెరడు నుండి క్వినైన్‌ను వేరు చేశారు.1908లో, పి. రాబే ఈ రసాయనసమ్మేళనం క్వినైన్ యొక్క సరైన రసాయన నిర్మాణాన్ని సిద్ధాంతీకరించాడు.అయితే 1944లో అమెరికన్ రసాయన శాస్త్రవేత్త రాబర్ట్ బర్న్స్ వుడ్‌వార్డ్ (1917-1989; 1965 రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత), విలియం వాన్ ఎగ్గర్స్ డోరింగ్ ఈ రసాయనాన్ని విజయవంతంగా సంశ్లేషణ చేసే వరకు ఈ నిర్మాణం నిర్ధారించబడలేదు.[3]ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో సహజంగా ఉత్పత్తి చేయబడిన క్వినైన్‌లో ఎక్కువ భాగం ఇప్పుడు ఇండోనేషియాలో భాగమైన జావాలో ఉత్పత్తి ప్రారంభం అయ్యింది.మొదటి ప్రపంచ యుద్ధం (1914-1918) సమయంలో, జర్మనీ కి క్వినైన్ సరఫరానిలిపి వెయ్యబడింది.అందుకు వారు సింథటిక్ ప్రత్యామ్నాయం అటాబ్రైన్‌ను అభివృద్ధి చెసారు.1942 నాటికి యునైటెడ్ స్టేట్స్ రెండవ ప్రపంచ యుద్ధం (1939-1945)లోకి ప్రవేశించినప్పుడు, జావానీస్ తోటలను జపాన్ నియంత్రించింది.ఉత్తర ఆఫ్రికా, దక్షిణ పసిఫిక్ దీవులలో పోరాడుతున్న అమెరికన్ సైనికులు చాలా మంది మలేరియాతో మరణించారు.స్వాధీనం చేసుకున్న ఇటాలియన్ సైనికుల నుండి తీసుకున్న తెల్లటి మాత్రలు యునైటెడ్ స్టేట్స్కు కు తిరిగి పంపబడ్డాయి. అవి సంస్లేషణచెసిన యాంటీమలేరియల్ డ్రగ్ క్లోరోక్విన్ అని తేలింది. ఈ ఔషధాన్ని అటాబ్రైన్ లా అదే జర్మన్ ల్యాబ్ తయారు చేసింది. యునైటెడ్ స్టేట్స్ యుద్ధం ముగిసేలోపు తాను స్వతహాగా అనేక టన్నులను సంశ్లేషణ చేయగలిగింది.[3]

1820కి ముందు, సింకోనా చెట్టు బెరడును మొదట ఎండబెట్టి, మెత్తగా పొడిగా చేసి, ఆపై ఒక ద్రవంలో (సాధారణంగా వైన్) త్రాగడానికి ముందులా కలిపేవారు. 1820లో, క్వినైన్ బెరడు నుండి సంగ్రహించబడింది, పియరీ జోసెఫ్ పెల్లెటియర్, జోసెఫ్ కావెంటౌచే వేరుచేయబడింది, పేరు పెట్టారు. శుద్ధి చేయబడిన క్వినైన్ మలేరియాకు ప్రామాణిక చికిత్సగా బెరడు స్థానంలో చేరింది.[4] [5]

క్వినైన్ ఔషద లక్షణాలు

[మార్చు]

క్వినైన్ అనేది సింకోనా ఆల్కలాయిడ్, ఇది ఆరిల్ అమినో ఆల్కహాల్ ఔషధాల సమూహానికి చెందినది. ఇది చాలా ప్రాథమిక సమ్మేళనం, అందువలన, ఎల్లప్పుడూ లవణ రూపంలో లభిస్తుంది.[6]హైడ్రోక్లోరైడ్, డైహైడ్రోక్లోరైడ్, సల్ఫేట్, బైసల్ఫేట్, గ్లూకోనేట్ లవణాలతో సహా వివిధ సన్నాహాలు ఉన్నాయి.వీటిలో డైహైడ్రోక్లోరైడ్ ఎక్కువగా ఉపయో గించబడుతుంది.ఇంట్రా-ఎరిథ్రోసైటిక్ మలేరియా పరాన్నజీవులకు వ్యతిరేకంగా క్వినైన్ వేగవంతమైన స్కిజోంటిసైడల్ చర్యను కలిగి ఉంటుంది.ఇది ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరియాలకు కూడా గేమ్టోసైటోసైడల్, కానీ ప్లాస్మోడియం ఫాల్సిపరం కోసం కాదు. క్వినైన్ కూడా అనాల్జేసిక్, కానీ యాంటిపైరేటిక్ లక్షణాలను కలిగి ఉన్నది.[5]క్వినైన్ నోటి ద్వారా, పేరెంటరల్‌గా వేగంగా శోషించబడుతుంది, 1-3 గంటల్లో గరిష్ట సాంద్రతలను చేరుకుంటుంది[7]ఇది శరీర ద్రవాలు అంతటా పంపిణీ చేయబడుతుంది, ప్రధానంగా ఆల్ఫా-1 యాసిడ్ గ్లైకోప్రొటీన్‌కు అధిక ప్రోటీన్కు బంధితమై ఉంటుంది. ప్లాస్మాలోబంధన సామర్థ్యం గాఢత పై ఆధారపడి ఉంటుంది, అయితే ఆల్ఫా-1 యాసిడ్ గ్లైకోప్రొటీన్ స్థాయిలపై కూడా ఆధారపడి ఉంటుంది,[8]

క్వినైన్ భౌతిక ధర్మాలు

[మార్చు]

క్వినైన్ యొక్క భౌతిక ధర్మాల వివరాలు.[9]

వరుస సంఖ్య గుణం విలువ
1 రసాయన ఫార్ములా C20H24N2O2
2 అణుభారం 324.42 గ్రా/మోల్
3 ద్రవీభవన ఉష్ణోగ్రత 173-175°C
4 మరుగు ఉష్ణోగ్రత 462.75°C (అందాజుగా)
5 సాంద్రత 1.1294గ్రా/cm³
6 వక్రీభవన సూచిక 1.6250 (అంచనా లెక్క)
7 ఫ్లాష్‌పాయింట్ >110°C
8 ద్రావణీయత నీటిలో కరుగును
9 రంగు,స్థితి తెలుపు,ఘనరూపపు పొడి

క్వినైన్ తెల్లటి పొడి రూపంలో వుండును.వాసన లేదు.కాంతిచే ప్రభావితం అవుతుంది.దీనియొక్క PH=9.0(m0.5గ్రాములను ఒక లీటరులో నీటీలో కరగించినపుడు.

ఇతర రసాయనిక గుణాలు

[మార్చు]

పక్షుల వికర్షికంగా పనిచెస్తుంది.(ఇది వున్నప్రాంతంకు పక్షులు దూరంగ వెళ్ళును), యాంటీ మలేరియల్ ఏజెంట్, యాంటీవైరల్ ఏజెంట్, యాంటిట్యూమర్ ఏజెంట్ గా పనిచెస్తుంది.అలాగే డ్రగ్-కోటెడ్ కరోనరియాజెంట్, యాంటీ పరాసిటిక్ ఏజెంట్గా ఉపయోగపడును. మూర్ఛ చికిత్స, అస్థిపంజర కండరాల ఆకస్మిక సంకోచాలను నిరోధిస్తుంది, డ్రగ్-కోటెడ్ కరోనరీ స్టెంట్ సిస్టం గ పనిచెయును.[9]

క్వినైన్ యొక్క వినియోగం-ఔషధంగా

[మార్చు]
 • ప్లాస్మోడియం ఫాల్సిపరమ్ వల్ల కలిగే మలేరియా చికిత్సకు క్వినైన్ ఉపయోగించబడుతుంది. ప్లాస్మోడియం ఫాల్సిపరమ్ అనే పరాన్నజీవి శరీరంలోని ఎర్ర రక్త కణాలలోకి ప్రవేశించి మలేరియాకు కారణమవుతుంది. క్వినైన్ పరాన్నజీవిని చంపడం ద్వారా లేదా అది పెరగకుండా నిరోధించడం ద్వారా పనిచేస్తుంది. ఈ ఔషధాన్ని ఒంటిగా ఉపయోగించవచ్చు లేదా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మందులతో కలిపి మలేరియా చికిత్స కోసం ఇవ్వవచ్చు. [10]ఈ ఔషధాన్నిఒ డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో మాత్రమే సరైన మొతాదులో వాడాల్సి ఉంటుంది.
 • వైద్యుడు సూచించిన విధంగా ఈ మందులను (మరియు ఇతర మలేరియా మందులు) తీసుకోవడం కొనసాగించడం చాలా ముఖ్యం. సూచించిన దానికంటే ఎక్కువ లేదా తక్కువ ఈ ఔషధాన్ని తీసుకోరాదు. ఏ మోతాదులను దాటవేయరాదు. కొన్ని రోజుల తర్వాత లక్షణాలు కనిపించకుండా పోయినప్పటికీ, పూర్తి సూచించిన మొత్తం పూర్తయ్యే వరకు ఈ మందులను తీసుకోవడం కొనసాగించాలి. మోతాదులను దాటవేయడం లేదా మందులను చాలా ముందుగానే ఆపడం వల్ల ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స చేయడం మరింత కష్టతరం కావచ్చు,, ఇన్‌ఫెక్షన్ తిరిగి వచ్చేలా చేస్తుంది. [11]
 • క్వినైన్ యాంటీమలేరియల్స్ అని పిలువబడే ఔషధాల తరగతికి చెందినది. ఇది మలేరియా నివారణకు ఉపయోగించబడదు.కేవలం మలేరియా వచ్చిన వారికి చికిత్సకు మాత్రమే ఉపయోగపడును.
 • క్వినైన్ ఒక తేలికపాటి యాంటిపైరేటిక్, అనాల్జేసిక్ మందు కూడా. అందుచే సాధారణ జలుబు తయారీలో క్వినైన్ కొంత మేర ఉపయోగించబడుతుంది. ఇది సాధారణంగా, చేదు, సువాసన ఏజెంట్‌గా ఉపయోగించబడుతుందికూడా, బేబిసియోసిస్ చికిత్సకు ఇప్పటికీ ఉపయోగపడుతుంది. [12]

క్వినైన్ ఔషధాన్ని వాడటం వలన కలిగే దుష్ప్రభావాలు

[మార్చు]

దాని అవసరమైన ప్రభావాలతో పాటు,ఈ ఔషధం కొన్ని అవాంఛిత ప్రభావాలను కలిగిస్తుంది. ఈ దుష్ప్రభావాలన్నీ సంభవించకపోయినా, అవి సంభవించినట్లయితే వారికి వైద్య సహాయం అవసరం కావచ్చు. ఎక్కువ దుష్ప్రభావాలు మందు వాడకం వల్ల వచ్చిన వెంటనే సదరు.సంబంధిత వైద్యున్ని వెంటనే కలసి,ఆయన సలహలు పాటించాలి.

సాధారణంగా కనిపించె లక్షణాలు [10]

 • మసక దృష్టి
 • రంగు దృష్టిలో మార్పు
 • ప్రవర్తనలో మార్పులు
 • గందరగోళం
 • అతిసారం
 • వినికిడి లోపం
 • వికారం
 • చెవుల్లో మోగుతున్నట్లు వుండటం
 • కడుపు తిమ్మిరి లేదా నొప్పిగా వుండాటం
 • వాంతులు అవడం

రాత్రిపూట కాలు తిమ్మిరి చికిత్సకు లేదా నిరోధించడానికి క్వినైన్ ఉపయోగించరాదు. క్వినైన్ వాడటం వలన అంతగా ప్రయోజనం చూపబడలేదు.అంతేకాక తీవ్రమైన రక్తస్రావం సమస్యలు, మూత్రపిండాలు దెబ్బతినడం, సక్రమంగా లేని హృదయ స్పందన, తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యలతో సహా తీవ్రమైన లేదా ప్రాణాంతక దుష్ప్రభావాలకు కారణం కావచ్చు. [13] ఔషధంగా, క్వినైన్ కొందరిలో మరింత తీవ్రమైన దుష్ప్రభావాలను కల్గించె అవకాశం వున్నది. క్వినైన్‌ను ఔషధంగా తీసుకోవడం వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాలు ఇక్కడ ఇవ్వడమైఅంది. [14]

 • అసాధారణ హృదయ స్పందన
 • మూత్రపిండాల నష్టం
 • తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య
 • ఎలక్ట్రోలైట్ అసమతుల్యత
 • దృష్టి లేదా కంటి సమస్యలు
 • రక్తస్రావంతో సమస్యలుఏర్పడంటం
 • థ్రోంబోసైటోపెనియా - రక్త ఫలకికలు తగ్గడం
 • ఊపిరితిత్తుల విషపూరితం కావడం

వంటివి కొందరిలో జరుగ వచ్చును.అందుచె ఈ మందును వైద్యుల సలహా లేకుండా వాడరాదు.

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 "quinine". vedantu.com. Retrieved 2024-03-02.
 2. "use of quinine". drugs.com. Retrieved 2024-03-02.
 3. 3.0 3.1 3.2 "Quinine". discoveriesinmedicine.com. Retrieved 2024-03-02.
 4. Dobson SMaM. In: Antimalarial Chemotherapy: Mechanisms of Action, Resistance, and New Directions in Drug Discovery. PJ R, editor. Totowa, New Jersey: Humana Press; 2001. The history of antimalarial drugs; pp. 15–25.
 5. 5.0 5.1 "Quinine, an old anti-malarial drug in a modern world: role in the treatment of malaria". ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-02.
 6. Yakoub AdenAbdi OE, Gustafsson Lars L, Ericsson Orjan, Urban Hellgren. Handbook of Drugs for Tropical Parasitic Infections. 2 1995
 7. Salako LA, Sowunmi A. Disposition of quinine in plasma, red blood cells and saliva after oral and intravenous administration to healthy adult Africans. Eur J Clin Pharmacol. 1992;42(2):171–174. doi: 10.1007/BF00278479.
 8. "Differences in the binding of quinine and quinidine to plasma proteins". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-02.
 9. 9.0 9.1 "quinine". chemicalbook.com. Retrieved 2024-03-02.
 10. 10.0 10.1 "Quinine (Oral Route)". .mayoclinic.org. Retrieved 2024-03-02.
 11. "Quinine Sulfate". webmd.com. Retrieved 2024-03-02.
 12. "quinine". go.drugbank.com. Retrieved 2024-03-02.
 13. "quinine". medlineplus.gov. Retrieved 2024-03-02.
 14. "What to know about quinine in tonic wate". medicalnewstoday.co. Retrieved 2024-03-02.
"https://te.wikipedia.org/w/index.php?title=క్వినైన్&oldid=4230316" నుండి వెలికితీశారు