అట్రోపిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అట్రోపిన్ D, L ఐసోమర్లు
అట్రోపిన్ సంగ్రహణ ప్రక్రియ

అట్రోపిన్ అనేది (S)-, (R) -అట్రోపిన్ యొక్క ఈక్విమోలార్ సాంద్రతలతో కూడిన రేస్‌మేట్(racemate).రేస్మేట్ అనగా ఒకే సమ్మేళనం యొక్క సమాన మొత్తంలో డెక్స్‌ట్రోరోటేటరీ, లెవోరోటేటరీ రూపాలతో కూడిన, దృవణ క్రియాశీలంగా లేని సమ్మేళనం లేదా మిశ్రమానికి సంబంధించినది, లేదా ఏర్పరుచునది.అట్రోపిన్ ఒక ఆల్కలాయిడ్.[1] ఇది ప్రాణాంతకమైన నైట్షేడ్ (అట్రోపా బెల్లడోన్నా) మొక్కల నుండి ]మరియు సోలనేసి కుటుంబానికి చెందిన ఇతర మొక్కల నుండి లభిస్తుంది.ఇది మస్కారినిక్ విరోధి, అనస్థీషియా సహాయక మందు,యాంటీ అరిథ్మియా డ్రగ్, మైడ్రియాటిక్ ఏజెంట్, పారా సింపథో లిటిక్, బ్రోంకోడైలేటర్ ఏజెంట్, ప్లాంట్ మెటాబోలైట్, సారిన్ పాయిజనింగ్‌కు విరుగుడుగా, వన్ఇరోజెన్‌గా పాత్రను కలిగి ఉంది.ఇది ఒక (S)-అట్రోపిన్, a (R)-అట్రోపిన్‌ను కలిగి ఉంటుంది. [2]అట్రోపిన్ ఒక యాంటికోలినెర్జిక్, కోలినెర్జిక్ మస్కారినిక్ విరోధి.అట్రోపిన్ చర్య యొక్క విధానం కోలినెర్జిక్ విరోధి, కోలినెర్జిక్ మస్కారినిక్ విరోధి.[3]అట్రోపిన్ సాపేక్షంగా చవకైన ఔషధం, ప్రపంచ ఆరోగ్య సంస్థ చే అవసరమైన ఔషధాల జాబితాలో అట్రోపిన్ చేర్చబడింది.[4]

అట్రోపిన్ కలిగివున్న మొక్కలు

[మార్చు]

అట్రోపిన్ అట్రోపా బెల్లడోన్నా అనే ప్రాణాంతక నైట్‌షేడ్ మొక్కలో వున్నఒక ఆల్కలాయిడ్.[5]అట్రోపిన్ అనేది అట్రోపా బెల్లడోన్నా, దతురా ఇనోక్సియా(Datura inoxia), దతురా మెటెల్(Datura metel, డాతురా స్ట్రామోనియం(Datura stramonium), బ్రుగ్‌మాన్సియా ఎస్‌పిపి(Brugmansia spp తో సహా సొలనేసిలోని అనేక మొక్కలలో సంగ్రహించబడిన సహజంగా లభించే ట్రోపేన్ ఆల్కలాయిడ్., హైయోసైమస్spp.[6]

అట్రోపా బెల్లడోన్నా మొక్క

[మార్చు]
అట్రోపా బెల్లడోన్నా మొక్క లిఖిత చిత్రం
అట్రోపా బెల్లడోన్నా మొక్క పండ్లు

అట్రోపా బెల్లడోన్నా సోలనేసి కుటుంబం క్రింద వర్గీకరించబడింది, సాగు చేయని బంజరు భూములలో పెరుగుతుంది.ఇది మధ్యధరా దేశాలలో (గ్రీస్‌తో సహా), పశ్చిమ ఐరోపాలోని దేశాల్లో, ఈ ప్రాంతాల నుండి హిమాలయాల వరకు ఉంది, ఇది ఉత్తర అమెరికాలో కూడా వ్యాప్తి చెందినది((Lee, 2007).మొక్క యొక్క పేరు గ్రీకు పదం "అట్రోపోస్" నుండి వచ్చింది, గ్రీకు పురాణాలలోని మూడు విధులను/అదృష్టాల లో ఒకదానిని సూచిస్తుంది, ఇది జీవితం యొక్కచరమాన్ని సూచిస్తుంది. "బెల్లా-డోనా" అనే ఇటాలియన్ పదబంధానికి అర్థం "అందమైన మహిళ".వెనిస్ మహిళలు అట్రోపా బెల్లడోనాను సౌందర్య సాధనంగా ఉపయోగించారు కాబట్టి ఈ పేరు మొక్కకు ఇవ్వబడింది (దీనిని ఉపయోగించడం వల్ల కలిగే మైడ్రియాసిస్ కారణంగా).[5]ఈ మొక్కను "ప్రాణాంతకమైన ఉమ్మెత్త "(deadly nightshade)అని కూడా అంటారు.అట్రోపా బెల్లడోన్నా అనేది శుష్క భూములు, క్వారీలలో పెరిగే శాశ్వత పొదలతో కూడిన మూలిక, ఇది 1.5 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది, ఆకుపచ్చని ఊదా రంగు పువ్వులు, అండాకార ఆకులు, ఊదా-నలుపు గోళాకార తీపి పండ్లను కలిగి ఉంటుంది.[7]మొక్క యొక్క అన్ని భాగాలలో ఆల్కలాయిడ్స్ అట్రోపిన్, హైయోసిన్, స్కోపోలమైన్ లను కలిగిన ఇది విషపూరితమైనది.[8]ఆల్కలాయిడ్స్ యొక్క అత్యధిక సాంద్రత(శాతం) పరిపక్వ పండ్లు, ఆకుపచ్చ ఆకులలో కనిపిస్తుంది.పరిపక్వ పండ్లలో అట్రోపిన్ ప్రధాన ఆల్కలాయిడ్ (98%). బెర్రీల ఆకారం, పరిమాణాన్ని కలిగి ఉన్న మొక్క యొక్క పండ్లలో 2 mg అట్రోపిన్ ఉంటుందని అంచనా వేయబడింది.

మొక్క నుండి అట్రోపిన్ మొదటి సారిగా వేరుచేసిన చరిత్ర వివరాలు

[మార్చు]

సోలనేసి మొక్కల నుండి టోపేన్ అల్కలాయిడు లను ను వేరుచేయడం, నిర్మాణాత్మకంగా వివరించడం అట్రోపిన్ యొక్క ఆవిష్కరణతో ప్రారంభమైంది.1832లో, ఈ ఆల్కలాయిడ్‌ను జర్మన్ ఫార్మసిస్ట్ H. F. G. మెయిన్ వేరు చేశారు, అయినప్పటికీ, అతను తన ఫలితాలను ప్రచురించలేదు.[9]ఒక సంవత్సరం తరువాత, P. L. గీగర్, O. హెస్సే (1833) అట్రోపా బెల్లడోన్నా, హ్యోస్కియమస్ నైగర్ నుండి నైట్రోజన్ కలిగిన ఆల్కలీన్ పదార్ధం కలిగిన అట్రోపిన్ యొక్క సంగ్రహణ/సంశ్లేషణ ప్రచురించారు.వారు ఔషధ వినియోగం, వివిధ వేరుచేసే పద్ధతులు, రసాయన లక్షణాలకు సంబంధించి ప్రారంభ పరిశోధనలను వివరించారు.[10][11]అట్రోపిన్, హైయోసైమైన్ మధ్య స్టీరియోకెమికల్ సంబంధాన్ని దాదాపు యాభై సంవత్సరాల తర్వాత K. క్రౌట్, W. లాస్సెన్ విశదీకరించారు.[12][13][10]వారు హైయోసైమైన్ యొక్క ఆల్కలీన్ హైడ్రోలైజేషన్ యొక్క ప్రతిచర్య యంత్రాంగాన్ని విశదీకరించ గలిగారు. అలాగే హైయోసైమైన్, అట్రోపిన్ రెండింటి యొక్క విభిన్న ఉత్పత్తులు ట్రోపిక్ ఆమ్లం, ట్రోపిన్ అని గుర్తించారు.దీని ఆధారంగా అట్రోపిన్ హైయోసైమైన్ యొక్క రేస్‌మేట్ అని నిర్ధారించబడింది.[13]

ఈ పదార్థాన్ని మొదటిసారిగా 1901లో జర్మన్ రసాయన శాస్త్రవేత్త రిచర్డ్ విల్‌స్టాటర్ సంశ్లేషణ చేశారు.[14]బెజోల్డ్, బ్లోబామ్ (1867) అట్రోపిన్ వాగల్ స్టిమ్యులేషన్ యొక్క కార్డియాక్ ప్రభావాలను నిరోధించడాన్ని, హైడెన్‌హైన్ (1872) కార్డా టిమ్పానీ యొక్క ఉద్దీపన ద్వారా ఉత్పత్తి చేయబడిన లాలాజల స్రావాన్ని నిరోధించడాన్ని కనుగొన్నారు.[15]బెల్లడోనా ఆల్కలాయిడ్స్ యొక్క అనేక సెమీసింథటిక్ కంజెనర్‌లు, పెద్ద సంఖ్యలో సింథటిక్ మస్కారినిక్ రిసెప్టర్ యాంటీగోనిస్ట్‌లు తయారు చేయబడ్డాయి, ప్రధానంగా నోటి పొడిబారడం లేదా కంటిపాపకు సంబంధించిన వ్యాకోచం లేకుండా GI మార్చడం లేదా మూత్రాశయ కార్యకలాపాలను మార్చడం లక్ష్యంగా మందులు తయారు చేయబడినవి.[15]

మొక్కల నుండి అట్రోపిన్ ను ఉత్పత్తి చేయుట

[మార్చు]

అట్రోపా బెల్లడోనా వేర్లలోని అట్రోపిన్ ప్రధాన ఆల్కలాయిడ్. ప్రాథమిక సజల క్షార ద్రావణాలను ఉపయోగించి లేదా ఆమ్లీకృత ద్రావణాలను ఉపయోగించి లవణాలుగా తీయబడుతుంది. పొందిన సజల పదార్ధాలు అనేక అవాంఛనీయ సహ-సంగ్రహించిన జాతులను కలిగి ఉంటాయి, ఆల్కలాయిడ్స్ యొక్క కంటెంట్ తక్కువగా ఉంటుంది.సంగ్రహించిన పదార్థాల లోని మాలినాలను తొలగించుటకు పలు సార్లు సాల్వెంట్/ద్రావకం/ద్రావణి లను ఉపయోగించ వలసి వుంటుంది.ప్రాథమిక క్షార ద్రావకంనుండిసరైన సేంద్రీయ ద్రావకంతోఆల్కలాయిడ్లు సంగ్రహించబడతాయి.అప్పుడు, సేంద్రీయ ద్రావణాలనుండి ఆమ్ల ద్రావణాల ద్వారా అల్కలాయిడ్స్, ఆల్కలాయిడ్లు లవణాలుగా ద్రావణాలలో నుండి పొందబడతాయి.[16]

మరొక విధానంలో అల్ట్రాసోనిక్ బాత్ (BCE-UB) పద్ధతితో ఆధునీ కరించిన బబుల్ కాలమ్ సంగ్రహణ ఉపయోగించి అట్రోపా బెల్లడోన్నా యొక్క కాండం, ఆకుల నుండి అట్రోపిన్‌ను సంగ్రహించ వచ్చు.క్లోరోఫామ్-మిథనాల్-అమోనియా 15:15:1(v/v/v)ని వెలికితీసే ద్రావకం(kamaDa)గా ఉపయోగిం చిvఆకుల,కాండం పరిమాణం 350మైక్రాన్కంటే తక్కువ, సంగ్రహణ సమయం23.95 నిమిషాలు,పదార్థానికి ద్రావకంకు సంగ్రహణ నిష్పత్తి 15.08 mL/g నిష్పత్తితో గాలి ప్రవాహం 6.31 mL/min.g.తో ప్రక్రియను కొనసాగించబడింది.ఈ పద్ధతిలో చేసినపుడు,సేకరించతగిన అట్రోపిన్ శాతం 6.81% కి సమానం. కాని సేకరించిన అట్రోపిన్ శాతం 6.31%, ఇది అంచనా వేసిన విలువతో పోలిస్తే కొద్దిగా తేడాను చూపింది.పాత విధానంలో 5.59% దిగుబడి వచ్చింది.[17]

ఫెనిలాలనైన్ నుండి ప్రారంభమయ్యే అట్రోపిన్ యొక్క బయోసింథసిస్ మొదట ట్రాన్స్‌మినేషన్‌ఫార్మింగ్ ఫినైల్పైరువిక్ యాసిడ్‌కు లోనవుతుంది, ఇది ఫినైల్-లాక్టిక్ ఆమ్లంగా తగ్గించబడుతుంది.[18] కోఎంజైమ్ A అప్పుడు ట్రోపిన్ ఏర్పడే లిటోరిన్‌తో ఫినైల్-లాక్టిక్ యాసిడ్‌ను జత చేస్తుంది, ఇది హైయోసైమైన్ ఆల్డిహైడ్‌ను ఏర్పరుచుకునే aP450 ఎంజైమ్‌తో ప్రారంభించబడిన తీవ్రమైన పునర్వ్యవస్థీకరణకు లోనవుతుంది.ఒక డీహైడ్రోజినేస్ అప్పుడు ఆల్డిహైడ్‌ను ప్రాథమిక ఆల్కహాల్ తయారీ (-)-హయోసైమైన్‌గా తగ్గిస్తుంది, ఇది రేస్‌మైజేషన్ తర్వాత అట్రోపిన్‌ను ఏర్పరుస్తుంది.[18]

అట్రోపిన్ భౌతిక ధర్మాలు

[మార్చు]

అట్రోపిన్ ఒక యాంటికోలినెర్జిక్, కోలినెర్జిక్ మస్కారినిక్ విరోధి. అట్రోపిన్ చర్య యొక్క విధానం కోలినెర్జిక్ విరోధి, కోలినెర్జిక్ మస్కారినిక్ విరోధి.[19]అట్రోపిన్ మస్కారినిక్ కోలినెర్జిక్ గ్రాహకాల యొక్కఏకస్వభావక అనుభూతితో, పోటీ విరోధిగా పనిచేస్తుంది, తద్వారా పారాసింపథెటిక్ స్టిమ్యులేషన్ యొక్క ప్రభావాలను నిరోధిస్తుంది.ఈ ఏజెంట్ టాచీకార్డియాను ప్రేరేపిస్తుంది, స్రావాలను నిరోధించవచ్చు, మృదువైన కండరాలను సడలించవచ్చు(NCI04).[20]

తెల్లటి స్ఫటికాలు లేదా పొడి రూపంలో వుండును.[21]కాంతి ద్వారా నెమ్మదిగా ప్రభావితమవుతుంది.[21]అట్రోపిన్ సల్ఫేట్ ను 40°C కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి.శీతలీకరణ నివారించాలి.కనిష్ట జలవిశ్లేషణ 3.5pH వద్ద జరుగుతుంది. [22]వియోగం చెందెలా వేడి చేసినప్పుడు అది విషపూరిత పొగలను(నైట్రోజన్ ఆక్సైడ్లు) విడుదల చేస్తుంది.[23] [21]

అట్రోపిన్ భౌతిక ధర్మాల పట్టిక[24]

[మార్చు]
లక్షణం/గుణం మితి/విలువ
అణు ఫార్ములా C17H23NO3
అణుభారం 289.37 గ్రా/మోల్
ద్రవీభవన ఉష్ణోగ్రత 115-118 °C
మరుగు స్థానం 431.53°C (అంచనా)
సాంద్రత 1.0470(అంచనా)
వక్రీభవన గుణకం 1.5200 (అంచనా)
ఫ్లాష్ పాయింట్ 2℃
నీటిలో ద్రావణీయత 1.6గ్రాలీ,18 ºCవద్ద

వైద్య పరమైన ఉపయోగాలు

[మార్చు]
  • అట్రోపైన్ అనేక రుగ్మత పరిస్థితులకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. శస్త్రచికిత్స సమయంలో శ్వాసనాళంలో లాలాజలం, ద్రవాన్ని తగ్గించడానికి ఈ ఔషధం ఉపయోగించబడుతుంది.ఇది పురుగుమందు, పుట్టగొడుగుల విషానికి చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఇది నెమ్మదిగా గుండె కొట్టుకోవడానికి చికిత్స చేయడానికి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించవచ్చు.[25]
  • అట్రోపిన్ అనేది ట్రోపేన్ ఆల్కలాయిడ్ సాధారణంగా నొప్పి, మంటను తగ్గించడానికి ఉపయోగిస్తారు. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుంది.ఇది వాపు, జ్వరం, నొప్పిని కలిగించే ఎంజైమ్‌లను నిరోధించడం ద్వారా పనిచేస్తుంది.[26]

అట్రోపిన్ ఎలా పని చేస్తుంది?

[మార్చు]

అట్రోపిన్ ఒక యాంటికోలినెర్జిక్ డ్రగ్‌గా వర్గీకరించబడింది, అంటే ఇది వివిధ శారీరక విధుల్లో కీలక పాత్ర పోషించే న్యూరోట్రాన్స్‌మిటర్ అయిన ఎసిటైల్‌కోలిన్ చర్యను అడ్డుకుంటుంది.అసిటైల్‌కోలిన్‌ను నిరోధించడం ద్వారా, అట్రోపిన్ శరీరంపై అనేక ప్రభావాలను చూపుతుంది:[26]

  • కనుపాప వ్యాకోచం: అట్రోపిన్ కళ్ళలోని కనుపాప/కంటిపాపలను వ్యాకోచించేలా చేస్తుంది, అందుకే దీనిని కంటి పరీక్షలు, కొన్ని కంటి పరిస్థితుల కోసం నేత్ర వైద్యంలో ఉపయోగిస్తారు.
  • ద్రవాల స్రావం తగ్గించును : అట్రోపిన్ శ్వాసకోశ, జీర్ణశయాంతర ప్రేగులలో స్రావాలను తగ్గిస్తుంది, ఇది అధిక లాలాజలం, అతిసారం వంటి పరిస్థితుల చికిత్సకు ఉపయోగ పడుతుంది.
  • హృదయ స్పందన రేటు పెంచును : ఇది హృదయాన్ని ఉత్తేజపరుస్తుంది, హృదయ స్పందన రేటును పెంచుతుంది, ఇదిహృదయ సంబంధ అత్యవసర పరిస్థితుల్లో విలువైనదిగా చేస్తుంది.
  • మృదువైన కండరాల సడలింపు: అట్రోపిన్ యాంటికోలినెర్జిక్ గుణాలు మృదు కండరాలకు విశ్రాంతినిస్తాయి, ఇది శ్వాసనాళాలను విస్తరించడం ద్వారా ఉబ్బసం వంటి పరిస్థితులకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది.

అట్రోపిన్ అనేది సాధారణంగా ఆసుపత్రి లేదా డాక్టర్ చికిత్సాలయం వంటి చోట వైద్య నేపధ్యంలో ఆరోగ్య సంరక్షణ నిపుణుడిచే ఇవ్వబడే ఔషధం.నిర్దిష్ట మోతాదు, ఇచ్చే వ్యవధిఅనేది వైద్యకారణం , రోగి వయస్సు, బరువు, వైద్య చరిత్ర, ఇతర కారకాలపై ఆధారపడి ఉంటుంది.[26]

అట్రోపిన్ యొక్క ఇంట్రావీనస్(సిరలోనికి ఎక్కించడం), ఇంట్రామస్కులర్(కండరంలోనికి ఇవ్వడం), సబ్కటానియస్(చర్మంలోకివ్వడం), ఇంట్రాసోసియస్, ఎండోట్రాషియల్( శ్వాసనాళాల్లోనికి) వాడకం తీవ్రమైన లేదా ప్రాణాంతక మస్కారినిక్ ప్రభావాలను తాత్కాలికంగా నిరోధించడానికి సూచించబడుతుంది.[27]పెన్ ఇంజెక్టర్ రూపంలో అట్రోపిన్ యొక్క ఇంట్రామస్కులర్ ఉపయోగం కోలినెస్టరేస్ చర్యతో పాటు ఆర్గానోఫాస్ఫరస్ లేదా కార్బమేట్ క్రిమిసంహారకాలను కలిగి ఉండే అవకాశం ఉన్న ఆర్గానోఫాస్ఫరస్ నరాల ఏజెంట్ల ద్వారా ఏర్పడే విషం యొక్క చికిత్స కోసం సూచించబడుతుంది.[28]అట్రోపిన్ యొక్క నేత్ర ఉపయోగం మైడ్రియాసిస్, సైక్లోప్లెజియా, అంబ్లియోపియా చికిత్సలో కంటి కోసం సూచించబడింది.[29] అట్రోపిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ (Atropin Sulphate Injection) శస్త్రచికిత్స సమయంలో కండరాల సడలింపుల ప్రభావాన్ని తిరోగమనం చేయడానికి ఇతర మందులతో కలిపి ఉపయోగించవచ్చు.

ఇది హైపర్హైడ్రోసిస్ చికిత్సలో ఉపయోగపడుతుంది, మరణిస్తున్న రోగుల మరణ ఘోషను నిరోధించవచ్చు.అట్రోపిన్ అధికారికంగా FDA ద్వారా ఈ ప్రయోజనాల కోసం సూచించబడనప్పటికీ, ఈ ప్రయోజనాల కోసం వైద్యులు దీనిని ఉపయోస్తున్నారు.[30]

దుష్పలితాలు

[మార్చు]

అట్రోపిన్ మందును వాడినపుడు కొందరు వ్యక్తుల్లో కన్పించే దుష్పలితాలు.ఇలాంటి చిహ్నాలు కన్పించినపుడు సంబంధిత వైద్యున్ని లేదా అందుబాటులో వున్న వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

అట్రోపిన్ యొక్క కొన్ని సాధారణ దుష్ప్రభావాలు

[మార్చు]

అట్రోపిన్ యొక్క కొన్ని సాధారణ దుష్ప్రభావాలు ఇక్కడ ఇవ్వబడినవి. [31][32]

  • నోరు పొడిబారటం (ఎండిపోవడం)
  • దృష్టి] మసక బారటం
  • కాంతికి సున్నితత్వం
  • చెమట లేకపోవడం
  • తల తిరగడం
  • వికారం కలగడం
  • సంతులనం కోల్పోవడం
  • హైపర్సెన్సిటివిటీ ప్రతిచర్యలు
  • వేగవంతమైన హృదయ స్పందన రేటు వుండటం

అట్రోపిన్ తీసుకునేటప్పుడు ఆల్కహాల్ వినియోగం మైకము లేదా మగతను పెంచుతుంది.నారో యాంగిల్ గ్లాకోమా ఉన్నవారు అట్రోపిన్‌ని ఉపయోగించకూడదు.ఇతర యాంటికోలినెర్జిక్ ఔషధాలతో అట్రోపిన్ కలపడం వల్ల దుష్ప్రభావాల ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి మందుల ఉదాహరణలు ఉన్నాయి.[33] అలాంటి మందులు కింద ఇవ్వబడినవి

  • డిఫెన్హైడ్రామైన్ (బెనాడ్రిల్),
  • డైసైక్లోమైన్ (బెంటిల్),
  • బెంజ్ట్రోపిన్ (కోజెంటిన్),
  • ట్రైహెక్సీఫెనిడైల్ (ఆర్టేన్),,
  • అమిట్రిప్టిలైన్ (ఎండెప్, ఎలావిల్).

ఇవికూడా చదవండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Atropine". go.drugbank.com. Retrieved 2024-03-16.
  2. "CHEBI:16684 - atropine". ebi.ac.uk. Retrieved 2024-03-16.
  3. "BROWSE DRUG CLASSES". ebi.ac.uk. Retrieved 2024-03-16.
  4. "The Beat Goes On: The Story of Five Ageless Cardiac Drug". go.drugbank.co. Retrieved 2024-03-16.
  5. 5.0 5.1 "Hallucinogenic Plants in the Mediterranean Countries". sciencedirect.com. Retrieved 2024-03-16.
  6. "Health Effects of Alkaloids from African Medicinal Plants". sciencedirect.com. Retrieved 2024-03-16.
  7. Lee, 2007
  8. (Zárate, el Jaber-Vazdekis, Medina, & Ravelo, 2006)
  9. Döbereiner J.W. Deutsches Apothekerbuch; zum Gebrauche bei Vorlesungen und zum Selbstunterrichte für Apotheker, Droguisten, Aerzte und Medicin-Studirende. Walz; Stuttgart, Germany: 1847.
  10. 10.0 10.1 "Ueber das Atropin". chemistry-europe.onlinelibrary.wiley.com. Retrieved 2024-03-16.
  11. Geiger P.L., Hesse O. Über das Atropin. Pharm. Cent. 1833;49:768.
  12. Lossen W. Ueber das Atropin. Ann. der Chemie und Pharm. 1864 doi: 10.1002/jlac.18641310103
  13. 13.0 13.1 Wolffenstein R. Die Pflanzenalkaloide. Julius Springer Verlag; Heidelberg, Germany: 1922.
  14. Willstätter R. Umwandlung von Tropidin in Tropin (Conversion of tropidine into tropine), Berichte der Deutschen chemischen Gesellschaft zu Berlin 1901; 34: 3163-5.
  15. 15.0 15.1 A Goodman & Gilman’s The Pharmacological Basis of Therapeutics, 11th Edition. Hardman JG, Limbird LE, Gilman AG, editors. New York: McGraw-Hill, 2011. p.93-198.
  16. "Integrated processes of extraction and liquid membrane isolation of atropine from Atropa belladonna roots". sciencedirect.com. Retrieved 2024-03-16.
  17. "Optimization of Atropine Extraction Process from Atropa Belladonna by Modified Bubble Column Extractor with Ultrasonic Bath" (PDF). ijcce.ac.ir. Retrieved 2024-03-16.
  18. 18.0 18.1 Dewick PM (9 March 2009). Medicinal Natural Products: A Biosynthetic Approach (3rd ed.). Chichester: A John Wiley & Sons. ISBN 978-0-470-74167-2.
  19. "Atropine". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-16.
  20. "Atropine (Code C28840)". Retrieved 2024-03-16.
  21. 21.0 21.1 21.2 "Atropine". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-16.
  22. Trissel, L.A. Handbook on Injectable Drugs. 9th ed. Bethesda, MD. American Society of Health-System Pharmacists' Product Development. 1996., p. 109
  23. Lewis, R.J. Sax's Dangerous Properties of Industrial Materials. 9th ed. Volumes 1-3. New York, NY: Van Nostrand Reinhold, 1996., p. 289
  24. "Atropine". chemicalbook.com. Retrieved 2024-03-16.
  25. "Atropine injection". my.clevelandclinic.org. Retrieved 2024-03-17.
  26. 26.0 26.1 26.2 "Atropine". carehospitals.com. Retrieved 2024-03-17.
  27. "Atropine". go.drugbank.com. Retrieved 2024-03-17.
  28. "ATROPEN (atropine injection), for intramuscular use" (PDF). accessdata.fda.gov. Retrieved 2024-03-17.
  29. "ISOPTO® ATROPINE (atropine sulfate ophthalmic solution) 1%, for topical ophthalmic use" (PDF). accessdata.fda.gov. Retrieved 2024-03-17.
  30. Chudoku Kenkyu. Antidose therapy for organophosphate poisoning 2008; 21: 151-9.
  31. "Atropine Side effects". medicoverhospitals.in. Retrieved 2024-03-17.
  32. "Atropine". practo.com. Retrieved 2024-03-17.
  33. "atropine (Atreza)". medicinenet.com. Retrieved 2024-03-17.