Jump to content

పైపెరిన్

వికీపీడియా నుండి
పైపెరిన్
పేర్లు
Preferred IUPAC name
(2E,4E)-5-(2H-1,3-Benzodioxol-5-yl)-1-(piperidin-1-yl)penta-2,4-dien-1-one
ఇతర పేర్లు
(2E,4E)-5-(Benzo[d][1,3]dioxol-5-yl)-1-(piperidin-1-yl)penta-2,4-dien-1-one
Piperoylpiperidine
Bioperine
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [94-62-2]
పబ్ కెమ్ 638024
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:28821
SMILES O=C(N1CCCCC1)\C=C\C=C\c2ccc3OCOc3c2
  • InChI=1/C17H19NO3/c19-17(18-10-4-1-5-11-18)7-3-2-6-14-8-9-15-16(12-14)21-13-20-15/h2-3,6-9,12H,1,4-5,10-11,13H2/b6-2+,7-3+

ధర్మములు
C17H19NO3
మోలార్ ద్రవ్యరాశి 285.34 g·mol−1
సాంద్రత 1.193 g/cm3
ద్రవీభవన స్థానం 130 °C (266 °F; 403 K)
బాష్పీభవన స్థానం Decomposes
40 mg/l
ద్రావణీయత in ethanol soluble
ద్రావణీయత in chloroform 1 g/1.7 ml
ప్రమాదాలు
భద్రత సమాచార పత్రము MSDS for piperine
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references
పైపెరిన్
స్కోవిల్లె స్కేల్150,000[1] SHU

పైపెరిన్ ఒక ఆల్కలాయిడ్. దీనిని నల్ల మిరియాలు(piper nigrum) ల నుండి ఉత్పత్తి చేస్తారు. మిరియాలకు ఘాటైన వాసన,రుచి అనేది పైపెరిన్ వలననే వస్తుంది. ఇది నీటిలో కొద్దిగా కరుగుతుంది., ఆల్కహాల్, క్లోరోఫాం, ఈథరులలో ఎక్కువగా కరుగుతుంది. పైపెరిన్ కొన్ని రకాల సాంప్రదాయ ఔషధాలలో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. దీని వాణిజ్య ఉపయోగం ఆధునిక మూలికా వైద్యంలో ఉంది. పైపెరిన్ యొక్క మూడు ఐసోమర్లు (చావిసిన్, ఐసోచావిసిన్, ఐసోపిపెరిన్), పైపెరనైన్ (పైపెరిన్ యొక్క డైహైడ్రోఫారం) అనేవి నల్ల మిరియాల్లో లభ్యం. [2] నల్ల మిరియాలు 2-7.4% వరకు పైపెరిన్‌ను కలిగి ఉండును, మిరియాలమొక్క పెరిగిన నేల స్వభావం,వాతావరణ పరిస్థితులు,మొక్క రకాన్ని బట్టి పైపెరిన్ శాతంలో హెచ్చు థగ్గులు వుండును.[3]

చరిత్ర

[మార్చు]

పైపెరిడిన్ అనే ఆల్కలాయిడ్‌ను నల్ల మిరియాల నుండి హాన్స్ క్రిస్టియన్ ఓర్స్టెడ్ అనే శాస్త్రవేత్త 1819 లో కనుగొన్నారు, వేరు చేశారు.[4] [5]

పైపెరిన్ ఉత్పత్తి

[మార్చు]

నీటిలో కరిగే సామర్థ్యం తక్కువగా ఉన్నందున, డైక్లోరోమీథేన్ వంటి సేంద్రీయ ద్రావకాలను ఉపయోగించి పైపెరిన్ సాధారణంగా నల్ల మిరియాలు నుండి సంగ్రహించబడుతుంది.[6]నల్ల మిరియాలు పైపెరిన్ యొక్క నాలుగు ఐసోమెరిక్ రూపాలను కలిగి ఉంటాయి, అవి ట్రాన్స్-ట్రాన్స్ ఐసోమర్ (1, పైపెరిన్), సిస్-ట్రాన్స్ ఐసోమర్ (2, ఐసోపిపెరిన్), సిస్-సిస్ ఐసోమర్ (చావిసిన్, 3),, ట్రాన్స్-సిస్ ఐసోమర్ (ఐసోచావిసిన్, 4) పైపెరైన్‌పై తర్వాత జరిపిన పరిశోధనలలో నల్ల మిరియాల సారంలో ఉన్న కొన్ని ఇతర ఆల్కలాయిడ్‌లను గుర్తించారు. అవి పైపెరనైన్, పైపెరెటిన్,పైపెరిలిన్ A,పైపెరోలిన్ B,, పైపెరిసిన్లు.[7] మిరియాల నుండి పైపెరిన్ ను ఇథనాల్,మరియుగడ్డకట్టిన ఎసిటిక్ ఆమ్లం లను ద్రావణిగా ఉపయోగించి మొదట ముడి పైపెరైన్‌ ను ఉత్పత్తి చేస్తారు.వివిధ పద్దతులలో రసాయానాలను వాడి పైపెరిన్ ను శుద్ధి చేస్తారు.[7]

భౌతిక గుణాలు

[మార్చు]

పైపెరిన్ ఘన రూపంలో వుండును. సహజంగా రంగులేని, తెల్లని స్పటిక ఘనరూపం అయినప్పటికీ, సాధారణంగా లేత పసుపు రంగు కలిగి వుండును.[8]

భౌతిక గుణాల పట్టిక [8]

సంఖ్య గుణం మితి/శాతం
1 ఫార్ములా C17H19NO3
2 అణు భారం 285.34 g/mol
3 ద్రవీభవన ఉష్ణోగ్రత 129 °C
4 వేపరు ప్రెసరు 0.00000013 [mmHg]
5 సాంద్రత 1.193
6 మరుగు ఉష్ణోగ్రత 498.00 to 499.00 °C. (1 atm )
7 ద్రావణీయత ఇథనాల్ ,ఈథరు లో క రుగును
8 నీటిలో ద్రావణీయత 0.04 mg/mL at 18 °C

రసాయనిక ధర్మాలు

[మార్చు]

పైపెరిన్ ను ఒక క్షారము ఉపయోగించి పిపెరిడిన్, పైపెరిక్ ఆమ్లం గా హైడ్రోలైజ్ చేయవచ్చు. [5]

పైపెరిన్ ఉపయోగాలు

[మార్చు]

1. పైపెరిన్ అనేక ఔషధ ప్రభావాలను, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నది , ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది , ఇన్సులిన్-నిరోధకత తగ్గింపు గుణం వున్నది , శోథ నిరోధక ప్రభావం వున్నది , హెపాటిక్ స్టీటోసిస్ ను తగ్గిస్తుంది.[9]

2.పైపెరిన్ అనేది ఒక రకమైన అమైడ్ ఆల్కలాయిడ్, ఇది యాంటీఆక్సిడెంట్,యాంటీక్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ,యాంటీహైపెర్టెన్సివ్, హెపాటోప్రొటెక్టివ్, న్యూరోప్రొటెక్టివ్, జీవ లభ్యత, సంతానోత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలను మెరుగుపరుచడం వంటి వంటి ప్లియోట్రోపిక్ లక్షణాలను ప్రదర్శిస్తుంది.[10]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Mangathayaru, K. (2013). Pharmacognosy: An Indian perspective (in ఇంగ్లీష్). Pearson Education India. p. 274. ISBN 9789332520264.
  2. "piperine". www.sciencedirect.com. Retrieved 2024-02-02.
  3. "Piperine:A view of its biological effects". Retrieved 2014-02-02.
  4. "Piperine: Sources, Properties, Applications, and Biotechnological Production". link.springer.com/. Retrieved 2014-02-02.
  5. 5.0 5.1 Henry, Thomas Anderson (1949). "Piperine". The Plant Alkaloids (4th ed.). The Blakiston Company. p. 1-2.
  6. Epstein, William W.; Netz, David F.; Seidel, Jimmy L. (1993). "Isolation of Piperine from Black Pepper". J. Chem. Educ. 70 (7): 598. Bibcode:1993JChEd..70..598E. doi:10.1021/ed070p598.
  7. 7.0 7.1 "piperine". sciencedirect.com. Retrieved 2014-02-02.
  8. 8.0 8.1 "piperine". pubchem.ncbi.nlm.nih.gov/. Retrieved 2014-02-02.
  9. "Piperine and Its Role in Chronic Diseases". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2014-02-02.
  10. "Molecular and pharmacological aspects of piperine". ncbi.nlm.nih.gov. Retrieved 2014-02-02.
"https://te.wikipedia.org/w/index.php?title=పైపెరిన్&oldid=4194574" నుండి వెలికితీశారు