కోల్చిసీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోల్చిసీన్
Skeletal formula of colchicine
Ball-and-stick model of the colchicine molecule
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
N-[(7S)-1,2,3,10-Tetramethoxy-9-oxo-5,6,7,9-tetrahydrobenzo[a]heptalen-7-yl]acetamide
Clinical data
వాణిజ్య పేర్లు Colcrys, Mitigare, others
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a682711
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం D (AU)
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) -only (CA) POM (UK) -only (US)
Routes By mouth
Pharmacokinetic data
Bioavailability 45%
Protein binding 35-44%
మెటాబాలిజం Metabolism, partly by CYP3A4
అర్థ జీవిత కాలం 26.6-31.2 hours
Excretion Feces (65%)
Identifiers
CAS number 64-86-8 checkY
ATC code M04AC01
PubChem CID 6167
IUPHAR ligand 2367
DrugBank DB01394
ChemSpider 5933 checkY
UNII SML2Y3J35T checkY
KEGG D00570 checkY
ChEBI CHEBI:27882 checkY
ChEMBL CHEMBL107 checkY
Chemical data
Formula C22H25NO6 
 • CC(=O)N[C@H]1CCC2=CC(=C(C(=C2C3=CC=C(C(=O)C=C13)OC)OC)OC)OC
 • InChI=1S/C22H25NO6/c1-12(24)23-16-8-6-13-10-19(27-3)21(28-4)22(29-5)20(13)14-7-9-18(26-2)17(25)11-15(14)16/h7,9-11,16H,6,8H2,1-5H3,(H,23,24)/t16-/m0/s1 checkY
  Key:IAKHMKGGTNLKSZ-INIZCTEOSA-N checkY

 checkY (what is this?)  (verify)

కోల్చిసీన్ అనేది ఒక ఆల్కలాయిడ్.కోల్చికమ్(colchicum)అనే మొక్క నుండి ఈ ఆల్కలాయిడులభిస్తుంది.ఒక లేత పసుపు, స్ఫటికాకార ఆల్కలాయిడ్,దీని రసాయనిక ఫర్ములాC22H25NO6.[1]కోల్చిసీన్ అనేది గౌట్ మరియు ఫ్యామిలీఅల్ మధ్యధరా ఫీవర్ చికిత్సకు అలాగే ప్రధాన హృదయనాళ సంబంధ సమస్యల నివారించడానికి ఉపయోగించే ఆల్కలాయిడ్.[2] కోల్చిసీ న్ అనేది లిల్లీ కుటుంబానికి చెందిన మొక్క నుండి తీసుకోబడిన ఆల్కలాయిడ్ డ్రగ్, మొక్కను కోల్చికమ్ ఆటమ్ లేదా "ఆటమ్ క్రోకస్ అని పిలుస్తారు.[3] దీని ఉపయోగం మొదటిసారిగా 1961లో FDA చే ఆమోదించబడింది.[4] ఇది ఇతర తాపజనక మరియు ఫైబ్రోటిక్ పరిస్థితుల చికిత్సలకై కూడా పరిశోధించబడింది.[5]

కొల్చికమ్(colchicum)

[మార్చు]

కొల్చికమ్, కొల్చికేసి కుటుంబంలోని పుష్పించే మొక్కల జాతి కి చెందిన మొక్క,ఇది యురేషియాకు చెందిన మొక్క కొల్చికమ్ ప్రజాతి, దాదాపు 30 రకాల గుల్మములను(herbs)కలిగి ఉన్నది.కాండం లేని, క్రోకస్ లాంటి పువ్వులు శరదృతువులో వికసిస్తాయి మరియు కొన్నింటిని శరదృతువు క్రోకస్(ఆటమ్ క్రోకస్) మరియు మైదానపుకుంకుమ పువ్వు(meadow saffron) అని పిలుస్తారు.పండు మూడు-వాల్వ్ క్యాప్సూల్, ఇది ఆకులు పుట్టే వసంత కాలంలో పండ్లు పండుతాయి.కొన్ని జాతులలో ఆకులు శరదృతువులో పువ్వులతో సహ భూమి నుండి పుడతాయి.అనేక జాతులు వాటి గులాబీ, తెలుపు లేదా నీలిరంగు ఊదారంగుకల్గిన గొట్టపు ఆకారపు పువ్వుల కోసం అలంకారమైనమొక్కలుగా సాగు చేయబడతాయి.[6]అనేక జాతులు అలంకారమైనమొక్కలుగా సాగు చేయబడుతున్నాయి,ముఖ్యంగా C.ఆటమ్, C.బర్న్ముల్లెరి మరియు C.స్పెసియోసమ్.

కోల్చిసీన్ చరిత్ర

[మార్చు]

కోల్చిసీన్ అనేది గౌట్‌కు(వాతరోగము/కీళ్లవాతం) ఒక చారిత్రాత్మక చికిత్స, దీనిని సహస్రాబ్ది కంటే ఎక్కువ కాలంగా ఉపయోగిస్తున్నారు.నేటికీ వాడుకలో ఉన్న పురాతన నివారణలలో కోల్చిసీన్ ఒకటి.కీళ్ల నొప్పులకు మూలికా ఔషధంగా దాని చరిత్ర కనీసం 1500 BCE లో వున్నట్లు ఈజిప్షియన్ మాన్యుస్క్రిప్ట్, ఎబర్స్ పాపిరస్ వలన తెలుస్తున్నది. కోల్చిసీన్,1800ల ప్రారంభంలో వేరుచేయబడింది, శుద్ధి చేయబడిన సహజ ఉత్పత్తిగా నేటికీ వాడుకలో ఉంది.[7][8]ఔషధాలలో కోల్చిసీన్ యొక్క సుదీర్ఘ చరిత్ర కలిగి వున్నను 2009 వరకు U.S. ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా కోల్చిసీన్ ఆమోదించబడకపోవడం ఆశ్చర్యకరం.[9]

1వ శతాబ్దపు A.D., పెడానియస్ డయోస్కోరైడ్స్, గ్రీకు వైద్యుడు మరియు ఔషధ నిపుణుడు, తన ఫార్మకోపియా, డి మెటీరియా మెడికాలో గౌట్ చికిత్సకు కోల్చికమ్‌ను ఉపయోగించడాన్ని వివరించాడు.[10][11]కోల్చిసీన్ పేరు పురాతన గ్రీకులోని కొల్చిస్ జిల్లాలో విషంగా ఉపయోగించడం వల్ల రావచ్చు.కొల్చిస్ రాజు యొక్క మంత్రగత్తె కుమార్తె మెడియా, దానిని తన విషాలలో ఒకటిగా ఉపయోగించింది మరియు గ్రీకు పురాణాలలో దీనిని "కొల్చికాన్ మెడియా యొక్క విధ్వంసక అగ్ని"గా సూచిస్తారు.[12][10]చాలా ఏళ్లుగా, ఈ ఔషధం పర్షియా మరియు టర్కీకి చెందిన వివిధ గ్రంథాలలో వివరించబడింది మరియు ఇది 1618లో లండన్ ఫార్మకోపియాలో గుర్తించబడింది.[10]18వ శతాబ్దంలో, ఫ్రెంచ్ మిలటరీ అధికారి, నికోలస్ హుస్సన్, గౌట్ చికిత్సకు వాణిజ్య ఔషధంగా అభివృద్ధి చేసిన ఈయూ మెడిసినేల్‌లో కోల్చిసీన్ ‌ను ప్రధాన పదార్ధంగా ఉపయోగించారు.బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఈ ఉత్పత్తిని తన సొంత గౌట్( కీళ్లవాతం)చికిత్సకు విజయవంతంగా ఉపయోగించాడు మరియు U.S.కు కోల్చిసీన్‌ను పరిచయం చేసిన ఘనత పొందాడు.[13]కోల్చిసీన్ మొదటిసారిగా 1820లో ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్తలు పియర్-జోసెఫ్ పెల్లెటియర్ మరియు జోసెఫ్-బియెనైమ్ కేవెంటౌచే వేరుచేయబడింది మరియు కోల్చిసీన్ అనే శుద్ధి చేయబడిన క్రియాశీల పదార్ధాన్ని 1833లో ఫిలిప్ లోరెంజ్ గీగర్ అభివృద్ధి చేశారు.[14]

కోల్చిసీన్ యొక్క సుదీర్ఘ చరిత్ర వాడుకలో ఉన్నప్పటికీ, U.S. ఫుడ్ & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ 2009 వరకు ఆమోదించబడని డ్రగ్స్ ఇనిషియేటివ్ కింద గౌట్ మరియు ఫమిలియ మధ్యధరా జ్వరం (FMF) చికిత్సకు కోల్చిసీన్‌ను ఆమోదించలేదు.[15][16]

మొక్కలో కోల్చిసీన్ పరిమాణం

[మార్చు]

కోల్చిసీన్ ను కొలచ్చికమ్ మొక్క అనేక భాగాలనుండి(కందం/దుంప,విత్తనాలు, ఆకులు మరియు పువ్వులు) నుండి వేరుచేసి, దానిని అధిక-పనితీరుగల లిక్విడ్ క్రోమాటోగ్రఫీ (HPLC) ఉపయోగించి దాని పరిమాణాన్ని నిర్ణయించారు.పరిశీలించిన అన్నిమొక్క భాగాలలో అత్యధిక శాతం కోల్చిసీన్ (0.191% ± 0.036) ను కందం(corm)కలిగి ఉంది, ఆ తర్వాత విత్తనాలు (0.103% ± 0.021) కల్గి ఉన్నాయి.[17]

సంగ్రహణ

[మార్చు]

కోల్చిసీన్ అనేది కొల్చికమ్ఆటమ్మ,రియు కోల్చికమ్ లుటియం,విత్తనాలలో, అలాగే గ్లోరియోసా సూపర్బా(ఫ్యామిలీ లిలియాసీ) దుంపలలో ఉండే ఆల్కలాయిడ్.కోల్చిసీన్‌ను తీయడానికి అనేక పద్ధతులు అభివృద్ధి చేయబడ్డాయి మరియు వీటిలో 'సాక్స్‌లెట్ మరియు ఘన-ద్రవ వెలికితీత(soxhlet and solid–liquid extraction’)'విధానాలు అత్యంత సాధారణంగా ఉపయోగించబడుతుంది.[18]మిథనాల్ ఉపయోగించి C.ఆటమనలే(C. autumnale) నుండి కోల్చిసీన్ యొక్క సంగ్రహణచేస్తారు.[19]మరియు గ్లోరియోసా విత్తనాల నుండి మిథనాల్ ద్వారా సంగ్రహణ చేస్తారు.[20]కొన్ని సార్లు గ్లోరియోసా విత్తనాల నుండి ఈథనాల్ ద్వారా కూడా సంగ్రహణ చేస్తారు.[21]

A

ఇటీవలి సంవత్సరాలలో, ఫైటోకెమికల్స్(మొక్కలలోని రసాయన సమ్మేళనాలు) వెలికితీత కోసం సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్ (CO2) ఎక్స్‌ట్రాక్షన్ (SCFE) వాడకం వేగంగా పెరుగుతోంది.సాంప్రదాయ ద్రావకం వెలికితీతతో పోల్చినప్పుడు SCFE ఉత్తమమైనది ఎందుకంటే ప్రక్రియ చవకైనది మరియు ఉత్పత్తి పదార్థం అవశేష ద్రావకాల రహితం.అదనంగా,CO2 తో SCFE వెలికితీత పర్యావరణ అనుకూల సాంకేతికతగా పరిగణించబడుతుంది.[21][22]

కోల్చిసీన్ భౌతిక ధర్మాలు

[మార్చు]

కోల్చిసీన్ వాసన లేని లేదా దాదాపు వాసన రహిత లేత పసుపు రంగు తో సూదులవంటి రూపంతో లేదా పొడిగా కనిపిస్తుంది, ఇది కాంతికి గురైనప్పుడు ముదురు రంగులోకి మారుతుంది.[23][24](S) -colchicine అనేది (S)-కాన్ఫిగరేషన్ కలిగిన కోల్చిసీన్.[25]

కోల్చిసీన్ యొక్క IUPAC పేరు: N-[(7S)-1,2,3,10-tetramethoxy-9-oxo-6,7-dihydro-5H-benzo[a]heptalen-7-yl]acetamide

లక్షణం/గుణం మితి/విలువ
రసాయనిక ఫార్ములా C22H25NO6
అణుభారం 399.4 గ్రా /మోల్[26]
ద్రవీభవన ఉష్ణోగ్రత 142-150°C[27]
మరుగు స్థానం 522.37°C (సుమారు అంచనా) [28]
సాంద్రత 1.2770 [28]
వక్రీభవన గుణకం 1.5614 [28]
నీటిలో ద్రావణీయత 1 గ్రా 22 mL నీటిలో కరిగిపోతుంది[29]
pH 0.5% ద్రావణం యొక్క pH: 5.9

ఔషధ చర్య

[మార్చు]

కోల్చిసీన్ ట్యూబులిన్‌తో చాలా బలమైన బైండింగ్ అనుబంధాన్ని కలిగి ఉంది, ఇది మైక్రోటూబ్యూల్ గుంపుకట్టడాన్ని నిరోధిస్తుంది మరియు తద్వారా కణ విభజనను నిరోధిస్తుంది(Herdman et al., 2016)[30].ఈ యాంటీమిటోటిక్ మెకానిజం క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడానికి కీమోథెరపీలో ఉపయోగించబడింద[31]అదనంగా, కోల్చిసీన్ మానవ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను నిరోధించే ఇంటర్‌లుకిన్ -8 ఉత్పత్తిని పెంచుతుంది.[32]అయినప్పటికీ,వైద్యపరంగా ఆమోదయోగ్యమైన అధిక సాంద్రతల కారణంగా కోల్చిసీన్ యొక్క యాంటీకాన్సర్ అప్లికేషన్‌లు పరిమితం చేయబడ్డాయి.[33]క్రోమోజోమ్ సంఖ్యలను రెట్టింపు చేయడానికి ప్లాంట్ సైటోజెనెటిక్స్‌లో కోల్చిసీన్ విజయవంతంగా ఉపయోగించబడింది.ఉదాహరణకు, కోల్చిసీన్ అనాఫేస్ వద్ద స్పిండిల్ ఫైబర్స్ ఏర్పడటాన్ని నిరోధిస్తుంది, ఫలితంగా క్యాబేజీ మరియు బ్రోకలీలో వలె హోమోజైగస్ క్రోమోజోమ్‌లు ప్రతిరూపం అవుతాయి.[34]రెండవది, గౌటు /కీళ్ళ వాతం చికిత్సకు శతాబ్దాలుగా కోల్చిసీన్ విస్తృతంగా ఉపయోగించబడింది.కోల్చిసీన్ చికిత్స దైహిక వాపును తగ్గిస్తుంది.[35]నిజానికి, కోల్చిసీన్ డయాబెటిక్ నెఫ్రోపతీలో యాంటీఫైబ్రోటిక్ ప్రభావాలను కలిగి ఉంది.[36]కోల్చిసీన్ చికిత్స హృదయ సంబంధ వ్యాధులను నిరోధించగలదని క్లినికల్ డేటా సూచించింది.[37]

ఔషధంగా వినియోగం

[మార్చు]
 • . ఆల్కలాయిడ్ కోల్చిసీన్ బెహెట్స్ వ్యాధి మరియు అల్జీమర్స్ వ్యాధి, రుమాటిజం చికిత్స, గౌట్, యాంటీ ఆక్సిడెంట్లు, క్రోమోజోమ్‌ల రెట్టింపు వంటి వాటికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.[38][39]
 • కోల్చిసీన్ చికిత్స గ్రెలిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కోల్చిసీన్ అనేది ట్యూబులిన్ పాలిమరైజేషన్ ఇన్హిబిటర్ మరియు సైటోప్లాస్మిక్ రవాణా మరియు ఎక్సోసైటోసిస్‌ను నిరోధిస్తుంది(Thyberg and Moskalewski, 1985).అందువల్ల, సైటోప్లాజంలో స్రవించే ప్రోటీన్ల చేరికను ప్రోత్సహించడానికి కోల్చిసీన్ ‌తో జంతువుల చికిత్స సాధారణంగా ఉపయోగించబడుతుంది.[40]
 • ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫైబ్రోటిక్ మరియు కార్డియోవాస్కులర్ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటుంది.కోల్చిసీన్ క్యాన్సర్ కణాల వలసలను నిరోధించడం మరియు ఆంజియోజెనిసిస్ వంటి యాంటీకాన్సర్ లక్షణాలను ప్రదర్శిస్తుందని చూపబడింది.[41]
 • కోల్చిసీన్, గౌటు/కీళ్ళ వాతం(గౌటీ ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు) యొక్క ప్రభావాన్ని నివారించడానికి లేదా చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. రక్తంలో యూరిక్ యాసిడ్ఎక్కువగా ఉండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. యూరిక్ యాసిడ్ కీళ్లలో మంట (నొప్పి, ఎరుపు, వాపు మరియు వేడి) కలిగించినప్పుడువాతం యొక్క తీవ్రత పెరుగును . కోల్చిసీన్ గౌట్‌ను నయం చేయదు, కానీ ఇది గౌట్తీవ్రత నిరోధించడంలో సహాయపడుతుంది. కోల్చిసీన్ సాధారణ నొప్పి నివారిణి కాదు మరియు చాలా రకాల నొప్పిని తగ్గించదు.[42]
 • కోల్చిసీన్ గుండెపోటు, స్ట్రోక్, కొన్ని రకాల గుండె ప్రక్రియలు మరియు అథెరోస్క్లెరోసిస్ (ధమనుల లోపల ఫలకం పేరుకుపోవడం తెలిసినది) లేదా బహుళ హృదయనాళ ప్రమాద కారకాలతో బాధపడుతున్న రోగులలో గుండె సంబంధిత మరణాల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు.[42]
 • కోల్చిసీన్ 2 విధాలుగా ఉపయోగించవచ్చు. తీవ్రమైన వ్యాధి బాధ లేదావాపు వల్ల కలిగే ఇతర సమస్యలను నివారించడానికి చాలా మంది వ్యక్తులు చాలా కాలం (నెలలు లేదా సంవత్సరాలు) క్రమం తప్పకుండా చిన్న మొత్తంలో తీసుకుంటారు.ఇతర వ్యక్తులు తక్కువ వ్యవధిలో (అనేక గంటలు) పెద్ద మొత్తంలో కోల్చిసీన్ తీసుకుంటారు, అది సంభవించే వ్యాధి ప్రభావం నుండి ఉపశమనం పొందేందుకు ఔషధం అవసరమైనప్పుడు మాత్రమే.మొదటి (నివారణ) రకమైన చికిత్సతో తీవ్రమైన దుష్ప్రభావాల అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.[42]

వాతరోగము/గోటు చికిత్స

[మార్చు]
గౌటు వ్యాధిని  చికిత్స చేయడానికి ఈ మందులను తీసుకుంటుంటే మీ డాక్టర్ ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా అనుసరించాలి. వ్యాధికి సంబంధించిన మొదటి సంకేతం తెలిసిన వెంటనే కోల్చిసీన్ తీసు కుంటే ఈ ఔషధం ఉత్తమంగా పనిచేస్తుందివ్యాధిని గుర్తించిన వెంటనే సిఫార్సు చేయబడిన మోతాదు 1.2 మిల్లీగ్రాములు, తర్వాత ఒక గంట తర్వాత 0.6 మిల్లీగ్రాములు తీసుకోవాలి.గరిష్టంగా సిఫార్సు చేయబడిన మోతాదు 1-గంట వ్యవధిలో 1.8 మిల్లీగ్రాములుతీసుకోవచ్చు.[43]

ఫ్యామిలీల్ మధ్యధరా ఫీవర్

[మార్చు]

ఫ్యామిలీల్ మధ్యధరా జ్వరం వల్ల కలిగే నొప్పి యొక్క తీవ్రతను నివారించడానికి ఈ మందులను తీసుకుంటే, సాధారణ మోతాదు రోజువారీ 1.2 నుండి 2.4 మిల్లీగ్రాములు.మొత్తం మోతాదును రోజుకు ఒకసారి తీసుకోవచ్చు లేదా రోజుకు రెండు మోతాదులుగా విభజించవచ్చు.[43]

 • డాక్టరు సూచించిన మందు మోతాదును పెంచరాదు లేదా సూచించిన దానికంటే ఎక్కువ తరచుగా లేదా ఎక్కువసేపు ఈ మందును ఉపయోగించరాదు.ఎక్కువ మోతాదు లో మందును వెంటవెంటనే తీసుకోవడం వలన ప్రయోజనం వుండదు. దుష్పలితాలు కూడా కలుగ వచ్చు.

మందుగా తీసుకున్నప్పుడు

[మార్చు]

కోల్చిసీన్ ను లోపలికి తీసుకున్న 30 నిమిషాల నుండి 2 గంటల తర్వాత పని చేయడం ప్రారంభిస్తుంది, అయితే నొప్పి మెరుగవడానికి ఒకటి లేదా రెండు రోజులు పట్టవచ్చు.వైద్యుడు సూచించిన మోతాదుకు కట్టుబడి ఉండటం ముఖ్యం. కొంచెం ఎక్కువ తీసుకోవడం చాలా తీవ్రమైనదుష్పలితాలు కలుగవచ్చు.కోల్చిసీన్ తీసుకునేటప్పుడు ద్రాక్షపండు మరియు ద్రాక్షపండు రసం తీసుకోరాదు.ఇది శరీరంలో కోల్చిసీన్ మొత్తాన్ని పెంచుతుంది.ఆహారంతో లేదా తర్వాత కోల్చిసీన్ తీసుకోవడం వల్ల కడుపులో ఎటువంటి ఆమ్లత్వం వుండదు.ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. ఇది గౌటును మరింత దిగజార్చవచ్చు.[44]

కోల్చిసీన్ వాడకం వలన కలిగే దుష్పలితాలు

[మార్చు]

కోల్చిసీన్ వాడకం వలన ఈ కింద సూచించిన దుష్పలితాలు రోగిలో ఏర్పడవచ్చు/కలుగవచ్చు[45]

 • అలెర్జీ ప్రతిచర్యలు:చర్మపు దద్దుర్లు, దురద, దద్దుర్లు, ముఖం, పెదవులు, నాలుక లేదా గొంతు మీద వాపు ఏర్పడటం.
 • ఇన్ఫెక్షన్(వ్యాధి సంక్రమణ): జ్వరం, చలి, దగ్గు, గొంతు నొప్పి, నయం చేయని గాయాలు, నొప్పి లేదా మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది, సాధారణ అసౌకర్యం లేదా అనారోగ్యం వంటివి.
 • కండరాల గాయం-అసాధారణ బలహీనత లేదా అలసట, కండరాల నొప్పి, ముదురు పసుపు లేదా గోధుమ రంగు మూత్రం, మూత్రం మొత్తంలో తగ్గుదల ఏర్పడటం.
 • చేతులు లేదా పాదాలలో నొప్పి, జలదరింపు లేదా తిమ్మిరి.
 • అసాధారణ రక్తస్రావం లేదా గాయాలు

ఇవి కూడా చదవండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. "colchicine". dictionary.com. Retrieved 2024-03-21.
 2. FDA Approved Drug Products: Colcrys (colchicine) tablets for oral use (May 2020)
 3. Angelidis C, Kotsialou Z, Kossyvakis C, Vrettou AR, Zacharoulis A, Kolokathis F, Kekeris V, Giannopoulos G: Colchicine Pharmacokinetics and Mechanism of Action. Curr Pharm Des. 2018;24(6):659-663. doi: 10.2174/1381612824666180123110042. (PubMed ID 29359661)
 4. FDA Pharmacology Review: Mitigare (colchicine) Oral Capsules
 5. "Colchicine". go.drugbank.com. Retrieved 2024-03-21.
 6. "Colchicum". britannica.com. Retrieved 2024-03-21.
 7. Roubille F, Kritikou E, Busseuil D, et al. Colchicine: an old wine in a new bottle? Antiinflamm Antiallergy Agents Med Chem. 2013;12:14–23.
 8. "Colchicine: an old wine in a new bottle". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-21.
 9. Slobodnick A, Shah B, Pillinger MH, et al. Colchicine: old and new. Am J Med. 2015;128:461–70
 10. 10.0 10.1 10.2 Hartung EF. History of the use of colchicum and related medicaments in gout; with suggestions for further research. Ann Rheum Dis. 1954 Sep;13(3):190–200.
 11. "History of the use of colchicum and related medicaments in gout; with suggestions for further research". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-21.
 12. Nerlekar N, Beale A, Harper RW. Colchicine—a short history of an ancient drug. Med J Aust. 2014 Dec 11;201(11):687–688.
 13. Nerlekar N, Beale A, Harper RW. Colchicine—a short history of an ancient drug. Med J Aust. 2014 Dec 11;201(11):687–688.
 14. Roddy E, Mallen CD, Doherty M. Gout. BMJ. 2013 Oct 1;347:f5648.
 15. Roubille F, Kritikou E, Busseuil D, Barrere-Lemaire S, Tardif JC. Colchicine: An old wine in a new bottle? Antiinflamm Antiallergy Agents Med Chem. 2013;12(1):14–23.
 16. "Colchicine: an old wine in a new bottle?". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-21.
 17. "Antifungal potential of Colchicum luteum and determination of colchicine content using HPLC for application as a fungicide". sciencedirect.com. Retrieved 2024-03-13.
 18. Husek A., Sutlupinar N., Potesilova A., Dvorackova S., Hanus V., Sedmera P., Malon P., Simanek V. Alkaloids and phenolics of three Merendera Species. Phytochemistry. 1989;28:3217–3219. doi: 10.1016/0031-9422(89)80310-3.
 19. Finnie J.F., Van Staden J. Gloriosa superba L. (Flame Lily): Micropropagation and In Vitro Production of colchicines. Biotechnology in Agriculture and Forestry, Medicinal and Aromatic Plants VI. Volume 26. Springer; Berlin/Heidelberg, Germany: 1994. pp. 146–166.
 20. Joshi C.S., Priya E.S., Mathela C.S. Isolation and anti-inflammatory activity of colchicinoids from Gloriosa superba seeds. Pharm. Biol. 2010;48:206–209. doi: 10.3109/13880200903081770.
 21. 21.0 21.1 Ellington E., Bastida J., Viladomat F., Codina C. Super Critical carbon dioxide extraction of colchicine and related alkaloids from seeds of Colchicum autumnale. Phytochem. Anal. 2003;4:164–169. doi: 10.1002/pca.702.
 22. Mansoori G.A., Schulz K., Martinelli E. Bioseparation using Super Critical Fluid Extraction/Retrograde Condensation. Bio. Technol. 1988;6:393–396.
 23. U.S. Environmental Protection Agency. 1998. Extremely Hazardous Substances (EHS) Chemical Profiles and Emergency First Aid Guides. Washington, D.C.: U.S. Government Printing Office.
 24. "COLCHICINE". cameochemicals.noaa.gov. Retrieved 2024-03-21.
 25. "(S)-colchicine". ebi.ac.uk. Retrieved 2024-03-21.
 26. Computed by PubChem 2.2 (PubChem release 2021.10.14)
 27. O'Neil, M.J. (ed.). The Merck Index - An Encyclopedia of Chemicals, Drugs, and Biologicals. Whitehouse Station, NJ: Merck and Co., Inc., 2006., p. 415
 28. 28.0 28.1 28.2 "64-86-8(Colchicine) Product Description". chemicalbook.com/. Retrieved 2024-03-21.
 29. O'Neil, M.J. (ed.). The Merck Index - An Encyclopedia of Chemicals, Drugs, and Biologicals. Whitehouse Station, NJ: Merck and Co., Inc., 2006., p. 415
 30. {{citeweb|url=https://pubs.rsc.org/en/content/articlelanding/2016/md/c6md00459h |title=Synthesis and biological evaluation of benzocyclooctene-based and indene-based anticancer agents that function as inhibitors of tubulin polymerization |publisher= pubs.rsc.org|accessdate=2024-03-21}
 31. Johnson, L., Goping, I. S., Rieger, A., Mane, J. Y., Huzil, T., Banerjee, A., et al. (2017). Novel colchicine derivatives and their anti-cancer activity. Curr. Top. Med. Chem. doi: 10.2174/1568026617666170104143618 [Epub ahead of print].
 32. "Interleukin-8 enhances the effect of colchicine on cell death". sciencedirect.com. Retrieved 2024-03-21.
 33. Lin, Z. Y., Kuo, C. H., Wu, D. C., and Chuang, W. L. (2016). Anticancer effects of clinically acceptable colchicine concentrations on human gastric cancer cell lines. Kaohsiung J. Med. Sci. 32, 68–73. doi: 10.1016/j.kjms.2015.12.006
 34. "Chromosome Doubling of Microspore-Derived Plants from Cabbage (Brassica oleracea var. capitata L.) and Broccoli (Brassica oleracea var. italica L." frontiersin.org. Retrieved 2024-03-21.
 35. Akodad, M., Lattuca, B., Nagot, N., Georgescu, V., Buisson, M., Cristol, J. P., et al. (2017). COLIN trial: Value of colchicine in the treatment of patients with acute myocardial infarction and inflammatory response. Arch. Cardiovasc. Dis. doi: 10.1016/j.acvd.2016.10.004 [Epub ahead of print].
 36. "Colchicine in Renal Medicine: New Virtues of an Ancient Friend". karger.com. Retrieved 2024-03-21.
 37. Frommeyer, G., Krawczyk, J., Dechering, D. G., Kochhäuser, S., Leitz, P., Fehr, M., et al. (2017). Colchicine increases ventricular vulnerability in an experimental whole-heart model. Basic Clin. Pharmacol. Toxicol. 120, 505–508. doi: 10.1111/bcpt.12702
 38. (Aisen et al., 2001, Ahmad et al., 2006, Ahmad, 2010).
 39. B. Ahmad Antioxidant activity and phenolic compounds from Colchicum luteum Baker (Liliaceae) J. Biotechnol., 9 (2010), pp. 5762-5766
 40. "2.1 Colchicine treatment". sciencedirect.com. Retrieved 2024-03-21.
 41. Leung YY, Yao Hui LL, Kraus VB: Colchicine--Update on mechanisms of action and therapeutic uses. Semin Arthritis Rheum. 2015 Dec;45(3):341-50. doi: 10.1016/j.semarthrit.2015.06.013. Epub 2015 Jun 26. (PubMed ID 26228647)
 42. 42.0 42.1 42.2 "Colchicine (Oral Route)". mayoclinic.org. Retrieved 2024-03-13.
 43. 43.0 43.1 "Colchicine - Uses, Side Effects, and More". webmd.com/. Retrieved 2024-03-13.
 44. "About colchicine". nhs.uk. Retrieved 2024-03-21.
 45. "What side effects may I notice from receiving this medication?". clevelandclinic.org. Retrieved 2024-03-21.