పైరెథ్రిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పైరెథ్రిన్ (Pyrethrin) కొన్ని రకాలక్రిసాన్తిమం(చామంతి పూల పూల మొక్కల జాతి ) పువ్వులలో, విత్తనాలలో(అండాశయ భాగం) సహజంగా కనిపించే పురుగుమందు. కీటక నాశిని లేదా కీటక నోరోధిని గా పనిచెస్తుంది.పైరెథ్రిన్లు కీటకాలపై విషపూరితమైన ప్రభావాన్ని చూపే ఆరు రకాల రసాయనాల మిశ్రమం. దోమలు, ఈగలు, చిమ్మటలు, చీమలు లాగే అనేక ఇతర మొక్కల తెగుళ్లను నియంత్రించడానికి పైరెథ్రిన్లను సాధారణంగా ఉపయోగిస్తారు.[1]పైరెథ్రిన్లను సాధారణంగా పువ్వుల నుండి వేరు చేయబడతాయి. అయినప్పటికీ, అవి సాధారణంగా పువ్వు నుండి తీసినపుడు కొన్నిమలినాలను కలిగి ఉంటాయి.వాటిని శుద్ధికరణ ప్రక్రియలో తొలగిస్తారు. పిండిచేసిన పువ్వులను పైరేత్రం పొడి అంటారు. 1950ల నుండి పురుగుమందులలో ఉపయోగం కోసం పైరెథ్రిన్లనువాడుతున్నట్లు రికార్డులలో నమోదు చేయ బడింది.ప్రస్తుతం 2,000 పైగా నమోదిత పురుగుమందుల ఉత్పత్తులలో పైరెథ్రిన్లు కనిపిస్తాయి. ఈ మందుల్లో చాలావాటిని ఇళ్ళల్లోమరియు చుట్టుపక్కల వుండే కిటకాలను పారద్రోలటానికి,లేదాచంపటానికి అలగే పంటలు కీటకాల వలన హానినినిరోధించుటకు పైరెథ్రిన్ వున్న పురుగుల మందులనూపయోగిస్తారు. అలంకారమైన మొక్కలలో వాటిని తెగుళ్ల నుండి కాపడుటకు కూడ ఉపయోగించబడతాయి.పైరెథ్రిన్లు సాధారణంగా ఫాగర్‌లు (బగ్ బాంబ్‌లు), స్ప్రేలు, డస్ట్‌లు మరియు పెట్ షాంపూలలో కనిపిస్తాయి.[1]

పైరెథ్రిన్ చరిత్ర[మార్చు]

పైరెథ్రిన్ వుండే పూలతల(అండాశయ భాగం)

1840ల నుండి పైరెథ్రమ్ యొక్క క్రిమిసంహారక లక్షణాల గురించి పశ్చిమ ఐరోపా మరియు యునైటెడ్ స్టేట్స్‌లో అక్కడి ప్రజలకు తెలుసు. అయితే 17వ శతాబ్దం చివరి నాటికే తూర్పు ఐరోపాలో పైరెథ్రిన్ యొక్క క్రిమిసంహరక గుణాల గురించి కనుగొనబడింది.[2][3]19వ శతాబ్దంలో పైరెత్రమ్ ఉత్పత్తులను ప్రధానంగా ఇళ్ళల్లో వుండే కీటకాలను, పురుగులను చెంపే పురుగుల మందులుగా ఉపయోగించారు.[4]20వ శతాబ్దం ప్రారంభంలో, పైరెథ్రిన్ కలిగిన మందులు కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణకు సాధనాలుగా మారాయి (ఉదా. మలేరియా మరియు పసుపు జ్వరం)[5][6]1920ల ప్రారంభంలో పైరెథ్రిన్ యొక్క క్రియాశీల భాగాలుగా పైరెథ్రిన్‌లను గుర్తించడం, వాటి నిర్మాణం మరియు చర్య యొక్క విధానంపై పరిశోధననుపై ఆసక్తి పెరిగి కొత్త పరిశోధనలకు దారితీసింది.[7] పరిశోధనల పలితంగా మొక్కలలోని పైరెథ్రుమ్ లో 6 రకాల పైరెథ్రిన్ ల ఉనికిని వాటి అణు సౌష్టటవనిర్మాణాన్ని గుర్తించారు.ఆలాగే వాటి సంష్లేషణ కూడా కనుగొన్నారు,అలాగే స్వాభావికంగా మొక్కలలలో లభించే ఈ పైరెథ్రిన్ లతో పాటు కృత్రిమంగా కూడా తయారుచేసి, వాటితో కీటకనాశక మందులు తయారీ ప్రారంభించారు.[8][9]కృత్రిమంగా తయారు చేసిన పురుగుల మందులు, స్వాభావికంగా మొక్కల నుండి తీసిన పైరెథ్రిన్ మందుల కన్న చాలా చౌక ధరలో లభించడం వలన క్రమంగా మొక్కల నుండి తీసిన పైరెథ్రిన్ మందుల వాడకం తగ్గిపోయి వాటి ఉత్పత్తిని నిలిపి వేశారు. అయితే తిరిగి స్వాభావిక పైరెథ్రిన్ ఉత్పత్తుల యుగం మళ్ళీ మొదలైంది. పైరెథ్రిన్ ల ప్రారంభ గుర్తింపు నుండి దాదాపు 100 సంవత్సరాల తరువాత , శాస్త్రవేత్తలు మళ్లీ సహజమైన పైరిథ్రిన్‌లను ఆచరణీయమైన వ్యవసాయ పురుగుమందులుగా తయారిపై అన్వేషణ మొదలైంది.[10][11]

స్వాభావిక పైరిథ్రిన్‌ల వాడకం మరియు ఉత్పత్తిపై మళ్ళీ శాస్త్రవేత్తలు, ఉత్పత్తి దారులు మరియు ప్రకృతి పరిరక్షక వేత్తలు ఆసక్తి కనపరచుటకు కారణం కృత్తిమ మరియు స్వాభావిక పైరిథ్రిన్‌ ల జీవితకాల వ్యవధి. కృత్తిమ పైరిథ్రిన్‌లను వాడిన తరువాత వాటి ప్రభావం పరిసరాలపై కొన్ని వారాలపాటు వుండగా (అర్ధ జీవితకాలం), స్వాభావికంగా మొక్కలనుండి తీసిన పైరిథ్రిన్‌ల నుండి తీసిన పురుగులమందుల ప్రభావం పరిసరాలపై కేవలం కొన్ని గంటలు లేదా ఒకటి, రెండు రోజులు మాత్రమే.[12]

పైరెథ్రిన్ లభ్యత[మార్చు]

పైరెథ్రిన్ అనేది క్రిసాన్తిమం సినెరారిఫోలియం మరియు క్రిసాన్తిమం కోకినియం మొక్కల పూల రెక్కల నుండి లభిస్తుంది. ఎండిన పూల తలల నుండి పైరెథ్రిన్ ను తీస్తారు. పైన పెర్కొన్న మొక్కలు ఆస్టరేసి కుటుంభానికి చెందిన మొక్కలు. ఈ కుంటుంబ మొక్కలను తెలుగులో చామంతి పువ్వు అని అంటారు. చామంతి పూలల్లో పలురకాలు వున్నాయి. క్రిసాన్తిమం సినెరారిఫోలియం మరియు క్రిసాన్తిమం కోకినియం జాతి మొక్కల ఫూలనుండే ఎక్కువ శాతంలో పైరెథ్రిన్ లభిస్తుంది. డాల్మేషియన్ పైరెత్రమ్ (టానాసెటమ్ సినెరారిఫోలియం) మొక్క పూలలో లో జీవక్రియల ఫలితంగా ఉత్పన్నం కాబడిన మధ్య తరగతి శ్రేణి కి చెందిన రసాయన సమ్మేళనాలు పైరెథ్రిన్‌లు. ఈ పైరెథ్రిన్‌లు, ఆ మొక్కలపై కీటకాలు మరియు శిలీంధ్ర వ్యాధికారక క్రిముల దాడిని సమర్ధవంతంగా నిరోధించే శక్తి కలిగి వుండి తెగుళ్ల నుండి మొక్కలను రక్షిస్తాయి.[13]

పైరెథ్రిన్ అనేది క్రిసాన్తిమం సినెరారిఫోలియం మొక్కలోనే మిగతా మొక్కలకన్న ఎక్కువ పరిమాణంలో లభిస్తుంది. అలాగే మొక్క అన్ని భాగాలలో పైరెథ్రిన్ వున్నప్పటికి, మొక్క యొక్క పూలల్లో పైరెథ్రిన్ అదిక పరిమాణంలో లభిస్తుంది. అదికూడా పూర్తిగా వికసించిన పూలల్లోని తల (head) విత్తనభాగం (అండాశయం) లో ఎక్కువ ఉండును.[14]

పూలల్లో పైరెథ్రిన్ లభ్యతశాతం[మార్చు]

సాధారణంగా రెక్క చామంతి (డాల్మేషియన్ రకం)పొడి పువ్వుల బరువులో మొత్తం పైరెథ్రిన్ పరిమాణం 0.36 నుండి 1.3% లేదా మొక్క రకాన్ని బట్టి 0.10 నుండి 1.35% వరకు ఉంటుందని అంచనా వేయబడింది. ఉత్పత్తి చేయబడిన వాణిజ్య సాగులలో ఉదా: టాస్మానియాలో, మొత్తం పైరెథ్రిన్ కంటెంట్ దాదాపు 1.8 నుండి 2.5% వరకు ఉన్నట్లు నివేదించబడింది. అయితే కెన్యా మరియు USAలలో బ్రీడింగ్ లైన్లలో నివేదించబడిన పదార్థ శాతం 3.0% వరకు ఉంది.[15]

తనసెటమ్ సినెరారిఫోలియం (Tanacetum cinerariifolium) (రెక్క చామంతి)మొక్క[మార్చు]

తనసెటమ్ సినెరారిఫోలియం

రెక్క చామంతి అని తెలుగులో పిలవబడె తనసెటమ్ సినెరారిఫోలియం మొక్కను డాల్మేషియన్ పెల్లిటరీ (Dalmatian pellitory) మొక్క అనికూడా పిలుస్తారు. ఇది కంఫొసిటే కుటుంబాబికి చెందిన పూల మొక్క. పూలు గుత్తులుగా వుండును. ఇది చిన్న పొదలా పెరిగే మొక్క. ఇది బహు వార్షిక మొక్క. ఇది తనసెటమ్ జాతికి చెందిన మొక్క. మొక్క అడుగు నుండి 2 అడూగుల ఎత్తువరకు పెరుగును. వెడల్పు (పొద విస్తరణ) కూడా 1 అడుగు నుండి రెండు అడుగుల వరకు ఉండును. ఇసుక నేలలు ఈ మొక్క పెరుగుదలకు అనుకూలం. నీరు నిల్వ వుండని నేలలు మొక్క సాగుకు అనుకూలం. సీతాకోక చిలుకల వలన పూలల్లో పరాగ సంప్కరం వేగవంతం చెయ్యబడును. పూలు సువాసన భరితంగా వుండును.[16]

మొక్క ఆవాసం-సాగు[మార్చు]

ఈ మొక్క మూలస్థానం యుగోస్లేవియా లోని అల్బేనియా అని భావిస్తారు.ఈ మొక్క సాగు ఆస్ట్రియా, కొలంబియా, సైప్రస్, ఈక్వెడార్, ఇథియోపియా, ఫ్రాన్స్, జర్మనీ, హంగేరి, ఇటలీ, జావా, కొరియా, క్రిమ్, మారిషస్, మయన్మార్, నేపాల్, పాకిస్థాన్, పెరూ, రువాండా, రీయూనియన్, సౌత్ యూరోపియన్ రస్సీ, స్పెయిన్, శ్రీలంక, స్విట్జర్లాండ్, టాస్మానియా , ట్రాన్స్‌కాకస్, ఉక్రెయిన్, వియత్నాం, పశ్చిమ హిమాలయా లలో వున్నది.[17] కెన్యా 1998లో ప్రపంచంలోని పైరెథ్రిన్ ఉత్పత్తిలో 90% (6,000 టన్నులకు పైగా) ఉత్పత్తి చేసింది. టాంజానియా మరియు ఈక్వెడార్‌లలో కూడా ఉత్పత్తి గణనీయంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోని ప్రధాన ఉత్పత్తిదారు ఆస్ట్రేలియా

పైరెథ్రిన్ ను పూలనుండి సంగ్రహించు విధానం[మార్చు]

బాగా ఎండబెట్టిన పూల తలల నుండి (విత్తన భాగం, అండాశయ భాగం) నుండి ద్రావణులను/ద్రావకాలను (solvents) ఉపయోగించి వెలికితియ్యడం జరుగుతుంది. పూల తోటలనుండి సెకర్రించిన పూల నుండి పూల తలలను (flower heads) వేరు చెసి, నీడలో వాటిని మూందు భాగా ఎండ బెట్తి, వాటిలోని తేమ శాతంను తగ్గిస్తారు. పైరెథ్రిన్ రసాయన సమ్మేళనాలు పూలతలభాగం (అండాశయభాగం)లొని విత్తనాలలొ వుండును. కావున ఎండిన పూలతలలను నలగగొట్టి అందులొని అనవసర పదార్థాలను వీలున్నంత ఎక్కువగ తొలగిస్తారు. తరువాత విత్తన భాగలను పిండిలా నలగగొట్టి అందులో నుండి పైరెథ్రిన్ ను ద్రావణి/ద్రావకం ను ఉపయోగించి వెరుచెస్తారు. వాణిజ్యపరంగా పొడిలా నలగ కొట్టిన ఎండిన పువ్వుల నుండి పైరెథ్రిన్ ను పూర్తిగా సంగ్రహణం వివిధ రకాల పరికారాలలో ఆల్కహాల్, అసిటోన్, బెంజోల్, క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్లు మొదలైన వివిధ సేంద్రీయ ద్రావకాలను మరియు పెట్రోలియం ఈథర్, హెక్సేన్ వంటి హైడ్రోకార్బన్, నాఫ్తా మరియు కిరోసిన్. నూనెలతో సహా అనేక రకాల ద్రావణిలను ఉపయోగించి పైరెథ్రిన్ ను వేరుచేయవచ్చును.[18].సిద్ధాంతపరంగా తక్షణమే పైరేత్రిన్‌లను కరిగించుకొనే గుణమున్నఏ ద్రావకం/ద్రావణిని అయినా ఉపయోగించవచ్చు. ఇటీవలి సంవత్సరాలలో ఆచరణాత్మక వాణిజ్య వినియోగం రెండు కారణాల వల్ల హెక్సేన్ వంటి తక్కువ-మరుగుతున్న ఉష్ణోగ్రత ఉన్న హైడ్రోకార్బన్ ద్రావకాల ఉపయోగంపై దృష్టి కేంద్రీకృతమై ఉంది. ద్రావణిలలో కరగి న పైరేత్రిన్‌లు అధిక ఉష్ణోగ్రతల వద్ద అస్థిరంగా ఉంటాయి మరియు 60 C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతవద్ద ఎక్కువ కాలం వేడిచేయడం వల్ల పైరిథ్రిన్స్ యొక్క జీవసంబంధ (క్రిమి సంహరక లక్షణాలు) లక్షణాలు కొంతవరకు నాశనం అవుతాయి.అందువల్ల సంగ్రహణ కోసం సుమారు 60 C. లేదా అంతకంటే తక్కువ వద్ద మరిగే ద్రావకాన్ని ఉపయోగించడం మంచిది, అయినప్పటికీస్వేదనక్రియ దశ వాక్యూమ్‌ను ఉపయోగించినట్లయితే అధిక మరిగే ఉష్ణోగ్రత వున్న ద్రావకాలను ఉపయోగించవచ్చు.[18]

కొన్ని పరిశ్రమలలో తాజాగా సేకరించిన పూలతలల నుండి కూడా సాల్వెంట్ సంగ్రహణ విధానంలో పైరెథ్రిన్ ను ఉత్పత్తిచేస్తున్నారు. పూలను ఎక్కువ కాలం నిల్వ చేయరాదు. పువ్వులలోని పైరెత్రమ్ క్రియాశీల పదార్థాలు కాలక్రమేణా విచ్ఛిన్నమవుతాయి. రైతులు పండించిన 3 నెలల్లోపు ఫ్యాక్టరీ వద్ద పంపిణీ చేస్తే పూలకు ఉత్తమ ధర లభిస్తుంది. ఆ తరువాత, క్రియాశీల పదార్థాలు విచ్ఛిన్నం అవడం ప్రారంభిస్తాయి. తాజాగా ఎండిన పువ్వుతో పోలిస్తే 6 నెలల ఎండిన పువ్వులో సక్రియ పదార్థాలలో సగం మాత్రమే ఉండవచ్చు.[19]

పైరెథ్రిన్ నిర్మాణం-భౌతిక లక్షణాలు[మార్చు]

స్వాభావికం పూలనుండే ఉత్పత్తి అయ్యే పైరెథ్రిన్‌ అనే క్రిమిసంహారక క్రియాశీల పదార్ధం లో 6రకాల క్రిమిసంహారక క్రియాశీల పదార్థాలు వున్నవి. అవి పైరెత్రిన్స్ I మరియు II, సినెరిన్స్ I మరియు II, మరియు జాస్మోలిన్స్ I మరియు II) – ఈ మొక్కలు ఆస్ట్రేలియా మరియు ఆఫ్రికాలో సాధారణంగా కనిపించే క్రిసాన్తిమం పువ్వుల నుండి తీసుకోబడిన వృక్ష సంబంధిత క్రిమిసంహారకాలు.[20]

భౌతిక గుణాల పట్టిక[మార్చు]

పైరెథ్రిన్ యొక్క భౌతిక ,రసాయనిక గుణాలు.
Group పైరెథ్రిన్ I పైరెథ్రిన్ II
రసాయన సమ్మేళనం పైరెథ్రిన్ I[21] సినెరిన్ I[22][21] జాస్మోలిన్ I పైరెథ్రిన్  II[23][21] సినెరిన్ II[21] జాస్మోలిన్ II
అణు నిర్మాణం Pyrethrin I Cinerin I Jasmolin I Pyrethrin II Cinerin II Jasmolin II
రసాయన ఫార్ములా C21H28O3 C20H28O3 C21H30O3 C22H28O5 C21H28O5 C22H30O5
అణు భారం (g/mol) 328.4 316.4 330.5 372.5 360.4 374.5
మరుగు ఉష్ణోగ్రత(°C) 170 137 ? 200 183 ?
వాయు/ఆవిరి వత్తిడి at 25 °C (mmHg) 2.03×10−5 1.13×10−6 ? 3.98×10−7 4.59×10−7 ?
నీటిలో ద్రావణీయత (mg/L) 0.2 0.085 ? 9.0 0.03 ?

నీటిలో సాధారణంగా పైరెథ్రిన్ కరగదు.పైరెథ్రిన్స్, [ఘన] తెల్లని ద్రవాలకు (లేదా టాన్ డస్ట్) రంగులేనిదిగా కనిపిస్తుంది.ఆల్కహాల్,అసిటోన్, కిరోసిన్, కార్బన్ టెట్రాక్లోరైడ్, నైట్రోమెథేన్, అలాగే ఇథిలీన్ డైక్లోరైడ్‌లో కరుగుతుంది; నీటిలో కరగదు. సేంద్రీయ ద్రావకాలలో కరుగుతుంది, ఉదా. ఆల్కహాల్‌లు, హైడ్రోకార్బన్‌లు, సుగంధ ద్రవ్యాలు, ఈస్టర్లు మొదలైనవి.[24]

కీటకాలపై పైరెథ్రిన్ ప్రభావం[మార్చు]

 • పైరెథిన్ లు అనేవి టానాసెటమ్ సినెరారియాఫోలియం అనే మొక్క యొక్క పువ్వుల నుండి పొందిన క్రిమిసంహారక సమ్మేళనాలు టానాసెటమ్ సినెరారియాఫోలియం ను క్రిసాన్తిమం సినెరారియాఫోలియం లేదా పైరెత్రమ్ సినేరియాఫోలియం అని కూడా పిలుస్తారు. పైరెథ్రిన్ చాలా తక్కువ విషపూరితంతో అధిక ప్రకోపగుణము కలిగిస్తాయి. క్షీరదాలు కీటకాల కంటే పైరెథ్రిన్ మరియు పైరెథ్రాయిడ్ ల విషపూరిత గుణానికి తక్కువగా ప్రభావితం అవుతాయి, ఎందుకంటే క్షీరదాలువేగవంతమైన జీవక్రియ వలన ఏర్పడిన పదార్థాలు వెంటనే విసర్జించబడటం, అధిక శరీర ఉష్ణోగ్రతవలన పైరెత్రిన్స్/పైరెథ్రాయిడ్‌లకుక్షీరదాలు తక్కువగా ప్రభావితం అవుతాయి.[25]
 • సాధారణంగా, పైరెథ్రిన్లు మానవులపై మరియు ఇతర క్షీరదాలపై తక్కువ విషపూరితం గా ఉంటాయి. అయితే, ఇది చర్మంపైన పడితే, అది చికాకు కలిగిస్తుంది. ఇది సంపర్క ప్రదేశంలో జలదరింపు లేదా తిమ్మిరిని కూడా కలిగిస్తుంది. పైరెథ్రిన్లు పక్షులకు ఆచరణాత్మకంగా విషపూరితం కాదు, కాని తేనెటీగలకు అత్యంత విషపూరితమైనవి. ఏది ఏమైనప్పటికీ, పరాగ సంపర్కాలకు కొంత ప్రమాదం వాటిల్లవచ్చు స్వల్ప వికర్షక చర్య వల్ల. అయితే వేగవంతమైన పైరెథ్రిన్ విచ్ఛిన్నం వల్ల, పైరెథ్రిన్ ద్వారా తేనెటీగలకు కలిగే హాని పరిమితం చేయబడింది.[1]
 • పైరెథ్రిన్లు చేపలకు అత్యంత విషపూరితమైనవి. ఇవిఎండ్రకాయలు,రొయ్యలు, గుల్లలు మరియు జల కీటకాలకు కూడా చాలా విషపూరితమైనవి. దీనికి కారణం ఇది తక్కువ ఉష్ణోగ్రతల వద్ద పైరెథ్రిన్లు అధిక విషపూరిత స్వభావం కల్గి వుండటం. పైరెథ్రిన్‌లకు దీర్ఘకాలికంగా గురికావడం వల్ల చేపలు మరియు జల కీటకాలలో పునరుత్పత్తి పై దుస్ప్రభావంకు కారణమవుతుందని ఆధారాలు కన్పించాయి.[1]
 • పైరెథ్రిన్ అనేది మొక్కలనుండి స్వాభావికంగా లభించే కిటక నాశిని. పైరెథ్రాయిడ్స్ అనేవి మనవ నిర్మితమైన కీటక నాశిని. పైరెథ్రాయిడ్స్ అనేవి పైరెథ్రిన్ ల కన్నఎక్కువ విషపూరితమైనవి, వాటి వలన పరిసరాలకు ఎక్కువ ప్రభావం పడుతుంది.[26]అందువలన కొన్ని సందర్భాల లో రెండింటిని కలిపి పురుగుల మందులు తయారు చెస్తారు.
 • విషపూరితమైన ఆరు రసాయనాల మిశ్రమం. దోమలు, ఈగలు, ఈగలు, చిమ్మటలు, చీమలు మరియు అనేక ఇతర తెగుళ్లను నియంత్రించడానికి పైరెత్రిన్‌లను సాధారణంగా ఉపయోగిస్తారు.
 • తల పేల నివారణకు కూడా పైరెథ్రిన్ ఉపయోగిస్తారు.

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 "pyrethrins". npic.orst.edu. Retrieved 2024-03-05.
 2. McLaughlin GA (1973) History of Pyrethrum In Pyrethrum: The Natural Insecticide (Casida JE, ed), pp. 3–15, Academic Press
 3. "Bugs in the system: insects, agricultural science, and professional aspirations in Britain, 1890-1920". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-05.
 4. Lange HW and Akesson NB (1973) Pyrethrum for Control of Agricultural Insects In Pyrethrum: The Natural Insecticide (Casida JE, ed), pp. 261–279, Academic Press
 5. Orenstein AJ (1913) Mosquito Catching in Dwellings in the Prophylaxis of Malaria. Am. J. Public Health 3, 106–110
 6. "The Prevention of Yellow Fever". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-05.
 7. Staudinger H and Ruzicka L (1924) Substances for killing insects I. The isolation and constitution of effective parts of dalmatian insect powder. Helv. Chim. Acta 7, 177–201
 8. "Constituents of pyrethrum flowers; the partial synthesis of pyrethrins and cinerins and their relative toxicities". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-05.
 9. Kawamoto M et al. (2020) Total Syntheses of All Six Chiral Natural Pyrethrins: Accurate Determination of the Physical Properties, Their Insecticidal Activities, and Evaluation of Synthetic Methods. J. Org. Chem 85, 2984–2999
 10. Van Timmeren S and Isaacs R (2013) Control of spotted wing drosophila, Drosophila suzukii, by specific insecticides and by conventional and organic crop protection programs. Crop Prot. 54, 126–133
 11. Korunić Z et al. (2020) Evaluation of diatomaceous earth formulations enhanced with natural products against stored product insects. J. Stored Prod. Res 86, 101565
 12. Demoute J-P (1989) A brief review of the environmental fate and metabolism of pyrethroids. Pestic. Sci 27, 375–385
 13. "Chemical diversity of the natural populations of Dalmatian pyrethrum (Tanacetum cinerariifolium (TREVIR.) SCH.BIP.) in Croatia". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-05.
 14. "Distribution of pyrethrins in oil glands and leaf tissue of Chrysanthemum cinerariaefolium". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-05.
 15. "High diversity of natural Dalmatian pyrethrum". researchgate.net. Retrieved 2024-03-06.
 16. "tanacetum-cinerariifolium". gardenia.net. Retrieved 2024-03-06.
 17. "Tanacetum cinerariifolium". powo.science.kew.org. Retrieved 2024-03-05.
 18. 18.0 18.1 "Process for the extraction of pyrethrins from pyrethrum flowers". patents.google.com. Retrieved 2024-03-07.
 19. "General Information on Pyrethrum, Pyrethrins and Pyrethroids". infonet-biovision.org. Retrieved 2024-03-07.
 20. "Pyrethrins and pyrethroids". sciencedirect.com/. Retrieved 2024-03-05.
 21. 21.0 21.1 21.2 21.3 Pohanish, Richard P. (2015-01-01), Pohanish, Richard P. (ed.), "P", Sittig's Handbook of Pesticides and Agricultural Chemicals (Second Edition) (in ఇంగ్లీష్), Oxford: William Andrew Publishing, pp. 629–724, ISBN 978-1-4557-3148-0, retrieved 2022-01-12
 22. PubChem. "Cinerin I". pubchem.ncbi.nlm.nih.gov (in ఇంగ్లీష్). Retrieved 2021-10-26.
 23. PubChem. "Pyrethrin II". pubchem.ncbi.nlm.nih.gov (in ఇంగ్లీష్). Retrieved 2021-10-26.
 24. American Conference of Governmental Industrial Hygienists, Inc. Documentation of the Threshold Limit Values and Biological Exposure Indices. 6th ed. Volumes I, II, III. Cincinnati, OH: ACGIH, 1991., p. 1324
 25. "Chapter 39 - Pyrethrins and Pyrethroids". sciencedirect.com. Retrieved 2024-03-05.
 26. "ToxFAQs™ for Pyrethrins and Pyrethroids". cdc.gov. Retrieved 2024-03-05.