హైడ్రోకార్బన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీథేన్ అణువు యొక్క బంతి పుల్లల నమూనా. మీథేన్ సమజాత శ్రేణి గల ఆల్కేను. దీనిలో ఏక బంధాలు మాత్రమే ఉన్నాయి.

హైడ్రోకార్బన్ అన్న మాటకి తెలుగులో సమానార్థకం "ఉదకర్బనం." ఉదకర్బనాలలో కొన్నింటిని యంత్రాలలో ఇంధనంగా వాడతారు. ఉదాహరణకి మెతేను, ఎతేను వాయువులు ఈ జాతివే. దీపాలు వెలిగించుకుందికి వాడే కిరసనాయిలు, కార్లలో వాడే గేసలీను (పెట్రోలు) ఈ జాతివే. ఇది పూర్తిగా హైడ్రోజన్, కార్బన్ లతో కూడిన సేంద్రియ సమ్మేళనం.ఈ హైడ్రోకార్బన్ లు ఇంధనాలు లూబ్రికెంట్ లు, ప్లాస్టిక్ లు, ఫైబర్ లు, రబ్బర్ లు, సాల్వెంట్ లు, పేలుడు పదార్థాలు పారిశ్రామిక రసాయనాల ఉత్పత్తికి ముడిపదార్థాలుగా పనిచేస్తాయి[1]. హైడ్రోజన్ (H), కార్బన్ (C) అణువులతో కూడిన నిర్మాణాలు సాధారణ హైడ్రోకార్బన్ సమ్మేళనాలలో ఉంటాయి. సాధారణంగా హైడ్రోకార్బన్లు రంగులేని వాయువులు, ఇవి చాలా బలహీనమైన వాసనలను కలిగి ఉంటాయి. హైడ్రోకార్బన్ లు సరళమైన లేదా సాపేక్షంగా సంక్లిష్టనిర్మాణాలను కలిగి ఉంటాయి, సాధారణంగా ఆల్కేన్ లు, ఆల్కేన్ లు, ఆల్కైన్ లు, ఈ మూడిటికీ చెందని అనే నాలుగు ఉపవర్గాలుగా వర్గీకరించబడతాయి. ఈ సమ్మేళనాల అణు ఫార్ములా CxHy. హైడ్రోకార్బన్ల ఉనికి మొక్కలు చెట్లలో కనిపిస్తుంది. ఉదాహరణకు కెరోటీన్స్ అనేది ఒక సేంద్రియ వర్ణకం, ఇది ఆకుపచ్చ నిమ్మ , క్యారెట్ లో ఉంటుంది. ఈ హైడ్రోకార్బన్లు సహజ ముడి రబ్బరులో 98% వరకు ఉంటాయి. వాటి యొక్క విభిన్న అణు నిర్మాణాల కారణంగా, హైడ్రోకార్బన్ ల అనుభావిక ఫార్ములా కూడా ఒకదానితో మరొకటి భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు ఆల్కేనులు, ఆల్కైనులు, ఆల్కైనులు, ఆల్కైనులు, ఆల్కైనులలో బంధిత హైడ్రోజన్ మొత్తము తగ్గుతుంది. దీనికి ముఖ్యకారణం కార్బన్ యొక్క "స్వీయ-బంధం" లేదా ద్విబంధాలు లేదా త్రిపుల్ బంధాలు ఏర్పడటం ద్వారా హైడ్రోకార్బన్ యొక్క సంపూర్ణ సంతృప్తీకరణను నిరోధిస్తుంది. హైడ్రోకార్బన్ల యొక్క సామర్థ్యాన్ని కేటనేషన్ అంటారు. ఇటువంటి సామర్థ్యాలతో, ఇవి సైక్లోహెక్సేన్ వంటి మరింత సంక్లిష్ట అణువులను ఏర్పరుస్తుంది, అరుదైన సందర్భాల్లో బెంజీన్ వంటి సుగంధ హైడ్రోకార్బన్లను ఏర్పరుస్తుంది.హైడ్రోకార్బన్లను విడదీయటం అనేది బరువైన కర్బన అణువులను తేలికైన అణువులుగా విభజించే ప్రక్రియ. తగినంత మొత్తంలో వేడిమరియు పీడనాన్ని అందించడం ద్వారా ఈ పక్రియ సాధించబడుతుంది. కొన్నిసార్లు ఉత్ప్రేరకాలు ప్రతిచర్యను వేగవంతం చేయడానికి ఉపయోగిస్తారు. డీజిల్ ఇంధనం, గ్యాసోలిన్ యొక్క వాణిజ్య ఉత్పత్తిలో ఈ ప్రక్రియ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.చమురు శుద్ధి కర్మాగారాలు హైడ్రోకార్బన్‌ల ఉపయోగం కోసం ప్రాసెస్ చేయబడతాయి. ముడి చమురు అనేక దశలలో ప్రాసెస్ చేయబడి కావలసిన హైడ్రోకార్బన్‌లను ఏర్పరుస్తుంది వీటిని ఇంధనంగా ఇతర ఉత్పత్తులలో ఉపయోగిస్తారు[2].

కార్బోహైడ్రేట్ అన్న మాటకి తెలుగులో సమానార్థకం "కర్బనోదకం." కర్బనోదకాలలలో కొన్ని జీవుల శరీరాలలో ఇంధనంగా పని చేస్తాయి. ఉదాహరణకి పిండి పదార్థాలు ఈ జాతివే. గ్లూకోజు, సెల్యులోజు కూడా ఈ జాతివే.

మూలాలు

[మార్చు]
  1. "Hydrocarbon - an overview | ScienceDirect Topics". www.sciencedirect.com. Retrieved 2020-08-25.
  2. Farooq, Umar. "Hydrocarbons - Types, Classification, Properties, Preparation, Uses". BYJUS (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-25.