నికోటిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నికోటిన్
Top: Concentrated nicotine liquid

Bottom left: Skeleton representation of a nicotine molecule Bottom right: Ball-and-stick model of a nicotine molecule

వ్యవస్థాత్మక (IUPAC) పేరు
3-[(2S)-1-methylpyrrolidin-2-yl]pyridine
Clinical data
వాణిజ్య పేర్లు Nicorette, Nicotrol
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
ప్రెగ్నన్సీ వర్గం D (AU) D (US)
చట్టపరమైన స్థితి Dangerous Poison (S7) (AU) Unscheduled (CA) GSL (UK) OTC (US) Unscheduled (UN) Unscheduled (EU)
Dependence liability Physical: low
Routes Inhalation; insufflation; oral – buccal, sublingual, and ingestion; transdermal; rectal
Pharmacokinetic data
Protein binding <5%
మెటాబాలిజం Primarily hepatic: CYP2A6, CYP2B6, FMO3, others
అర్థ జీవిత కాలం 1–2 hours; 20 hours active metabolite
Excretion Renal, urine pH-dependent;[1]
10–20% (gum), 30% (inhaled); 10–30% (intranasal)
Identifiers
CAS number 54-11-5 checkY
ATC code N07BA01 QP53AX13
PubChem CID 89594
IUPHAR ligand 2585
DrugBank DB00184
ChemSpider 80863 checkY
UNII 6M3C89ZY6R checkY
KEGG D03365 checkY
ChEBI CHEBI:18723 checkY
ChEMBL CHEMBL3 checkY
PDB ligand ID NCT (PDBe, RCSB PDB)
Chemical data
Formula C10H14N2 
 • c1ncccc1[C@@H]2CCCN2C
 • InChI=1S/C10H14N2/c1-12-7-3-5-10(12)9-4-2-6-11-8-9/h2,4,6,8,10H,3,5,7H2,1H3/t10-/m0/s1 checkY
  Key:SNICXCGAKADSCV-JTQLQIEISA-N checkY

Physical data
Density 1.01 g/cm³
Melt. point -79 °C (-110 °F)
Boiling point 247 °C (477 °F)

నికోటిన్ అనేది డైనిట్రోజెన్ ఆల్కలాయిడ్, ఇది పొగాకు మొక్క (నికోటియానా టాబాకమ్) యొక్క ఎండిన ఆకులలో 3% కంటే ఎక్కువశాతం లో ఉంటుంది. ఇది "అజ్టెక్ పొగాకు" (N.Rustica)లో ఇంకా ఎక్కువ శాతం లో (14% వరకు) ఉంది. [2]నికోటిన్ అనేది అన్ని పొగాకు ఉత్పత్తులు మరియు కొన్ని ఇ-సిగరెట్ ద్రవాలలో కనిపించే పదార్థం. నికోటిన్ అనేది అత్యంత వ్యసనపరుడైన పదార్థం, ఇది పొగాకు మొక్కలో సహజంగా ఉంటుంది. ప్రయోగశాలలు నికోటిన్‌ను కృత్రిమంగా కూడా ఉత్పత్తి చేయగలవు. [3] నికోటిన్ శరీరంలో ప్రవేశించిన తాత్కాలికగా ఉల్లాసమైన మరియు ఉత్సహాన్ని వెంటనే సృష్టిస్తుంది మరియు హృదయ స్పందన రేటు మరియు గుండె ఉపయోగించే ఆక్సిజన్ మొత్తాన్ని పెంచుతుంది. నికోటిన్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, ఇది ఎండార్ఫిన్ల పెరుగుదలకు కారణమవుతుంది, ఎండార్ఫిన్లు ఒత్తిడి మరియు నొప్పిని తగ్గించడానికి మరియు మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడే రసాయనాలు.

చరిత్ర[మార్చు]

నికోటిన్, 1828లో పొసెల్ట్ మరియు రీమాన్‌లచే పొగాకు ఆకుల నుండి మొదటిసారిగా వేరుచేయబడింది.[4]1571 నాటికి క్రూడ్ నికోటిన్ ఉనికి గురించిన సమాచారం తెలిసినది.మరియు 1828నాటికి శుద్ధి చేసిన నికోటిన్ సమ్మేళనాన్ని ఉత్పత్తిచేశారు.నికోటిన్ సమ్మేళన రసాయన సూత్రం 1843లో నిర్థారణ చేశారు మొదటి సారి ప్రయోగశాల సంశ్లేషణ 1904లో జరిగినది .నికోటిన్ కొన్ని ద్రవ ఆల్కలాయిడ్స్‌లో ఒకటి.[5]నికోటిన్ కు ఈ పేరు పొగాకు నుండి వచ్చినది.పొగాకు మొక్క శాస్త్రీయ పేరు నికొటియనా టబుకం. మొట్టమొదట ఈ రసయనిక సమ్మేళనం పొగాకుమొక్క లో కనుగొని,వేరుచెయ్యడం వల్ల,పొగాకు శాస్త్రీయ పేరు లోని నికోటీయనా నుండి నికోటిన్ అనే పదం రూపొందించారు.16వ శతాబ్దంలో పోర్చుగల్ నుండి ఫ్రాన్స్‌కు పొగాకు విత్తనాలను పరిచయం చేసిన ఫ్రెంచ్ దౌత్యవేత్త జీన్ నికోట్‌కు నివాళులర్పిస్తూ, లిన్నెయస్ పొగాకుకు నికోటియానా అనే పేరు పెట్టారు. ప్రారంభంలో, లిన్నెయస్ నాలుగు నికోటియానా జాతులను వర్గీకరించాడు,ఇవి అన్ని అమెరికాకు చెందినవి. [6]

భౌతిక గూణాలు[మార్చు]

దాని స్వచ్ఛమైన స్థితిలో ఇది జిడ్డుగల అనుగుణ్యతతో రంగులేని, వాసన లేని ద్రవం, కానీ కాంతి లేదా గాలికి గురైనప్పుడు, అది గోధుమ రంగును పొందుతుంది మరియు పొగాకు యొక్క బలమైన వాసనను ఇస్తుంది. నికోటిన్ యొక్క రసాయన సూత్రంC10H14N2.[5]

నికోటిన్ భౌతిక గుణాల పట్టిక[7]
సంఖ్య గుణం మితి/శాతం
1 ఫార్ములా C10H14N2
2 అణు భారం 162.234గ్రా /mol
3 రంగు వర్ణ రహితం
4 ద్రవీభవన ఉష్ణోగ్రత -79 °C
5 వేపరు ప్రెసరు 0.038 mm /Hg at 25 °C
6 సాంద్రత 1.010
7 మరుగు ఉష్ణోగ్రత 247°C. (1 atm )
8 ద్రావణీయత క్లోరోఫామ్,ఆల్కహాల్,ఈథర్ కిరోసిన్,మరియు నూనెలలో కరుగుతుంది.
9 నీటిలో ద్రావణీయత కరుగుతుంది 60 °Cకన్న తక్కువ వద్ద
10 వాయు సాంద్రత 5.61(గాలి=1)

నికోటిన్ ఉత్పత్తి[మార్చు]

నికోటిన్ పొగాకు మొక్క లోని అన్ని భాగాలు అనగా వేర్లు,కాండం మరియు ఆకులలో వున్నది,అయితే ఆకులలో ఎక్కువగా 2-3 % లభిస్తుంది. అందువలన పొగాకు ఆకులతో చేయు సిగరెట్లలలో నోకోటిన్ ఎక్కువ పరిమాణం లో వుండును.

నోకోటిన్ ను పొగాకు నుండి సాల్వెంటు ఎక్సుట్రాక్షను(solvent extraction)పద్ధతిలో సంగ్రహిస్తారు. నికోటిన్ ను కరిగించుకొనే లక్షణం/స్వభావం వున్న ఒక ద్రావకం/ద్రావణి ని ఉపయోగించి,పొగాకు నుండి నికోటిన్ ను సంగ్రహిస్తారు. నికోటిన్, ఈథర్, ఆల్కహాల్, కిరోసిన్ మరియు క్లోరోఫామ్ వంటి పలు కర్బన /సేంద్రియ ద్రావకాలలో కరుగుతుంది. పారిశ్రామిక స్థాయి ఉత్పత్తిలో సాధారణంగా క్లోరోఫామ్ లేదా ఆల్కహాల్ ఉపయోగిస్తారు.నికోటిన్ పొలారు ద్రావణి అయిన నీటిలో త్వరగా కరుగుతుంది.నికోటిన్ పొగాకులో సాధారణంగా ఆమ్లలవణ రూపంలో(NiCH+) వుండును.అందువలన క్షారం కలిగిన నీటిని పొడి పొగాకు కు కలిపినపుడు అది నీటిలోకి NiC(నికోటిన్)గా విడుదల అవుతుంది. ఇలా నీటిలోకి విడుదల అయిన నికోటిన్ ను క్లోరోఫామ్ ను ద్రావణిగా ఉపయోగించి, అందులో కరిగిస్తారు. ఇప్పుడు నికోటిన్ ఉన్న క్లోరోఫామ్ ను వాక్యూం (పీడన రహితస్థితి)లో డిస్టిలేషన్/శ్వేదన క్రియ చేస్తారు. శ్వేదన క్రియలో తక్కువ మరుగు ఉష్ణోగ్రత కల్గిన క్లోరోఫామ్ త్వరగా ఆవిరి/వాయువుగా మారి,కండెన్సరులకు వెళ్ళుతుంది,నికోటిన్ ద్రవ రూపంలో రియాక్టరులో మిగిలిపోతుంది.[8]

మానవ శరీర భాగాల పై నికోటిన్ ప్రభావం[మార్చు]

నికోటిన్ శరీరంలోని అనేక భాగాలపై ప్రభావం చూపుతుంది. నికోటిన్ మనిషి మెదడులోని కెమిస్ట్రీని మార్చగలదు మరియు మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ మరియు బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది. నికోటిన్ రక్త నాళాలను అడ్డుకుంటుంది, ఇది పోషకాలు చర్మానికి చేరకుండా నిరోధిస్తుంది. ఇది అకాల వృద్ధాప్యం మరియు ముడతలకు కారణం కావచ్చు. హృదయ స్పందన రేటు మరియు రక్తపోటు పెరుగుదలతో పాటు, నికోటిన్ ధమనులను తగ్గిస్తుంది, ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. సిగరెట్లు తాగడం లేదా ఆవిరిని ఇచ్చు ఇన్‌హేలర్ ఉపయోగించడం వల్ల కాలక్రమేణా మానవ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది, ఇది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి అనారోగ్యాలను కూడా కలిగిస్తుంది. [9]ఆరోగ్య నిపుణులు నికోటిన్ ప్రమాదాల గురించి హెచ్చరిస్తూనే ఉన్నారు,నికోటిన్ కల్గిన పదార్థాలు తీసుకోవడం వలన ,మనషు ల్లో ప్రత్యేకించి, మెదడు అభివృద్ధి చెందుతున్న యుక్తవయస్కులు(25 ఏళ్లవరకు) ఉపయోగించినప్పుడు, శ్రద్ధ, జ్ఞాపకశక్తి, అభ్యాసం మరియు మెదడు ప్లాస్టిసిటీలో పాత్ర పోషించే మెదడులోని భాగాలపై నికోటిన్ ప్రతికూలంగా ప్రభావం కల్గిస్తుంది .

1950వ దశకంలో, పరిశోధకులు ఇప్పటికే ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులతోకు పొగాకు ధూమపానం కారణం అని గుర్తించారు . 1970ల నాటికి, నికోటిన్ చాలా వ్యసనపరుడైన పదార్థమని కనుగొన్నారు. . [10]1970ల నుండి, ధూమపానాన్ని నియంత్రించడానికి మరియు ధూమపానం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి యునైటెడ్ స్టేట్స్‌లో అనేక ప్రధాన చట్టాలు ఉన్నాయి. [11]ఇప్పటికీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో 1.3 బిలియన్ల మంది పొగాకు ధూమపానం చేస్తున్నారు.

నికోటిన్ ఉపయోగాలు[మార్చు]

నికోటిన్ ఎసిటైల్‌కోలిన్‌ను అనుకరించడం మరియు నికోటినిక్ ఎసిటైల్‌కోలిన్ రిసెప్టర్‌లకు బైండింగ్ చేయడం ద్వారా డోపమైన్, సెరోటోనిన్ మరియు ఎసిటైల్‌కోలిన్ వంటి డిశ్చార్జ్ న్యూరోట్రాన్స్‌మిటర్‌లను ప్రోత్సహిస్తుంది, ఇవి అభిజ్ఞా చర్యలలో పాల్గొంటాయి . నికోటిన్ యాంటిడిప్రెసెంట్ లక్షణాలను కలిగిస్తుంది. అల్జీమర్స్ వ్యాధిని నియంత్రణ చేస్తుంది. స్కిజోఫ్రెనియా వ్యాధి అభిజ్ఞా సమస్యలను కలిగి ఉంటుంది, ఇది నికోటిన్ వాడకం ద్వారా మెరుగుపరచబడుతుంది. [12]

ఇవికూడా చూడండి[మార్చు]

1.పొగాకు

మూలాలు[మార్చు]

 1. Landoni JH. "Nicotine (PIM)". INCHEM. International Programme on Chemical Safety. Retrieved 29 January 2019.
 2. "nicotine". acs.org. Retrieved 2014-02-03.
 3. "Everything you need to know about nicotine". medicalnewstoday.com. Retrieved 2014-02-03.
 4. "Medicinal uses of tobacco in history". ncbi.nlm.nih.gov. Retrieved 2014-02-02.
 5. 5.0 5.1 "nicotine". britannica.com. Retrieved 2014-02-02.
 6. "Nicotine: From Discovery to Biological Effects". ncbi.nlm.nih.gov. Retrieved 2014-02-04.
 7. "properties of nicotine". chm.bris.ac.uk. Retrieved 2014-02-03.
 8. "Extraction of nicotine". proquest.com. Retrieved 2014-02-04.
 9. "What Nicotine Does to Your Body". verywellmind.com. Retrieved 2014-02-03.
 10. "Historical and current prospectives on tobacco". cell.com. Retrieved 2014-02-03.
 11. "tobacco control milestones". lung.org. Retrieved 2014-02-03.
 12. "12 Unexpected Nicotine Health Benefits". newhealthadvisor.org. Retrieved 2014-02-03.
"https://te.wikipedia.org/w/index.php?title=నికోటిన్&oldid=4177370" నుండి వెలికితీశారు