Jump to content

రసాయన సూత్రం

వికీపీడియా నుండి
హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క రసాయన సూత్రం, H2O2
మీథేన్ యొక్క రసాయన ఫార్ములా, CH4
అణువుల మధ్య బంధం చూపిస్తున్న గ్లూకోజ్ యొక్క రసాయన సూత్రం

రసాయన సూత్రం లేదా కెమికల్ ఫార్ములా అనేది రసాయన శాస్త్రవేత్తలు అణు సమదాయాన్నిను వర్ణించే ఒక మార్గం. ఈ ఫార్ములా అణువు గురించి ఆ అణువు ఏమిటి, పరమాణువులో ఏ రకం ఎన్ని ఉన్నాయి అని తెలియజెప్పుతుంది. కొన్నిసార్లు ఈ సూత్రం అణువులు ఎలా ముడిపడి ఉంటాయో చూపిస్తుంది, కొన్నిసార్లు ఈ సూత్రం అణువులు స్పేస్‌లో ఎలా అమరి ఉంటాయో చూపిస్తుంది. ఫార్ములాలోని అక్షరం ప్రతి అణువు ఏమి రసాయనిక మూలకం అని చూపిస్తుంది. ఈ ఫార్ములాలోని ఉపలిపి అణువు యొక్క ప్రతి రకం యొక్క సంఖ్యను చూపిస్తుంది. ఉదాహరణకు, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫార్ములా H2O2. మీథేన్ ఒక కార్బన్ (C) అణువు, నాలుగు ఉదజని అణువులను కలిగి ఉంటుంది; దీని రసాయన ఫార్ములా CH4. చక్కెర అణువు గ్లూకోజ్ ఆరు కార్బన్ అణువులు, పన్నెండు హైడ్రోజన్ అణువులు, ఆరు ఆక్సిజన్ అణువులు కలిగి ఉంటుంది, కాబట్టి దాని రసాయన ఫార్ములా C6H12O6. రసాయనిక సూత్రాలు రసాయనిక చర్యలను వివరించడానికి రసాయన సమీకరణాలలో ఉపయోగిస్తారు. 19వ శతాబ్దపు స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త జాన్స్ జాకబ్ బెర్జిలియస్ రసాయనిక సూత్రాలు రాయడం కోసం ఈ వ్యవస్థా పనిని చేపట్టాడు.