చెమట
చెమట లేదా స్వేదం (Sweat) క్షీరదాలలోని చర్మం నుండి ఉత్పత్తి చేయబడిన ఒకరకమైన స్రావం. ఇవి చర్మంలోని స్వేద గ్రంధుల నుండి తయారౌతుంది. దీనిలో ముఖ్యంగా నీరు, వివిధ లవణాలతో (ముఖ్యంగా క్లోరైడ్స్) కలిసి ఉంటాయి.[1] స్వేదంలో కొన్ని దుర్వాసన కలిగించే పరార్ధాలు, కొద్దిగా యూరియా కూడా ఉంటుంది.
చెమట పట్టడం మానవులలో ఒక విధంగా ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం. అయితే పురుషుల స్వేదంలో కామ ప్రకోపాన్ని అధికం చేసే లక్షణాలున్నట్లుగా కనుగొన్నారు[2]. చర్మం మీది చెమట ఆవిరిగా మారినప్పుడు శరీరం చల్లబడుతుంది. ఉష్ణ ప్రదేశాలలో శరీర వ్యాయామం చేసేటప్పుడు ఎక్కువ చెమట పడుతుంది. చెమట మానసిక ఒత్తిడి వలన ఎక్కువౌతుంది. చల్లని వాతావరణంలో తక్కువగా ఉంటుంది. స్వేద గ్రంధులు తక్కువగా ఉండే కుక్క వంటి కొన్ని జంతువులలో ఇలాంటి ఉష్ణోగ్రత నియంత్రణ నాలుక, నోటి గ్రంధుల ద్వారా జరుగుతుంది.
చెమట కొన్ని ప్రదేశాలలో ఎక్కువగా ఏర్పడుతుంది. తల, చంకలు, ముఖంలో స్వేద గ్రంధులు ఎక్కువగా ఉండడం వలన ఈ ప్రదేశాలలో చెమట పడుతుంది.
స్వేద గ్రంధులు
[మార్చు]స్వేద గ్రంధులు స్వేదాన్ని తయారుచేసే గ్రంధులు.
- ఎపోక్రైన్ స్వేద గ్రంధులు (Apocrine sweat glands) : ఇవి చంకలో ఎక్కువగా ఉంటాయి. వీనిలో వక్షోజాలు కూడా ఒక రకమైనవి.
- ఎక్రైన్ స్వేద గ్రంధులు (Eccrine sweat glands) : ఇవి శరీరమంతా ఉండి, దేహాన్ని చల్లబరచడానికి ఉపకరిస్తాయి.
సమస్యలు
[మార్చు]- ఎక్కువ చెమట
- కొంతమందికి చెమట ఎక్కువగా ఉండే చంకలలో దుర్వాసన ఉంటుంది. ఇది సామాన్యంగా బాక్టీరియా మూలంగా కలుగుతుంది.
- తక్కువ చెమట
- చాలా తక్కువ మందిలో అసలు చెమట పట్టదు.
మూలాలు
[మార్చు]- ↑ SIMULTANEOUS STUDY OF CONSTITUENTS OF URINE AND PERSPIRATION" Archived 2019-09-18 at the Wayback Machine, H. H. MOSHER, The Journal of Biological Chemistry 16 November 1932
- ↑ Smelling a single component of male sweat alters levels of cortisol in women", C. Wyart et al., Journal of Neuroscience, February 7, 2006