చర్మము
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
చర్మము (Skin) మన శరీరంలో అతిపెద్ద అవయవము. దీనిలో మూడు ముఖ్యమైన పొరలుంటాయి. చర్మము శరీరమంతా కప్పి లోపలి భాగాల్ని రక్షిస్తుంది. నవరంధ్రాలవద్ద చర్మం లోపిస్తుంది. ఇది వివిధ రంగులలో ఉంటుంది. చర్మానికి సంబంధించిన విజ్ఞాన శాస్త్రాన్ని 'డెర్మటాలజీ' అంటారు.
నిర్మాణం[మార్చు]
చర్మంలో ముఖ్యంగా బాహ్యచర్మం, అంతశ్చర్మం అనే రెండు పొరలుంటాయి. బాహ్యచర్మం బహిస్త్వచం నుంచి ఏర్పడుతుంది. రోమాలు, స్వేద గ్రంధులు బాహ్యచర్మానికి చెందినవి. గోళ్ళు కూడా దీనినుంచే ఏర్పడతాయి.
ధర్మాలు[మార్చు]
- పరిసరాల వాతావరణమునుండి, సూక్ష్మక్రిములనుండి శరీరభాగాల్ని రక్షించడం.
- స్పర్శ జ్ఞానాన్ని (Touch sensation) కలుగజేయడం.
- నీరు చర్మంద్వారా చెమట రూపంలో పోతుంది. చర్మంలోని రక్తనాళాల సంకోచ వ్యాకోచాల ద్వారా నీటినష్టాన్ని నిరోధిస్తుంది.
- శరీర ఉష్ణోగ్రతను వివిధకాలాల్లొ స్థిరంగా ఉంచడం.
- కొన్ని విటమిన్లు తయారుకావడానికి చర్మం ఉపయోగపడుతుంది.
వర్ణభేదం[మార్చు]
ఆఫ్రికా దేశీయులు నల్లగా ఉంటారు. ఉత్తర ఐరోపా దేశీయులు తెల్లగా ఉంటారు. ఆసియా మరికొన్ని ప్రాంతాల ప్రజలు వీరిరువురి మధ్యలో ఉంటారు. ఈ వర్ణభేదాలకు కారణం చర్మంలోని 'మెలనిన్' అనే రంగుపదార్ధం.low melanin is called albuns.
వ్యాధులు[మార్చు]
- శిలీంద్ర చర్మవ్యాధులు
- చుండ్రు
- మొటిమలు
- తామర వంటి శిలీంద్ర సంబంధిత వ్యాధులు.
- గజ్జికురుపు
- గోరుచుట్టు
- కాన్సర్ - సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలు దీనికి కారణం.
- పుట్టుమచ్చలు
- బొల్లి
- ముఖము మీద మచ్చలు
- దద్దుర్లు
- అలెర్జీలు
- తామర
జంతువుల చర్మం (తోలు)[మార్చు]
- కొన్ని జంతువుల చర్మంతో బట్టలు, సంచులు మొదలగునవి తయారుచేస్తారు. వీటికోసం జంతువులను చంపడం చట్టారీత్యా నేరమైనా కోట్లల్లో వ్యాపారం దీనివల్ల జరుగుతుంది.
మూలాలు[మార్చు]
![]() |
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో చర్మముచూడండి. |
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.