గోరుచుట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గోరుచుట్టు చేతి లేదా కాలి వేలి గోరు కుదుళ్ళలో చీముపట్టి చాలా బాధించే వ్యాధి. ఇది బాక్టీరియా లేదా శిలీంద్రాల వలన సంక్రమిస్తుంది. చీము ఎక్కువగా ఉన్నచో చిన్న గంటు పెట్టి దాన్ని తొలగించవలసి వస్తుంది.

గోర్లు నోటితో కొరికేవారిలో చిన్న గాయంతో ఇది మొదలవుతుంది. ఎక్కువగా నీటితో, ఆహార పరిశ్రమలో పనిచేసేవారిలో, గోరు మూలల్లో మురికి పట్టియున్నవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలెక్కువ.

గ్రహణం సమయంలో వేలుతో చూపిస్తే గోరుచుట్టు వస్తుందని మూఢ నమ్మకం ఉంది.