డి.కె.చౌట
దర్బే కృష్ణానంద చౌట | |
---|---|
జననం | 1 జూన్ 1938 |
మరణం | 19 జూన్ 2019 (aged 81) బెంగళూరు, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
పౌరసత్వం | భారతదేశం |
దర్బే కృష్ణానంద చౌట (1938 జూన్ 1 - 2019 జూన్ 19)[1] భారతదేశ వ్యాపారవేత్త, రచయిత, కళాకారుడు, రంగస్థల నటుడు. [2] అతను మరణించే నాటికి కర్ణాటక చిత్రకళా పరిషత్ [3][4] కు ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడు. [5][6]
వ్యక్తిగత జీవితం
[మార్చు]డా. డి.కె.చౌట కేరళ రాష్ట్రం లోని మంజీశ్వర్ సమీపంలో గల దర్బే మీయప్పాడౌ గ్రామంలో జన్మించాడు. [2] అతనికి ఇద్దరు పిల్లలు. వారిలో సందీప్ చౌట సంగీతకారునిగా, ప్రజ్ఞా చౌట ఎత్నోగ్రాఫర్ గా ఉన్నారు. [7]
వృత్తి జీవితం
[మార్చు]ముంబై విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత అతను అనేక సంవత్సరాలు ఘనా, నైజీరియా, లండన్ లలో జీవితాన్ని గడిపాడు. [2] తరువాత బెంగళూరు వచ్చి పరిశ్రమలు, ఎగుమతులు, కంట్రీ క్లబ్స్, వివిధ వ్యాపారాలను చేసి తన జీవితాన్ని కొనసాగించాడు. దీని ఫలితంగా అతను ఎం/ఎస్ పవర్ గేర్ లిమిటెడ్, ఎం/ఎస్ పి.సి. ఎక్స్‌పోర్ట్స్, సన్ వాలీ క్లబ్ వంటి కంపెనీలను స్థాపించాడు. ఎం/ఎస్ పి.సి. ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ ఐదుసార్లు ఎక్స్‌పోర్ట్ ప్రొమోషన్ కౌన్సిల్ చే అవార్డులు పొందింది. వ్యాపార కార్యక్రమాలతో పాటు అతను సమాజ సేవ కూడా చేసేవాడు.
సాహిత్యం
[మార్చు]డా. చౌట "ఆనంద కృష్ణ" అనేకలం పేరుతో రచనలు చేసేవాడు. [2] అతని సాహితీ సేవలలో "కరియవజ్జెరెన కథెక్కులు", "ప్లిలిపతిగదసు" అనే నాటకాలకు కర్ణాటక ప్రభుత్వ తుళు సాహిత్య అకాడమీ పురస్కారాలు అందజేసింది. [8] అతని ఇతర రచనలలో పట్టు పజ్జెలు, డర్మెట్టిమాయె, యూరి ఉష్ణద మాయే, మిట్టబైలు యమునక్క" ముఖ్యమైనవి. [5] అతనికి మంగుళూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. [5]
మూలాలు
[మార్చు]- ↑ "Mangaluru: Veteran theatre personality, author Dr D K Chowta passes away". Archived from the original on 2019-06-21. Retrieved 2019-07-07.
- ↑ 2.0 2.1 2.2 2.3 Praveen Shivashankar (25 October 2013). "Keeping Tulu close to heart". No. Friday Review. The Hindu. Retrieved 14 December 2014.
- ↑ Muralidhar Khajane (24 April 2014). "Chitrakala Parishath set to revive leather puppetry". The Hindu. Retrieved 14 December 2014.
- ↑ "Executive Committee Members". Chitrakala Parishath. Archived from the original on 14 డిసెంబరు 2014. Retrieved 14 December 2014.
- ↑ 5.0 5.1 5.2 Special Correspondent (29 April 2011). "Honorary doctorate for Bannanje, D.K. Chowta, Ajai Kumar Singh". The Hindu. Archived from the original on 28 సెప్టెంబరు 2013. Retrieved 3 January 2012.
- ↑ Anuradha Vellat (29 January 2014). "A coffee book table on art". Deccan Herald. Bangalore. Retrieved 17 February 2014.
- ↑ Savitha Karthik, (28 October 2010). "May we have the trumpets please". Deccan Herald. Retrieved 3 January 2012.
{{cite news}}
: CS1 maint: extra punctuation (link) - ↑ Staff Correspondent (19 March 2011). "Chowta, Shantharam get Tulu academy awards". The Hindu. Archived from the original on 12 ఏప్రిల్ 2011. Retrieved 3 January 2012.
బయటి లంకెలు
[మార్చు]- Pages using infobox person with unknown parameters
- Infobox person using residence
- Commons category link is on Wikidata
- 1938 జననాలు
- 2019 మరణాలు
- కేరళ వ్యక్తులు
- భారతీయ రచయితలు
- భారతీయ వ్యాపారవేత్తలు
- ముంబై విశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థులు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers