Jump to content

శ్రీరంగపట్నం సంధి

వికీపీడియా నుండి
జనరల్ లార్డ్ కార్న్‌వాలీస్ టిప్పు సుల్తాన్ కుమారుల్ని యుద్ధషరతుల అమలయ్యేందుకు తాకట్టైన బందీలుగా స్వీకరించడం, రాబర్ట్ హోమ్ చిత్రం, c. 1793

శ్రీరంగపట్నం సంధి, మార్చి 18, 1792లో మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధానికి ముగింపు పలుకుతూ సంతకం చేశారు. దీనికి ఇరుపక్షాలుగా బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ తరఫున లార్డ్ కారన్ వాలీసు, హైదరాబాద్ నిజాం, మరాఠా సామ్రాజ్యాల ప్రతినిధులు, మైసూరు పరిపాలకునిగా టిప్పు సుల్తాన్ ఉన్నారు.

నేపథ్యం

[మార్చు]

మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం 1789 చివర్లో ప్రారంభమైంది, మైసూరు సామ్రాజ్య పాలకుడు ఈస్టిండియా కంపెనీ మిత్రరాజ్యమైన ట్రావెన్‌కోర్‌పై దాడిచేశారు. రెండు సంవత్సరాల పోరాటం తర్వాత లార్డ్ చార్లెస్, 2వ ఎర్ల్ కార్న్‌వాలీసు ఆధ్వర్యంలోని సేనలు, బ్రిటీషర్ల మిత్రరాజ్యాలైన మరాఠా సామ్రాజ్యం, హైదరాబాద్ కలిసి 1792లో మైసూరు రాజ్యపు రాజధానియైన శ్రీరంగపట్నం ముట్టడి ప్రారంభించారు.[1] అయితే అన్ని విధాలా గొప్ప వ్యయంతో సాధ్యమయ్యే గొప్ప దాడికి ప్రయత్నం చేయడం కాక, కారన్ వాలీస్ ఈ ఘర్షణను అంతంచేసే చర్చలకు దిగారు. తత్ఫలితమైన సంధి పత్రాలపై మార్చి 19న సంతకాలు జరిగాయి. నిరంతరంగా సాగిన మైసూరు ప్రమాదానికి అంతం పలుకుతూ శాంతికి వీలుకల్పించేదే కాక, హైదరాబాద్, మరాఠాల నడుమ కూడా ఘర్షణను ముగించేదిగా ఉండాలని ఆశించారు. ఐతే తుదకు మరాఠాలు సంధి ఒప్పందాల్లో అటువంటి పదజాలాలను అంగీకరించలేదు.[2]

ఒప్పందం

[మార్చు]
జేమ్స్ రెన్నెల్ తయారు చేసిన 1800నాటి భౌగోళిక పటం, రంగులతో సంకేతించిన రాజకీయ ప్రాంతాలు, బ్రిటీష్ ఈస్టిండియా యుద్ధాలు, కంపెనీ శ్రీరంగపట్నం సంధి వల్ల పొందిన భూములు కలిగివుంది

ఒప్పందంలోని షరతుల్లో భాగంగా సంధిలోని ఇతర పక్షాలకు మైసూరు తన భూభాగాల్లోని సగపాలు వదులుకుంది. పీష్వా తుంగభద్ర నది వరకు ఉన్న భూభాగం స్వీకరించగా, నిజాం కృష్ణా నది నుంచి పెన్నా నది వరకూ, పెన్నా దక్షిణ తీరానికి చెందిన కడప, గండికోట కోటలు పొందారు. ఈస్టిండియా కంపెనీ ట్రావెన్‌కోర్ రాజ్యం, కాళీ నదులకు నడుమన మైసూరుకు చెందిన మలబార్ తీరంలోని అత్యధిక భూభాగాలు, బారామహల్, దిండిగల్ జిల్లా మొదలైన ప్రాంతాలు తీసుకుంది.[3] మైసూర్ కూర్గ్ రాజాకి దాని స్వాతంత్ర్యాన్ని పొందింది, [4] ఐతే కూర్గ్ మాత్రం ప్రధానంగా కంపెనీపైనే ఆధారపడింది. టిప్పుసుల్తాన్, మైసూర్‌కు విధింపబడిన షరతులు, సక్రమంగా నెరవేర్చేందుకు యుద్ధఖైదీలుగా అప్పగించారు.[4]

మూలాలు

[మార్చు]
  1. Dodwell, pp. 336-337
  2. Fortescue, p. 712
  3. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (కందనూరు నవాబు రాజరికం) (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
  4. 4.0 4.1 Dodworth, p. 337