వడక్కునాథన్ దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వడక్కునాథన్ దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:కేరళ
జిల్లా:త్రిసూర్
ప్రదేశం:త్రిసూర్
నిర్మాణశైలి, సంస్కృతి
నిర్మాణ శైలి:కేరళ శైలి
చరిత్ర
నిర్మాత:పరుశరాముడు

వడక్కునాథన్ దేవాలయం కేరళ రాష్ట్రంలో త్రిసూర్ లో ఈ దేవాలయం ఉంది.కేరళలోని పురాతన ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.[1]

ఆలయ చరిత్ర[మార్చు]

ఇతిహాసాల్లో ఈ ఆలయాన్ని పరశురాముడు నిర్మించినట్లు తెలుస్తోంది. ఇరవై ఒక్క తరాల క్షత్రియులను నిర్మూలించేందుకు పరశురాముడు తాను చేసిన కర్మల నుండి విముక్తి పొందుటకు ఒక యజ్ఞం చేసి, తన భూమినీ మొత్తాన్ని బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు. అతను ధ్యాన తపస్సు చేయటానికి ఒక కొత్త స్థలాన్ని సముద్రాల ప్రభువు వరుణుడును, నీటి నుండి కొత్త భూమిని తీసుకురావాలని అభ్యర్థించాడు.ప్రసిద్ధ శ్రీముల స్థానం చెట్టు వద్ద కొంతకాలం శివుడి లింగం ఉంది. తరువాత, కొచ్చి రాజ్య పాలకుడు లింగాన్ని మరింత సౌకర్యవంతమైన ప్రదేశానికి మార్చాలని నిర్ణయించి ఆలయంకట్టి ఆ లింగమును ప్రతిష్ఠించాడు.తూర్పున శివ, పార్వతుల విగ్రహాలు, దక్షిణ భాగంలో శ్రీ రామ మందిరం ఉంది. మరొక వివరణ ప్రకారం, కొంతమంది ఋషులు యజ్ఞం చివరలో పరశురాముడును సంప్రదించి, వారికి కొంత ఏకాంత భూమిని ఇవ్వమని కోరారు. అప్పుడు పరశురాముడు వారి తరపున వరుణుడిని అభ్యర్థించగా, వరుణుడు అతనికి ఆరబట్టే విసనకర్రను ఇచ్చి సముద్రంలోకి విసిరేయమని తెలిపినట్లు, అతను అలా చేసినపుడు, సముద్రం నుండి పెద్ద భూమి ఆవిర్భవించిందని, సముద్రం నుండి ఉద్భవించిన ఈ ప్రాంతం కేరళగా మారిందని తెలుస్తోంది.

ఉత్సవములు[మార్చు]

మహా శివరాత్రి పండుగ సందర్భంగా విద్యుత్ కాంతులతో అలంకరించారు
  • మహా శివరాత్రి ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగ. పండుగ సమయములో సుమారు లక్ష దీపములు ఈ ఆలయములో వెలిగిస్తారు. వడక్కునాథన్ విగ్రహం ఊరేగింపునకు బయటకు తీయబడదు. మహా శివరాత్రి రోజున నెయ్యి లేత కొబ్బరికాయ జలముతో నిరంతరం అభిషేకం చేస్తారు.[2]
  • త్రిస్సూర్ పూరం కేరళలో అత్యంత శక్తివంతమైన ఆలయ ఉత్సవాలుగా భావిస్తున్నారు, ఇది అద్భుతమైనది దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో భక్తులను పాల్గొంటారు. ఈ ఉత్సవంలో ఆలయంలోని వివిధ పొరుగు దేవాలయాల నుండి వచ్చిన ఏనుగుల అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. ఇది ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యి రెండవ రోజు మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. ఈ ఉత్సవములో ప్రజలు అందరూ కుల మతాలతో సంబంధం లేకుండా పాల్గొంటారు.[3]

ఆలయ నిర్మాణం[మార్చు]

ఈ ఆలయం త్రిస్సూర్ నగరం మధ్యలో ఎత్తైన కొండపై చుట్టూ 9 ఎకరాల విస్తీర్ణం చుట్టూ రాతి గోడ ఉంది. ఈ కోట లోపల ఎదురుగా నాలుగు గోపురాలు ఉన్నాయి. లోపలి ఆలయం బయటి గోడల మధ్య, విశాలమైన ఆవరణ ఉంది దీనికి ప్రవేశం గోపుర ద్వారాల నుండి ఉంది. వీటిలో, దక్షిణ, ఉత్తరాన ఉన్న గోపురాలు భక్తులకు తెరవబడవు. భక్తులు తూర్పు లేదా పశ్చిమ గోపురం గుండా ప్రవేశిస్తారు. లోపలి ఆలయం బయటి ఆలయం నుండి విస్తృత వృత్తాకార గ్రానైట్ గోడతో నిర్మించి ఉంది.

కుడ్యచిత్రాలు[మార్చు]

ఈ ఆలయం కుడ్యచిత్రాలకు ప్రసిద్ధి చెందింది. వీటిలో వాసుకిశయన, నృతనాథ కుడ్యచిత్రాలు చాలా ప్రాముఖ్యత కలిగినవి. వీటిని ప్రతిరోజూ పూజిస్తారు. ఈ ఆలయంలో గోడపై వేసిన పురాతన చిత్ర లేఖనాలు, చెక్క బొమ్మలు, పురాతన కాలపు కళ సంగ్రహాలయములో వలె ఉన్నాయి. ఈ ఆలయంలోని రెండు చిత్రాలపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన అధ్యయనంలో ఇది 350 సంవత్సరాల పురాతనమైనవని తేలింది. ఈ రెండు అరుదైన చిత్రాలు ఒక వాలుగా ఉన్న శివుడు 20 చేతులతో నటరాజ విగ్రహం చాల ప్రాముఖ్యత కలిగింది.

మూలాలు[మార్చు]

  1. "Archaeological Survey of India". asi.nic.in. Retrieved 2020-12-02.
  2. "Archive News". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2020-12-02.
  3. "Thrissur Pooram". web.archive.org. 2012-03-14. Archived from the original on 2012-03-14. Retrieved 2020-12-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)