ఇనాం భూములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇనాం భూములు అంటే ముందుగా ఇనాం అంటే బహుమతి లేదా కానుక, మాన్యం అనే అర్థాలు ఉన్నాయి.క్లుప్తంగా ఇనాం భూములు అంటే ఉచితంగా, లేదా బహుమానంగా ఇచ్చిన భూములు.

చరిత్ర[మార్చు]

దేశానికి స్వాతంత్ర్య రాక ముందు పూర్వం భారతదేశాన్ని రాజులు, చక్రవర్తులు, జమీందారులు, నిజాం నవాబులు వంటి జాగీర్ దార్లు లేదా సంస్థానాధీశులు పరిపాలించారు. వారి వద్ద వివిధ వృత్తుల వారు పని చేసే వారు. వారికి నమ్మకంగా సేవలు అందించారు.అలాగే వివిధ రంగాలలో ప్రతిభావంతులైన అనగా కళాకారులకు, కవులుకు, రచయితలకు, ఆస్థాన పండితులకు, సంగీత విద్వాంసులకు చిత్రకారులకు, సైనికులుగా పనిచేసిన మొదలగు వారికి వారి ప్రతిభాపాటవాలను గుర్తిస్తూ ఆ కాలంలో ఇప్పటిలాగే నగదు చెలామణిలో ఉన్నా, ప్రతి ఫలంగా కొంత మంది వ్యక్తులకు లేదా సంస్థలకు వారి వారి అర్హతలను అనుసరించి, వారు అందించిన సేవలును బట్టి సాగుచేసుకోమ్మని భూములను దానంగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వారికి ఇచ్చిన భూములను ఇనాం భూములు అని నిర్వచించారు. ఆ తర్వాత ఆలయాల నిర్వహణ పరిధిలోనూ ఈ విధానం అమల్లోకి వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చాక రాచరిక రాష్ట్రాలు, జమీన్లు, సంస్థానాలు రద్దు అయ్యాయి. 1956లో ఇనామ్ రద్దు చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇనామ్ పేరుతో సాగు చేస్తున్న భూములు, వాటిని పొందిన వారిని గుర్తించి, వారి వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి రైత్వారీ పట్టాలు అందజేసింది. 1957లో ఇనామ్ రద్దు-రైత్వారీ పట్టాలుగా మార్పిడి చట్టం తీసుకొచ్చింది. [1][2]

ఇనాం భూములు[మార్చు]

ఇనామ్‌భూములు వివిధ రకాలుగా ఉన్నాయి.

  • సేవా ఇనామ్‌లు:- సేవా ఇనామ్ అనేది ఒక వ్యక్తి లేదా వారిపై భారం పడే వ్యక్తులకు మంజూరు చేయబడిన ఇనామ్. వాటికి ఉదాహరణగా రజక, కుమ్మరి, వడ్రంగి మొదలైన వృత్తుల వారికి దానంగా ఇచ్చే భూములు.
  • ఎన్‌ఫ్రాంచైజ్డ్ ఇనామ్:- ఎన్‌ఫ్రాంచైజ్డ్ ఇనామ్ అంటే దాని హోల్డర్ నుండి రిలీవ్ చేయబడినది. భూములపై క్విట్రెంట్ చెల్లింపుకు లోబడి సేవా షరతులు. అతనికి అన్ని అధికారాలు ఉంటాయి ఒక ryotwari హోల్డర్ యొక్క. అటువంటి ఫ్రాంచైజ్ చేయబడిన ఇనామ్ భూములపై చెల్లించవలసిన క్విట్రెంట్ సాధారణంగా 1/4వ వంతు లేదా భూమిపై చెల్లించాల్సిన పూర్తి అసెస్‌మెంట్‌లో 1/8వ వంతు లేదా మొత్తం.
  • ప్రధాన ఇనామ్‌లు:- ఒక ప్రధాన ఇనామ్ మొత్తం గ్రామం లేదా గ్రామంలోని ప్రధాన భాగాన్ని కలిగి ఉంటుంది. ఇనామ్‌గా మంజూరు చేయబడింది లేదా ఇనామ్ కమిషనర్ ద్వారా ధృవీకరించబడింది.
  • చిన్న ఇనామ్‌లు:- మైనర్ ఇనామ్‌లో దాదాపు ఐదు లేదా పది ఎకరాల భూమి ఉంటుంది.అది ఇనామ్‌గా మంజూరు చేయబడింది. ఇనామ్ కమిషనర్ ద్వారా ధృవీకరించబడింది లేదా గుర్తించబడింది.
  • దరిమిలా ఇనామ్‌లు:- దరిమిలా ఇనామ్ అనేది సెటిల్‌మెంట్ అనంతరం మూలానికి చెందిన ఇనామ్, అంటే భూమి రూపంలో మంజూరు చేయబడింది. 1802లో శాశ్వత స్థిరనివాసం తర్వాత ఒక ఎస్టేట్ భూమి యజమానికి దరిమిలా ఇచ్చే ఇనాములు.
  • అవి రెండు వర్గాలకు చెందుతాయి, అవి.1) భూ యజమానుల వ్యక్తిగత సేవలో ఉన్నవి.2) గ్రామ సమాజానికి సేవ చేయడానికి ఉద్దేశించినవి.
  • గ్రామ వృత్తుల ఇనామ్‌లు:- గ్రామ వృత్తుల ఇనామ్‌లు అనేవి రాష్ట్ర సేవల కోసం మంజూరు చేసిన ఇనామ్‌లు.అవి మంగలి వృత్తి, వడ్రంగి వృత్తి, కమ్మరి వృత్తి, చాకలి వృత్తి వారు, కుమ్మరులు, పురోహితులు, ఇతర కళాకారులు గ్రామ సమాజానికి సేవలు అందజేయాలి
  • దశబంధం ఇనామ్‌లు: - దశబంధం ఇనామ్ అంటే భూమి లేదా ఆదాయాన్ని మంజూరు చేయడం.ఇవి చెరువు నిర్మాణం, కాలువల నిర్మాణం, భావి నిర్మాణం, సత్రాల నిర్మాణం లాంటి వాటికి పరిహారంగా ఇచ్చే ఇనాములు.అవి ఆదాయానికి సంబంధించిన కేటాయింపు అయితే శామిల్తాత్ దశబంధ ఇనాములు అంటారు.
  • మొత్తం ఇనాంలు:- మొత్తం ఇనాం గ్రామం అనేది ఇనామ్‌గా మంజూరు చేయబడిన గ్రామం లేదా అగ్రహారాలను కలిగి ఉంటుంది.దీనికి పూర్తిగా భూమిపై పన్ను లేకుండా లేదా అనుకూలమైన తగిన కాలపరిమితి తర్వాత నిష్క్రమించే పద్దతిపై ఇచ్చే ఇనాములు.

ఇనామ్ భూముల రద్దు చట్టం[మార్చు]

స్వాతంత్రం అనంతరం సంస్థానాలు, జమీన్లు రద్దుకావటంతో 1956లో ప్రభుత్వం ఇనాం రద్దు చట్టాన్ని తీసుకొచ్చింది.[3][4] ఆ తర్వాత రెవెన్యూ రికార్డులు, ఆర్‌.ఎస్.ఆర్‌, ఎఫ్‌.ఎల్‌.ఆర్‌. నందు వాటిని ఇనాం భూములుగానే నమోదయ్యాయి. ఇనాం భూములు సాగుచేసుకున్న వారిని గుర్తించి వారి పేర్లతో ఫారం-8 కింద రెవెన్యూ రికార్డులను పరిశీలించి రైత్వారీ పట్టాలు మంజూరుచేశారు. ఆనాటి రెవెన్యూ రికార్డుల్లో ప్రధానమైన 10-1లో ఇనాం పట్టాదారులుగా నమోదయ్యారు. జమీందారీ (ఎస్టేట్‌) గ్రామాల్లో అత్యధికంగా ఇనాం భూములే ఉండేవి.[5] ఈ ఇనాంలు మేజర్ ఇనాం, మైనర్ ఇనాం అని పిలువబడ్డాయి.

  • మేజర్ ఇనాం (శోత్రియం) - ఒక గ్రామం కంటే ఎక్కువ భూమి ఉండే ఇనాం.
  • మైనర్ ఇనాం (ఖండిక) - ఒక గ్రామం కంటే తక్కువ భూమి ఉండే ఇనాం

శాశ్వత శిస్తు వసూలు పద్దతి[మార్చు]

1802 లో శాశ్వత శిస్తు వసూలు పద్దతి అమలులోకి వచ్చింది.దానిని 3 రకాలుగా వర్గీకరించారు.

  • శిస్తు మదింపు చేయడానికి జమీందారీలలో భాగంగా గుర్తించిన ఇనాములు.
  • జమీందారీ పద్ధతి అమలుచేసిన తరువాత ఇవ్వబడిన ఇనాములు.
  • జమీందారీ వద్దతిలో మినహాయించబడిన ఇనాములు.

1802 లో ఒక రెగ్యులేషన్ చట్టం[మార్చు]

ఈ చట్టం ప్రకారం ఇనాము అనగా

  • ఉత్తర సర్కారు జిల్లాలలో 1768 ఫిబ్రవరి 26కు పూర్వం ఇవ్వబడి, దాన పత్రం ఉండాలి.
  • కర్ణాటక ప్రాంతంలో 1792 జూలై 12కు పూర్వం ఇవ్వబడి, దానపత్రం ఉండాలి.
  • దత్తత మండలాలలో 1800 అక్టోబర్ 12కు పూర్వం ఇవ్వబడి, దానపత్రం ఉండాలి.

1858లో ఇనాములకు సంబంధించిన వివాధాలను తొలగించడానికి ఇనాం కమీషనర్గా జి.ఎస్. టైలర్ ను నియమించారు. 1858 కి పూర్వం 50 సం॥ల నుండి ఇటువంటి భూములు కలిగిన వారిని ఇనాందార్లుగా గుర్తించారు

1950 నాటికి ఆంధ్రప్రాంతంలో భూమిశిస్తు విధానం, సేద్యం భూమి[మార్చు]

  • జమీందారీ పద్దతి: 152 లక్షల ఎకరాలు
  • రైత్వారీ పద్ధతి: 112 లక్షల ఎకరాలు
  • ఇనాందారీ పద్దతి: 2.1 లక్షల ఎకరాలు

ఈ విధంగా జమీందార్లు, ఇనాందార్ల వద్ద అధిక భూమి కేంద్రీకృతం అయింది.వీరు వ్యవసాయదారులకు భూమిని కౌలుకి ఇచ్చి వారి నుండి ఎక్కువ పన్నులు వసూలు చేసేవారు. ఈ సాంఘిక దురాచారాన్ని రూపుమాపడానికి భూసంస్కరణలు అవసరం భూమిలేని వారికి మిగులు భూమిని పంచి, దున్నేవారికి భూమిపై హక్కులు కల్పించడం వలన సమాజంలో వర్గపోరాటం నివారించబడింది.

మూలాలు[మార్చు]

  1. techpatashala (2022-07-14). "What is Inam Lands in Telugu: ఇనాం భూములు అంటే ఏమిటి? వాటిని అమ్ముకోవచ్చా..?". Tech Patashala | Telugu Business News. Retrieved 2023-08-16.
  2. https://telugu.oneindia.com/news/amaravati/presidential-approval-the-ordinance-the-inam-lands-239460.html
  3. https://telugu.oneindia.com/news/amaravati/presidential-approval-the-ordinance-the-inam-lands/articlecontent-pf209676-239460.html
  4. admin (2020-04-17). "ఇనాం భూముల ర‌ద్దు చ‌ట్టం 1955". Udyoga Kranthi. Retrieved 2023-08-16.
  5. Eenadu. "ఇనాం భూములకు మోక్షమెన్నడు? - EENADU". www.eenadu.net. Archived from the original on 2020-01-25. Retrieved 2020-01-25.

వెలుపలి లంకెలు[మార్చు]